కేరళ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న హీరో | Tiger Shroff underwent kerala art Kalaripayattu training for 'Baaghi' movie | Sakshi
Sakshi News home page

కేరళ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న హీరో

Published Sun, Mar 13 2016 4:08 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

కేరళ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న హీరో - Sakshi

కేరళ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న హీరో

ముంబై: జాకీష్రాఫ్ తనయుడిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. తొలి సినిమాతోనే ఆ ముద్రను చెరిపేశాడు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్. షబ్బీర్ దర్శకత్వంలో వచ్చిన ‘హీరోపంటి’  మూవీలో మైనస్ 9 డిగ్రీల చలిని కూడా లెక్కచేయకుండా హీరోయిన్ కృతి సనన్ తో రొమాన్స్ చేసి ఔరా అనిపించాడు. తాజాగా తన రెండో చిత్రం 'బాఘీ' కోసం చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాడు టైగర్. సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీని సిద్ధంచేశాడు. ప్రస్తుతం కొన్ని యాక్షన్ సీన్లలో అవసరాల నిమిత్తం కేరళ యుద్ధవిద్య 'కలరీపట్టు'
నేర్చుకుంటున్నాడు.

అద్భుతంగా డ్యాన్స్ చేయడమే కాదు.. అవసరమైతే మూవీ కోసం ఎంత కష్టమైనా ఎదుర్కొనేందుకు టైగర్ వెనుకాడటం లేదని బాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. మూవీలో యాక్షన్ సన్నివేశాలు చాలా ఉన్నాయని, వాటిలో భాగంగా తాను కేరళ యుద్ధవిద్యను నేర్చుకోవడానికి వెళ్తున్నానని టైగర్ కూడా ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ట్రైనర్ల సహాయంతో 'కలరీపట్టు' కాస్త నేర్చుకున్నాక షూటింగ్ మళ్లీ మొదలెడతామని టైగర్ చెప్పుకొచ్చాడు. షబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో టైగర్ తో ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ జతకట్టిన విషయం తెలిసిందే. రేపు 'బాఘీ' మూవీ ట్రైలర్ విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement