ఇది కేవలం ఆరంభం మాత్రమే... | Shraddha and Tiger sport grunge rebel look in Baaghi movie first poster | Sakshi
Sakshi News home page

ఇది కేవలం ఆరంభం మాత్రమే...

Published Wed, Mar 9 2016 3:56 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఇది కేవలం ఆరంభం మాత్రమే... - Sakshi

ఇది కేవలం ఆరంభం మాత్రమే...

ముంబై: జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'బాఘీ'. బాలీవుడ్ అంతా ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుంది అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రద్ధాకపూర్, జాకీష్రాఫ్ జత కట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఓ పోస్టర్ను ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ మూవీ యూనిట్ నిర్ణయం మేరకు సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్టర్ విడుదల చేసి అంచనాలు పెంచేస్తున్నారు. శ్రద్ధా, టైగర్ చాలా రఫ్, రెబెల్ గా ఆ పోస్టర్ లో కనిపిస్తారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ తన పోస్ట్ లో ఈ అమ్మడు రాసుకొచ్చింది.

ప్యాంటు ధరించి సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తూ టైగర్ నిలబడి ఉండగా, శ్రద్ధా ఓ కూర్చీలో కూర్చుని చాలా రఫ్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్ 29న ఈ మూవీ విడుదల కానుంది. టైగర్ కు ఇది రెండో సినిమా. నదియావాలా గ్రాండ్సన్ ఎంటర్ టైన్మెంట్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. మార్చి 14న 'బాఘీ' మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ హీరో సుదీర్ బాబు ఈ మూవీలో కనిపించనుండటం కొసమెరుపు. టైగర్ ష్రాఫ్ చేసిన యాక్షన్ సీన్స్ చూసిన సుదీర్ బాలీవుడ్ యంగ్ హీరోను పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. హాలీవుడ్లో కూడా ఇలాంటి యాక్షన్స్ సీన్స్ చూడలేదంటూ ఇటీవల సుదీర్ బాబు చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement