బికినీలో తొలిసారి దర్శనమిస్తాను... | for the first time that I wore a bikini for a film, says Shraddha Kapoor | Sakshi
Sakshi News home page

బికినీలో తొలిసారి దర్శనమిస్తాను...

Published Tue, Mar 15 2016 11:01 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బికినీలో తొలిసారి దర్శనమిస్తాను... - Sakshi

బికినీలో తొలిసారి దర్శనమిస్తాను...

ముంబై: బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ వరుస విజయాలతో జోరుపెంచినట్లు కనిపిస్తోంది. 'ఆషికీ2'తో ఆరంగ్రేటంతో తొలి మూవీలోనే క్యూట్ లుక్స్ తోనే కాదు నటనతోనూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 'ఏబీసీడీ' మూవీలో అదరగొట్టే స్టెప్పులేస్తూ హీరో వరుణ్ ధావన్ తో పోటీపడి మరీ నటించింది. ఇక తన లేటెస్ట్ మూవీ 'బాఘీ'లో సీనియర్ హీరో జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ తో జోడీకట్టిన విషయం తెలిసిందే. షబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యాక్షన్ సీన్లకు లోటులేదని శ్రద్ధా అంటోంది. ఈ మూవీ ట్రైలర్ నిన్న విడుదలయింది. మీడియా ఆమెను సంప్రదించగా శ్రద్ధాకపూర్ కొన్ని విషయాలను పంచుకుంది.

'తొలిసారిగా నేను 'బాఘీ' మూవీలో బికినీలో దర్శనమిస్తున్నాను. బికినీలో ప్రేక్షకులు నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నాను. ఈ కొత్త అవతారం అందరినీ ఆకట్టుకుంటుంది అనిపిస్తుంది.' అని శ్రద్ధా చెప్పింది. బికినీ వేసుకోవడం చాలా మంచి అనుభవం, దీనిపై తనకు చాలా మంచి కామెంట్స్ వస్తాయని ఈ భామ చెప్పుకొచ్చింది. చూడటానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే పాత్రల్లో నటించే శ్రద్ధా ఈ మూవీలో చాలా సాహసమే చేసిందని చెప్పవచ్చు. హీరో టైగర్ తో కలిసి కొన్ని యాక్షన్ సీన్లలోనూ నటించినట్లు వెల్లడించింది. అందులో భాగంగానే కొన్నిసార్లు గాయాలపాలయ్యానని చెప్పింది. ఏ నటుడు టైగర్ లా నటించలేడని, అతడితో కలిసి పనిచేయడం చాలా ప్రేరణ ఇచ్చేవిధంగా ఉంటుందంటోంది ఈ అమ్మడు. తన స్కూలు రోజులను గుర్తుచేసుకుంటూ... టైగర్ స్కూలు రోజుల్లో ఎలా ఉండేవాడో, ఇప్పుడు కూడా పనిపట్ల అదే ఎనర్జీతో, చాలా ఏకాగ్రతతో ఉన్నాడని తన మిత్రుడిని తెగ పొగిడేసింది శ్రద్ధాకపూర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement