
ముంబై : టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్‌లు జోడీగా విడుదలైన లేటెస్ట్ బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ భాగీ 3 తొలి వీకెండ్‌లో రూ 50 కోట్ల మార్క్‌ను దాటింది. ఈ మూవీపై మిశ్రమ సమీక్షలు వచ్చినా కరోనా భయాలు, పరీక్షల హడావిడిని అధిగమించి మెరుగైన వసూళ్లను రాబట్టింది. శుక్రవారం తొలిరోజు రూ 17.50 కోట్లు రాబట్టిన భాగీ 3 రెండవరోజు రూ 16.03 కోట్లు, ఆదివారం రూ 20.3 కోట్లను వసూలు చేసి మూడు రోజుల్లో మొత్తం రూ 53.83 కోట్లు వసూలు చేసిందని ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. మాస్ సెంటర్లలో ఈ మూవీ భారీ వసూళ్లు రాబడుతోందని, మెట్రోల్లోనూ మూడోరోజు పుంజుకుందని ఆయన ట్వీట్ చేశారు. భాగీ ఫ్రాంచైజీ టైగర్‌కు కలిసివచ్చిందనే చెప్పాలి. తొలి, మూడు పార్ట్‌ల్లో శ్రద్ధా కపూర్ టైగర్‌తో జతకట్టగా, భాగీ 2లో దిశా పటానీ టైగర్ సరసన ఆడిపాడింది. అహ్మద్‌ఖాన్ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన భాగీ 3లో రితీష్ దేశ్‌ముఖ్, అంకితా లోఖండేలు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment