Kalaripayattu
-
చీరకట్టులో కత్తి పాఠాలు! ఆమె కర్ర పట్టిందంటే..
కేరళలో అతి ప్రాచీనమైన యద్ధకళ కలరిపయట్టు . దీన్ని యుద్ధాలు చేయడానికి ఉపయోగించే ఓ గొప్ప కళగా చెబుతారు. పురాణాల ప్రకారం ఈ కళకు అగస్త్యముని, పరశురాముడి మూలకర్తలుగా చెబుతుంటారు. అలాంటి కలరిపయట్టులో 80 ఏళ్ల బామ్మ అసామాన్యమైన ప్రతిభను కనబర్చడమేగాక ఎందరికో గురువుగా ఆ యుద్ధకళకు సంబంధించిన పాఠాలు చెబుతుంది. అది కూడా ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఆ విద్యను నేర్పిస్తుంది. ఈ బామ్మ పద్శశ్రీ అవార్డు గ్రహిత కూడా. ఆమె కత్తి లేదా కర్ర పడితే చూపు తిప్పుకోలేరు. అంతలా ముగ్ధమనోహరంగా లయబద్ధంగా విన్యాసం చేస్తుంది. వివరాల్లోకెళ్తే..కేరళలో 80 ఏళ్ల బామ్మ మీనాక్షి గురక్కల్ని చూస్తే మహిళలు ఎందులోనూ తీసుపోరు అనుకుంటారు. ఎలాంటి సౌకర్యాలు, ప్రోత్సాహం లేని ఆ కాలంలోనూ కేరళలో అతి ప్రాచీన యుద్ధ విద్య, మార్షల్ ఆర్ట్స్‌లో పుస్తకాల్లో స్థానం దక్కించుకున్న ఓ గొప్ప కళ అయిన కకలరిపయట్టును ఈ బామ్మ అవలీలగా చేస్తుంది. అది కూడా ఆరుగజాల చీరలో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఆమె ప్రతి కదలిక అత్యంత మనోహారంగా ఉంటుంది. ఆమె ఈ విద్యను ఏడేళ్ల వయసు నుంచే నేర్చుకుంది. తన తండ్రి కలరి బృందం ప్రదర్శనను చూస్తూ పెరిగిన ఆమె తనకు తెలియకుండానే ఆ కళపై ఆసక్తి పెంచుకుంది. అలా ఆమె తన చెల్లెలు ఇద్దరూ ఈ కళను నేర్చుకున్నారు. ఆ కళలో మరింత నైపుణ్యం సంపాదించడం కోసం రాఘవన్ మాస్టర్ వద్ద చేరింది. కొన్నేళ్ల తర్వాత ఆ గురువునే వివాహం చేసుకుంది. వారిద్దరు కలిసి ఆ కలరిపట్టు తరగతులు నిర్వహిస్తారు. కానీ ఎవ్వరి వద్ద డబ్బులు వసూలు చేయరు. కానీ ఆ విద్య నేర్చుకున్న విద్యార్థులే చివర్లో తమ సామర్థ్యానికి తగిన విధంగా గురుదక్షిణ చెల్లిస్తే తీసుకోవడమే తప్ప ప్రత్యేకండా వారు ఏమి తీసుకోరు. ఈ విద్యను కేరళలో యుద్ధాలు చేసే యోధులకు నేర్పేవారట. ఆ తర్వాత క్రమేణ ఈ కళ క్షీణించింది. మీనాక్షి లాంటి బామ్మల కారణంగా ఇలాంటి సంప్రదాయ నృత్య కళ లాంటి యుద్ధ కళ కనుమరగవ్వకుండా ఉంది. ఏ కళ అయినా జీవం పోసుకుని కలకలం ఉండాలంటే..మన సంప్రదాయలను సంస్కృతిని గౌరవించినప్పుడే సాధ్యం. అందుకు ఉదహరణే ఈ మీనాక్షి బామ్మ. ఆమె కర్ర పట్టుకుని చేసిన కలరిపయట్టు యుద్ధం నెట్టింట వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Midhun Malathi Mohan (@iam_midhun_mohandas) (చదవండి: క్యాండిల్ సిస్టర్స్: చదువుకుంటూనే వ్యాపారవేత్తలుగా..!) -
వయసు 78.. బరిలో దిగిందో.. ప్రత్యర్థి మట్టి కరవాల్సిందే
తిరువనంతపురం: కొన్ని ఏళ్ల క్రితం మగ పిల్లలు ఆడే ఆటలపై అమ్మాయిలు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ముఖ్యంగా కరాటే, బాక్సింగ్ వంటి క్రీడలవైపు వెళ్లాలంటే అమ్మాయిలతో పాటు.. తల్లిదండ్రులు కూడా పెద్దగా ఇష్టపడేవారు కారు. ప్రస్తుతం ఈ ఆలోచన ధోరణి మారుతోంది. ఆటలకు ఆడా..మగా తేడా ఏంటని భావిస్తున్నారు. ఈ క్రమంలో చాలా వరకు క్రీడాంశాల్లో అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. అయితే వీరు కూడా ఆధునిక క్రీడలవైపే మొగ్గు చూపుతున్నారు కానీ మన సంప్రదాయ ఆటలపై ఆసక్తి కనపర్చడం లేదు. ఈ క్రమంలో కేరళకు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు మీనాక్షి అమ్మ మన దేశ పురాతన మార్షల్ ఆర్ట్ అయిన కలరిపయట్టులో పరాక్రమం చూపిస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ వివరాలు.. కేరళకు చెందిన వృద్ధురాలు మీనాక్షి అమ్మ భారతదేశ పురాతన మార్షల్ ఆర్ట్ కలరిపయట్టును నేటికి కూడా సాధన చేయడమే కాక అమ్మాయిలు దాన్ని సాధన చేసేలా ప్రొత్సాహిస్తున్నారు. ఈ సందర్భంగా మీనాక్షి అమ్మ మాట్లాడుతూ.. ‘‘ఏడేళ్ల వయసు నుంచే కలరి సాధన చేయడం ప్రారంభించాను. ఇప్పటికీ ప్రాక్టీస్ చేయడమే కాక ఇతరులకు నేర్పుతున్నాను’’ అని తెలిపారు. కలరిపయట్టు నేర్పే ఈ స్కూల్‌ని మీనాక్షి భర్త 1949లో ప్రారంభించాడు. ఆయన మరణం తర్వాత మీనాక్షి ఈ స్కూల్ బాధ్యతలు చూస్తున్నారు. (చదవండి: Calicut Riders Family: సాఫ్ట్వేర్ ఇంజనీర్, హోం మేకర్స్.. ఇంకా) ‘‘రోజు ఉదయం పేపర్ తెరిచామంటే.. మహిళపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఏదో ఓ వార్త ఉంటుంది. ఇలాంటి అరాచకాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కలరిపయట్టు నేర్చుకోవడం ఎంతో మంచింది. ఈ మార్షల్ ఆర్ట్ కళను నేర్చుకోవడం వల్ల మహిళలు శారీరకంగా, మానసికంగా ధృడంగా తయారవుతారు. వారి మీద వారికి నమ్మకం పెరుగుతుంది.. ఒంటరిగా ఉద్యోగాలకు వెళ్లడం.. ప్రయాణాలు చేయాల్సి వచ్చినా వారు భయపడరు’’ అన్నారు మీనాక్షి. ‘‘కలరిపయట్టులో పూర్తిగా నిమగ్నం అయితే మన శరీరమే కళ్లవుతాయి. ప్రత్యర్థి మాయమవుతాడు. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి శాంతికి సంబంధించింది అయితే మరోకటి యుద్ధంలో వాడేది. కలరిపయట్టు నేర్చుకోవడం వల్ల మనసు, బుద్ధి, శరీరం, ఆత్మ పూర్తిగా శుద్ది అవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. వేగం, శాంతి పెరుగుతాయి. శారీరక, మానసిక శక్తి పునరుత్తేజమవుతోంది’’ అన్నారు. (చదవండి: అప్పుడు కేరళలో.. ఇప్పుడు తమిళనాడులో.. ఆ హక్కు మీకు ఉంది!) నృత్యం,యోగా అంశాలను కలిగి ఉన్న కలరిపయట్టులో కత్తులు, కవచాలు, వంటి ఆయుధాలు ఉంటాయి. కలరి 3,000 సంవత్సరాల పురాతనమైనది. దీని గురించి ప్రాచీన హిందూ గ్రంథాలలో ప్రస్తావించారు. అయితే బ్రిటీష్ పాలనలో కలరిపయట్టు సాధనపై నిషేధం విధించారు. అయితే స్వాతంత్య్రం వచ్చాక నిషేధాన్ని తొలగించినప్పటికి పూర్వ వైభవం రాలేదు. కాకపోతే 20వ శతాబ్దం ప్రారంభం నుంచి కలరిపయట్టుపై ఆసక్తి చూపే వారి సంఖ్య పెరగడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. చదవండి: విద్యుత్ జమాల్.. కలరిపయట్టు -
వైరల్: ఆనంద్ మహీంద్రా ట్వీట్లో పొరపాటు.. ‘నేను అమ్మాయిని కాను’
ఎప్పుడూ ఫన్నీ వీడియోలు, స్పూర్తినిచ్చే పోస్టులతో నెటిజనులను ఆశ్చర్యపరిచే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియోను షేర్ చేశారు. గురువారం ఓ బాలుడు ప్రాచీన యుద్ధ విద్య కలరిపయట్టు నేర్చుకుంటున్న వీడియోను తన ట్విటర్లో పోస్టు చేశారు. ఈ వీడియోలో తొమ్మిదేళ్ల బాలుడు చేతిలో కర్రను పట్టుకొని అవలీలగా కలరిపయట్టు సాధన చేస్తున్నాడు. అతన్ని కేరళలోని ఏక వీర కలరిపయట్టు అకాడమీ విద్యార్థి నీలకందన్ నాయర్‌గా గుర్తించారు. అయితే ఈ పోస్టులో ఆనంద్ మహీంద్రా ఓ చిన్న తప్పిదం చేశారు. వీడియోలో కలరిపయట్టు చేస్తున్న పిల్లవాడిని అమ్మాయనుకొని పొరపాటుగా ‘బాలిక’గా పేర్కొన్నారు ‘హెచ్చరిక ఈ యువతి దారిలోకి రాకండి. క్రీడా రంగంలో కలరిపయట్టుకు మరింత ప్రాధాన్యత అందించాలి. అప్పుడే ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించలదు అని పేర్కొన్నారు. కాగా ఆనంద్ మహీంద్రా తప్పుగా ట్వీట్ చేసినప్పటికీ ఈ వీడియోను చూసిన నెటిజన్లు సంబరపడిపోతున్నారు. బాలుడి నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. నిజానికి ఆనంద్ మహీంద్రా పోస్ట్‌పై నీలకందన్ కూడా స్పందించాడు. ‘మీ మద్దతు, ప్రోత్సాహానికి చాలా ధన్యవాదాలు సర్. కానీ ఒక చిన్న దిద్దుబాటు.. నేను అమ్మాయిని కాదు, 10ఏళ్ల అబ్బాయిని. కలరిపయట్టు విద్యలో ఒక షార్ట్ మూవీలో నటించడం కోసం నా జుట్టు పొడవుగా పెంచుతున్నాను’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా కలరిపయట్టు ఆధునిక కేరళలో ఒక పురాతన యుద్ధ కళారూపం. కళరిపయట్టు దీనినే కలరి అని కూడా పిలుస్తారు. కర్రలు, కత్తులు, కవచాలను ఉపయోగించి చేసే ఇది భారత్‌లో ఇప్పటికీ కొనసాగుతున్న పురాతన మార్షల్ ఆర్ట్. చదవండి: విమానంలో సిగరెట్ తాగిన యువతి.. ప్రయాణికులు షాక్ WARNING: Do NOT get in this young woman’s way! And Kalaripayattu needs to be given a significantly greater share of the limelight in our sporting priorities. This can—and will— catch the world’s attention. pic.twitter.com/OJmJqxKhdN — anand mahindra (@anandmahindra) August 26, 2021 Thanks a lot for your support and encouragement sir! A small correction - I am not a girl, I am a 10 year old boy. I am growing my hair long for a role in a planned short movie on Kalaripayattu. 🙏 — Prince Of Kalaripayattu (@PrinceKalari) August 27, 2021 -
విద్యుత్ జమాల్.. కలరిపయట్టు
‘కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు’ అని ‘దూకుడు’ సినిమాలో మహేశ్‌బాబు అంటారు. బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమాల్ కూడా ఇలాంటి మాటే అంటున్నారు. ‘మెదడు గుడ్డిది అయితే కళ్లు ఉన్నా ఉపయోగం లేదు’ అంటున్నారు ఆయన. వీలున్నప్పుడల్లా తన సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్‌ను ప్రదర్శిస్తూ ఉంటారాయన. అలానే తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మార్షల్ ఆర్ట్స్, ఫిట్నెస్ విషయాలనే ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. తాజాగా ప్రాచీన యుద్ధ విద్య కలరిపయట్టులో శిక్షణ తీసుకుంటున్న ఓ వీడియోను పంచుకున్నారు. కళ్లకు మైనం వేసుకొని దాని మీద ఓ బట్టతో కళ్లు కట్టేసుకున్నారు. కత్తి తీసుకుని పండ్లను నేర్పుగా కట్ చేయడం ఆ వీడియోలో కనబడుతుంది. ‘‘ఈ ఆర్ట్ వల్ల మన ఫోకస్ మొత్తం ఒక పని మీద పెట్టడం అలవర్చుకోవచ్చు. చాలా ఏళ్లుగా ఈ విద్యను నేర్చుకోవాలనుకున్నాను. ఇప్పటికి కుదిరింది’’ అన్నారు విద్యుత్ జమాల్. -
ప్రాక్టీస్.. ప్రాక్టీస్
ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, అదితీ రావ్ హైదరి, శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా తొలి షెడ్యూల్ థాయ్‌ల్యాండ్‌లో జరిగింది. ‘జయం’ రవి, కార్తీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సెకండ్ షెడ్యూల్‌ను ఆరంభించాలనుకుంటున్న సమయంలో కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మళ్లీ షూటింగ్ ప్రారంభమయ్యేలోపు కథలోని పాత్రలకు తగ్గట్లుగా మౌల్డ్ అయ్యే పనిలో ఉన్నారు ఈ చిత్రంలోని నటీనటులు. ఇందులో భాగంగానే అదితీ రావ్ హైదరి కలరిపయట్టు ప్రాక్టీస్ చేస్తున్నారు. లాక్డౌన్ వల్ల ఇంటిపట్టునే ఉంటున్న అదితీ ఈ మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్‌కే రోజులో ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నారట. తన ప్రాక్టీస్ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు అదితీ రావ్. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. -
శక్తి సేన
అధికారులు గట్టిగా సంకల్పిస్తే మంచి పనులు మొదలవుతాయి. దిశ, సమత ఘటనలు చట్టాలతో మాత్రమే కట్టడి కావు. అధికారులు కూడా పూనుకోవాలి. ప్రజలలోకి వెళ్లాలి. ప్రజలతో మాట్లాడాలి. తెలంగాణలోని కొందరు కలెక్టర్లు, పోలీసు అధికారులు అమ్మాయిల భద్రత కోసం స్వచ్ఛందంగా పని చేస్తున్నారు. వారిలో పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన ఒకరు. ఆమె ఏం చేస్తున్నారో ఆమె మాటల్లోనే... ‘‘మూడేళ్ల క్రితం నేను జనగామ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు అక్కడ విద్యార్థినిలకు కరాటేలో శిక్షణ మొదలుపెట్టించాను. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఓ మూడు నెలల కిందట.. మీనాక్షమ్మ అనే డెబ్బై అయిదేళ్లావిడ చురుగ్గా కలరిపయట్టు యుద్ధవిన్యాసాలు చేస్తున్న వీడియో ఒకటి యూట్యూబ్‌లో చూశాను. అంత పెద్దావిడ అంత ఎనర్జిటిక్‌గా కదలడం ఆశ్చర్యమనిపించింది. అప్పుడు వచ్చింది ఆలోచన.. స్కూల్లోని అమ్మాయిలకు కూడా ఆత్మరక్షణ కోసం ఈ విద్యను నేర్పించాలని. ఇందుకోసం పకడ్బందీగా ప్లాన్‌చేయాలని అనుకున్నా. ఈలోపే దిశ ఘటన జరగడంతో ఇక ఏమాత్రం ఆలస్యం పనికిరాదని వెంటనే కేరళలోని కలరిపయట్టు నేర్పించే బృందాన్ని పిలిపించాం. ఈ నెల (డిసెంబర్) 22 నుంచి జిల్లాలోని అన్ని స్కూళ్లలో శిక్షణను ప్రారంభించనున్నాం. శారీరకంగా, మానసికంగా అమ్మాయిలు దృఢంగా ఉండాలని ‘శక్తి’ పేరుతో మా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థినులకు కలరిపయట్టు విద్యలో శిక్షణను ఇప్పించబోతున్నాం. ముందు విడతలో వాళ్లు విద్యార్థినులతోపాటు అదనపు సమయం కేటాయించి పీఈటీలకూ ట్రైనింగ్ ఇస్తారు. పరీక్షల కోసం ఫిబ్రవరి, మార్చిలో శిక్షణను ఆపేసి.. పరీక్షల తర్వాత మళ్లీ ‘శక్తి శిక్షణ’ మొదలవుతుంది. దీన్నొక కోర్స్‌గా పెట్టాలనుకుంటున్నాం. అ కావలసిన నిధుల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. వస్తాయి కూడా. ప్రస్తుతానికైతే అందుబాటులో ఉన్న నిర్భయ నిధులు వంటివి వాడుతున్నాం. అమ్మాయిలకు శిక్షణ.. అబ్బాయిలకు చైతన్యం అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించి వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ఎంత అవసరమో జెండర్ ఈక్వాలిటీ విషయంలో అబ్బాయిలను చైతన్యపర్చడమూ అంతే అవసరం. అందుకే ‘శక్తి’ కోర్సు ద్వారా శిక్షణను అమ్మాయిల మీద ఫోకస్ చేస్తూ ‘స్పృహ’ ద్వారా అబ్బాయిల మీద అవగాహన కోసం దృష్టి పెడ్తున్నాం. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులనూ భాగస్వామ్యం చేస్తున్నాం. మగపిల్లలతోపాటు తల్లిదండ్రులకూ లింగ వివక్ష నేరమనే అవగాహన కల్పించాలనుకుంటున్నాం. కొడుకు, కూతురు ఇద్దరూ సమానమనే ఎరుక తల్లిదండ్రులకు వచ్చి అది పెంపకంలో కనిపిస్తేనే ఆ ప్రభావం మగపిల్లల మీద ఉంటుంది. అలాగే అమ్మాయిలూ తమతో సమానమేనని.. వాళ్లను తోటి పౌరులుగా గౌరవించాలనీ చెప్పిస్తున్నాం. ఈ ‘స్పృహ’ కార్యక్రమానికి సమాచార శాఖ, ఐసిడిఎస్ ప్రధానంగా పనిచేస్తున్నా.. అన్ని శాఖల సహకారాన్నీ తీసుకుంటున్నాం. ‘స్పృహ’కు సంబంధించి గ్రామాల్లో అధికారులే స్వయంగా తల్లిదండ్రులను సంప్రదించి, వాళ్లతో ఇంటరాక్ట్ అవుతారు. డ్రాప్ అవుట్స్కూ దారి.. దిశ నేరానికి పాల్పడిన నలుగురిలో ఇద్దరు ఏమీ చదువుకోనివాళ్లు. అందులో ఒకరు డ్రాప్ అవుట్. ఇలా మధ్యలో చదువు మానేసిన వారిని గుర్తించేందుకు జిల్లాలో సర్వే చేపట్టాం. వారికి బ్యాంకు రుణాలు ఇప్పించి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌తో వాళ్లను ఓ దారిలో పెట్టే చర్యలనూ ప్రారంభించాం. చదువు మానేసిన వారితో పాటు చదువుకుని ఏ ఉపాధి లేకుండా ఉన్నవారినీ గుర్తించి వారికీ రుణసహాయం అందించి స్వయం ఉపాధి పొందేలా చూస్తాం. వీటన్నిటితోపాటు అబ్బాయిల పెంపకంపై తల్లిదండ్రులకు అవగాహన పెంచే కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. కంటి తుడుపు మాటలు వద్దు.. దిశ సంఘటన తరువాత చాలా మంది సినీనటులు నిరసన వ్యక్తం చేశారు. మంచిదే. కాని వాళ్లు నటించిన సినిమాల్లో హీరోయిన్ల పట్ల వ్యవహరించిన తీరు కూడా గమనించాలి. సమాజం మీద ప్రభావం చూపే సినిమా మాధ్యమం బాధ్యతగా ఉండాలి. ఇక నుంచైనా అమ్మాయిలను బొమ్మల్లా చూపించే సంస్కృతి విడనాడాలని ఆశిస్తున్నా. దుస్తుల మీద కామెంట్ ఎందుకు? అత్యాచారం జరిగింది అనగానే ముందు కామెంట్ చేసేది ఆడవాళ్ల వస్త్రధారణ మీదే. ఈ పద్ధతి మారాలి. పసిపిల్ల ఎలాంటి డ్రెస్ వేసుకుందని రేప్ చేశారు? మారుతున్న సమాజానికి అనుగుణంగా మహిళలు దుస్తులు ధరిస్తున్నారు. మహిళలనూ తమ తోటి పౌరులుగా చూసే రోజు రావాలి’’ అంటూ ముగించారు కలెక్టర్ శ్రీదేవసేన. – కట్ట నరేంద్రచారి, సాక్షి, పెద్దపల్లి, – సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి ఫోటోలు: మర్రి సతీష్‌రెడ్డి డైనమిక్ కలెక్టర్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా శ్రీదేవసేన చేస్తున్న పనులు రాష్ట్రంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నాయి. స్వచ్ఛభారత్ లక్ష్యసాధనలో పెద్దపల్లిని ముందు వరుసలో నిలిపారు. ఆమె కార్య నిబద్ధతకు అందిన స్వచ్ఛ్ సర్వేక్షణ్, దీన్‌దయాల్ గ్రామీణ వంటి పురస్కారాలే నిదర్శనం. ఏపీ దిశ– 2019 దిశ సంఘటన నేపథ్యంలో మహిళల భద్రతకు సంబంధించి నిర్మాణాత్మకమైన ఆలోచన చేసింది ఆంధ్రప్రదేశ్. పౌరుల్లో హింసాత్మక ప్రవృత్తిని తగ్గించేందుకు చట్టంతో పరిష్కారాన్ని సూచించింది ‘‘ఏపీ దిశ –2019’’ చట్టాన్ని రూపొందించి. దీనికి సంబంధించి దేశంలో సర్వత్రా ఆనందం వ్యక్తమయింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ అయితే.. ఈ చట్టం కేంద్రానికీ స్ఫూర్తిదాయకమని.. కేంద్రమూ ఆ దిశలో ఆలోచించి సత్వర న్యాయం అందేలా మార్పులు తేవాలని అన్నారు. సురక్షిత కామారెడ్డి కామారెడ్డి జిల్లాలో మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలూ జరుగకుండా నిరోధించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ‘సురక్షిత కామారెడ్డి’ అనే కార్యక్రమాన్ని చేపట్టాం. జిల్లాలోని అన్ని ఊళ్లలో చైతన్య కార్యక్రమాలను ఆరంభించాం. ఇందులో అన్ని శాఖల అధికారులను, స్వచ్ఛంద సంస్థలను, మహిళలను, మొత్తం సమాజాన్నే భాగస్వాములను చేస్తున్నాం. వచ్చే మార్చి నెలాఖరులోపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు స్వీయరక్షణతో పాటు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధమైంది. మహిళా పోలీసు సిబ్బందికి పురుషులతో సమానంగా డ్రైవింగ్ నేర్పించాం. మహిళలపై జరిగే దాడులను తిప్పికొట్టడంలో విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. ఆత్మరక్షణ పద్ధతులను నేర్పించాం. ఇది నిరంతరం కొనసాగేలా ప్రణాళిక రూపొందించాం. – ఎన్.శ్వేత, కామారెడ్డి జిల్లా ఎస్పీ -
సిలిండర్‌తో నటుడి వింత చేష్టలు!
ముంబై: బాలీవుడ్ యాక్షన్ హీరో, కండల వీరుడు విద్యుత్ జమాల్ ఫుల్ సిలిండర్‌తో ఏకంగా వర్కవుట్లు చేయడం మొదలెట్టాడు. సోషల్ మీడియాలో తరచూ తను చేసే వర్కవుట్ సెషన్ వీడియోలు పోస్ట్ చేసే జమాల్, గురువారం తాజాగా పోస్ట్ చేసిన వీడియోతో అందరిని హడలెత్తిస్తున్నాడు. అంతేకాక తాను ఫుల్ సిలిండర్‌తో చేసిన విన్యాసాలను మీరూ ట్రై చేయండి అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. విద్యుత్ జమాల్ నటుడిగా మాత్రమే కాక, మార్షల్ ఆర్టిస్ట్‌గా, స్టంట్స్మాన్గా బాలీవుడ్లో మంచి పేరుంది. ఆయన నటించిన జంగ్లీ, కమాండో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొల్తాకొట్టినా.. తను చేసిన యాక్షన్ సీన్స్‌కు గాను ప్రతిష్టాత్మకమైన రెండు జాకీచాన్ అవార్డులు వరించాయి. అయితే జమాల్ తాజాగా 'సాకులు చెప్పడం మాని.. ఇలా ఫుల్ సిలిండర్‌తో కలరియపట్టు ట్రై చేయండి. మీ బాడీ ఇలాంటి వర్కవుట్లు చేయగలదని మీ మెదడుకు తెలియదు' అని అంటూ వీడియోను పోస్ట్ చేశారు. Ab yeh karke dekho! For the non-believers, THIS is a FULL cylinder. Ur body is ready to train, ur mind just doesn’t know it. Stop the excuses! #ITrainLikeVidyutJammwal #kalaripayattu #desiworkout pic.twitter.com/8hTZPAHWpU — Vidyut Jammwal (@VidyutJammwal) September 5, 2019 వీడియో చూసిన వారిలో కొంతమంది మెచ్చుకొంటుండగా, మరి కొంతమంది మాత్రం జోక్‌లతో హోరెత్తిస్తున్నారు. ‘ఇలా చేస్తే మమ్మీ చెప్పుతో కొడుతుంది’ అని ఒకరు ఫన్నీగా అంటే, ‘సిలిండర్ బుక్ చేయడం మర్చిపోయా..! గుర్తు చేసింనందుకు థ్యాంక్స్’ అని మరొకరు, అసలు ఇలాంటి వారి వల్లే మాకు అమ్మాయి దొరకడం లేదని వేరొకరు కిర్రాక్ కామెంట్లు పెట్టారు. కానీ కొంతమంది మాత్రం నీకు ఇలా చేయడం వచ్చా..? అని ఛాలెంజ్ విసురుతున్నారు. Ye to koi bhi kar lega , ye kar ke dikhao👇😆🤣 pic.twitter.com/r2kgPst6AK — Bhrustrated (@AnupamUncl) September 5, 2019 -
76 ఏళ్ల వయసులోనూ...
ఆమె ప్రదర్శించే విన్యాసాలు చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కర్ర తిప్పే తీరు గమనిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. వయసుతో సంబంధం లేకుండా కర్రసాము కత్తి ఫైట్లతో ఇప్పుడా వృద్ధ మహిళ ఇంటర్నెట్ యూజర్లను ఇట్టే ఆకట్టుకుంటోంది. ప్రాచీన యుద్ధ కళా విన్యాసాల్లో తనదైన ప్రావీణ్యాన్ని ప్రదర్శించి ఫేస్ బుక్ యూజర్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఫేస్ బుక్ లో ఆమె పోస్టు చేసిన వీడియో... లక్షలకొద్దీ వీక్షణలతో సంచలనం సృష్టిస్తోంది. కేరళ వటకారా లో నివసిస్తున్న మీనాక్షియమ్మ వయసు 76 సంవత్సరాలు. ఆమె పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. పురాతన భారతీయ యుద్ధ కళారూపం కలరిపయట్టు (కర్రసాము) లో నేటికీ అనేక మంది విద్యార్థులకు శిక్షణనిస్తూ అద్భుత నైపుణ్యాన్ని కనబరుస్తోంది. కర్రలు, కత్తులు, బాకులు ఉపయోగించి చేసే కర్రసాములో ఆమె చూపించిన విన్యాసాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా వ్యాపించాయి. ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ లో ఒకటైన, పురాతన కాలంనాటి కళగా గుర్తింపుపొందిన కర్రసాము బోధకురాలుగా మీనాక్షిమమ్మ ఎంతో గుర్తింపు పొందింది. ఏడు పదుల వయసు దాటినా ఆమె నేటికీ తనదైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. మీనాక్షియమ్మ వీడియో... ఫేస్ బుక్ లో ఇండియా అరైజింగ్ పేరున జూన్ 16న పోస్ట్ చేశారు. ఆ అద్భుత విన్యాసాల వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షియమ్మ వీడియోను కేవలం నాలుగు రోజుల్లోపే సుమారు 9 లక్షలమంది పైగా వీక్షించారు. వయోవృద్ధురాలైన ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ముగ్ధులైపోతున్నారు. కర్రను చేతపట్టి, చీరకొంగు నడుముకు చుట్టి ఓ వ్యక్తితో ఆమె తలపడిన తీరును చూస్తే నిజంగా అద్భుతం కళ్ళకు కడుతుంది. చూపరులు ఊపిరి బిగపట్టేలా చేస్తుంది. తనకన్నా వయసులో అతి చిన్నవాడు, ఆమె వద్దే శిక్షణ పొందిన వ్యక్తితో ఆమె యుద్ధకళను ప్రదర్శించిన తీరు ఫేస్ బుక్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. కేరళ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కలరిపయట్టు, పురాతన కాలానికి చెందిన ఓ ప్రత్యేక యుద్ధకళగా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ కళ అత్యంత క్లిష్టమైన విద్యగా కూడ పేరొందింది. -
కేరళ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న హీరో
ముంబై: జాకీష్రాఫ్ తనయుడిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. తొలి సినిమాతోనే ఆ ముద్రను చెరిపేశాడు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్. షబ్బీర్ దర్శకత్వంలో వచ్చిన ‘హీరోపంటి’ మూవీలో మైనస్ 9 డిగ్రీల చలిని కూడా లెక్కచేయకుండా హీరోయిన్ కృతి సనన్ తో రొమాన్స్ చేసి ఔరా అనిపించాడు. తాజాగా తన రెండో చిత్రం 'బాఘీ' కోసం చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాడు టైగర్. సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీని సిద్ధంచేశాడు. ప్రస్తుతం కొన్ని యాక్షన్ సీన్లలో అవసరాల నిమిత్తం కేరళ యుద్ధవిద్య 'కలరీపట్టు' నేర్చుకుంటున్నాడు. అద్భుతంగా డ్యాన్స్ చేయడమే కాదు.. అవసరమైతే మూవీ కోసం ఎంత కష్టమైనా ఎదుర్కొనేందుకు టైగర్ వెనుకాడటం లేదని బాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. మూవీలో యాక్షన్ సన్నివేశాలు చాలా ఉన్నాయని, వాటిలో భాగంగా తాను కేరళ యుద్ధవిద్యను నేర్చుకోవడానికి వెళ్తున్నానని టైగర్ కూడా ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ట్రైనర్ల సహాయంతో 'కలరీపట్టు' కాస్త నేర్చుకున్నాక షూటింగ్ మళ్లీ మొదలెడతామని టైగర్ చెప్పుకొచ్చాడు. షబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో టైగర్ తో ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ జతకట్టిన విషయం తెలిసిందే. రేపు 'బాఘీ' మూవీ ట్రైలర్ విడుదల కానుంది.