విద్యుత్‌ జమాల్.. కలరిపయట్టు | Vidyut Jammwal to popularise Kalaripayattu | Sakshi

మెదడుతో చూడండి

Dec 7 2020 6:06 AM | Updated on Dec 7 2020 7:12 AM

Vidyut Jammwal to popularise Kalaripayattu - Sakshi

‘కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్‌ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు’ అని ‘దూకుడు’ సినిమాలో మహేశ్‌బాబు అంటారు. బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో విద్యుత్‌ జమాల్‌ కూడా ఇలాంటి మాటే అంటున్నారు. ‘మెదడు గుడ్డిది అయితే కళ్లు ఉన్నా ఉపయోగం లేదు’ అంటున్నారు ఆయన. వీలున్నప్పుడల్లా తన సినిమాల్లో మార్షల్‌ ఆర్ట్స్‌ను ప్రదర్శిస్తూ ఉంటారాయన. అలానే తన సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు మార్షల్‌ ఆర్ట్స్, ఫిట్‌నెస్‌ విషయాలనే ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. తాజాగా ప్రాచీన యుద్ధ విద్య కలరిపయట్టులో శిక్షణ తీసుకుంటున్న ఓ వీడియోను పంచుకున్నారు. కళ్లకు మైనం వేసుకొని దాని మీద ఓ బట్టతో కళ్లు కట్టేసుకున్నారు. కత్తి తీసుకుని పండ్లను నేర్పుగా కట్‌ చేయడం ఆ వీడియోలో కనబడుతుంది. ‘‘ఈ ఆర్ట్‌ వల్ల మన ఫోకస్‌ మొత్తం ఒక పని మీద పెట్టడం అలవర్చుకోవచ్చు. చాలా ఏళ్లుగా ఈ విద్యను నేర్చుకోవాలనుకున్నాను. ఇప్పటికి కుదిరింది’’ అన్నారు విద్యుత్‌ జమాల్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement