నేను పాట పాడితే సూపర్ హిట్టే: హీరోయిన్ | Sab tera has become this year most loved song, says Shraddha Kapoor | Sakshi
Sakshi News home page

నేను పాట పాడితే సూపర్ హిట్టే: హీరోయిన్

Published Sat, Apr 30 2016 5:45 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

నేను పాట పాడితే సూపర్ హిట్టే: హీరోయిన్ - Sakshi

నేను పాట పాడితే సూపర్ హిట్టే: హీరోయిన్

ముంబై: ఒకప్పుడు కేవలం సింగర్స్ లో మాత్రమే ఒకరితో మరొకరితో పోటీ ఉండేది. ప్రస్తుతం హీరోహీరోయిన్లు ఒకరితో మరొకరు పోటీపడి మరీ గాత్రదానం చేస్తున్నారు. వీరి వల్ల కొన్ని సందర్భాలలో ప్రొఫెషనల్ సింగర్స్ కు కూడా షాకులు తగులుతున్నాయి. సింగర్స్ కే షాకిచ్చిన జాబితాలో చేరిపోయింది బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్. అవును నిజమే.. ఆమె పాడిన పాటలన్నీ హిట్ అవుతున్నాయి. దీనిపై ఆమె తన ఆనందాన్ని వ్యక్తంచేస్తూ.. 'నేను పాడిన పాటలన్నీ హిట్ అవుతున్నాయి. నా పాటలను హిట్ చేస్తున్నందుకు అభిమానులకు ధన్యావాదాలు' అని చెప్పింది.

ఆమె తాజా మూవీ 'బాఘీ' లోనూ ఓ పాట పడింది. 'సబ్ తేరా' పాట ఇప్పటికే 10 లక్షల వ్యూస్ సంపాదించుకుంది. ఈ ఏడాది ఇదే అత్యుత్తమ సాంగ్ అని, ఈ ఆనందాన్ని మాటల్లో వ్యక్తం చేయలేకపోతున్నానని అంటోంది. ఎంత సాధించినా ఎంతో కొంత మెరుగు పడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని చెప్పుకొచ్చింది. గతంలో ఆమె పాడిన 'బెజుబన్ ఫిర్ సే', 'గాలియన్', 'దో జహన్' సాంగ్స్ శ్రద్ధాకు ఎంతో పేరు తీసుకొచ్చాయి. ఈ నవంబర్ లో విడుదల కానున్న 'రాక్ ఆన్ 2' మూవీకి కూడా ఆమె గాత్రదానం చేస్తునట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement