‘‘ఇండియన్ ఇంటెలిజెన్సీ బ్యూరో ప్రతినిధులు పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఓ స్పై ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ మిషన్ సక్సెస్‌ఫుల్ కావడం వల్ల వేలాదిమంది భారతీయుల ప్రాణాలు రక్షించబడ్డాయి. ఈ మిషన్ తాలూకు విషయాలను తెలుసుకోవాలంటే ‘ఐబీ 71’ సినిమా చూడాలి. ఓ చారిత్రాత్మక ఘటనతో తీసిన ఈ చిత్రంలో దేశభక్తి తాలూకు మూమెంట్ప్ ఉంటాయి’’ అన్నారు దర్శకుడు సంకల్ప్‌రెడ్డి.
విద్యుత్ జమాల్ హీరోగా నటించి, నిర్మించిన హిందీ థ్రిల్లర్ ‘ఐబీ 71’. అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సంకల్ప్‌మాట్లాడుతూ– ‘‘ఘాజీ’ ఇన్సిడెంట్‌కు ముందు కశ్మీర్‌లో జరిగిన ఓ ఘటన ఆధారంగా తీసిన చిత్రమే ‘ఐబీ 71’. ‘ఘాజీ’, ‘రాజీ’, ఇప్పుడు ఈ ‘ఐబీ 71’.. ఇవన్నీ ఇండియా–పాకిస్తాన్ (1971) యుద్ధానికి ముందు జరిగిన ఘటనల నేపథ్యంలో వచ్చిన సినిమాలు.
ఈ ఘటల తాలుకూ విషయాలు అప్పట్లో న్యూస్‌పేపర్స్‌లో ప్రచురితమయ్యాయి. ఆ సమాచారం ఆధారంగా, కొత్తమంది వ్యక్తుల ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. ‘ఘాజీ’, ‘అంతరిక్షం’, ఇప్పుడు ‘ఐబీ 71’ కథల్లో భాగంగానే దేశభక్తి అంశం మిళితమై ఉంది. అంతేకానీ ప్రత్యేకంగా దేశభక్తి నేపథ్యాల్లో చేయాలని నేనీ సినిమాలు చేయలేదు. అలా కుదురుతోంది.. అంతే. బహుశా అంతర్లీనంగా నాలో ఉన్న దేశభక్తి ఓ కారణమేమో! హిందీలో నాకు ‘ఐబీ 71’ తొలి సినిమా. తెలుగులో నా తొలి సినిమా ‘ఘాజీ’ అండర్‌వాటర్ బ్యాక్‌డ్రాప్, రెండో సినిమా ‘అంతరిక్షం’ స్పేస్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయి. ‘ఐబీ 71’ బ్యాక్‌డ్రాప్ ఆకాశం. అలాగే భూమి, నిప్పుల బ్యాక్‌డ్రాప్‌లో కూడా సినిమాలు చేయాలని ఉంది’’ అని అన్నారు.
నా సినిమాల్లో దేశభక్తి అలా కుదురుతోంది!
Published Sat, May 13 2023 4:11 AM | Last Updated on Sat, May 13 2023 4:11 AM
Comments
Please login to add a commentAdd a comment