తనను తాను రక్షించుకోవాడానికే బాక్సింగ్, కరాటే నేర్చుకున్నానని చెబుతోంది హీరోయిన్ రితికా సింగ్. ‘గురు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బాక్సింగ్ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగు,తమిళ, మలయాళ సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌తో కలిసి నటించిన ‘వేట్టయాన్’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రితికా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను ఎందుకు కరాటే, బాక్సాంగ్ నేర్చుకోవాల్సి వచ్చిందో చెప్పింది.
‘మన జీవితంలో ఎప్పుడైనా ఊహించని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. వాటిని తట్టుకొని నిలబడడానికి మనం సిద్ధంగా ఉండాలి. అమ్మాయిలు బయటకు వెళ్తే దురదృష్టవశాత్తు ఏమైనా జరగొచ్చు. నన్ను నేను రక్షించుకోవడానికే కరాటే, బాక్సింగ్ నేర్చుకున్నాను. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే..కొంతమంది వద్దని చెప్పారు. ‘నీ కరాటే వీడియోలు చూసి నెటిజన్లు భయపడిపోతున్నారు. వాటిని షేర్ చేయకండి’ అని కొంతమంది నాకు సలహా ఇచ్చారు. కానీ నేను మాత్రం షేర్ చేయడం ఆపలేదు.
కరాటే వీడియోలే కాదు.. శారీ ఫోటో షూట్, డ్యాన్స్ వీడియోలు కూడా షేర్ చేస్తుంటాను. ఒక నటిగా నేను ఏం చేయగలనో అన్ని చేశాను. అయినా కూడా కొంతమంది విమర్శిస్తుంటారు. వాటని పట్టించుకోను. ఎవరో ఏదో అన్నారనని నా ట్రైనింగ్ మానుకోలేదు. ఇప్పటికే కరాటే, బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. అది నాకు ఇష్టమైన పని. నేను ఇంత స్ట్రాంగ్ ఉండడం మంచిది కాదని కొంతమంది సలహా ఇస్తున్నారు. ఎందుకు ఉండకూడదు? నేను బయటకు వెళ్లినప్పుడు ఏమైనా జరిగితే ఎవరు రక్షిస్తారు? నన్ను నేను రక్షించుకోవడానికే మార్షల్ ఆర్ట్స్‌లో బేసిక్స్ నేర్చుకున్నాను. అలా అని ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అన్యాయం జరిగితే ధైర్యంగా మన గళాన్ని వినిపించాలి. మన వాయిసే ఒక ఆయుధం కావాలి’ అని రితికా చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment