ప్రాక్టీస్‌.. ప్రాక్టీస్‌ | Aditi Rao Hydari Is Practicing Kalaripayattu | Sakshi
Sakshi News home page

ప్రాక్టీస్‌.. ప్రాక్టీస్‌

Published Wed, May 13 2020 5:32 AM | Last Updated on Wed, May 13 2020 5:32 AM

Aditi Rao Hydari Is Practicing Kalaripayattu - Sakshi

ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్‌ సెల్వన్‌ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, అదితీ రావ్‌ హైదరి, శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ థాయ్‌ల్యాండ్‌లో జరిగింది. ‘జయం’ రవి, కార్తీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సెకండ్‌ షెడ్యూల్‌ను ఆరంభించాలనుకుంటున్న సమయంలో కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. మళ్లీ షూటింగ్‌ ప్రారంభమయ్యేలోపు కథలోని పాత్రలకు తగ్గట్లుగా మౌల్డ్‌ అయ్యే పనిలో ఉన్నారు ఈ చిత్రంలోని నటీనటులు. ఇందులో భాగంగానే అదితీ రావ్‌ హైదరి  కలరిపయట్టు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఇంటిపట్టునే ఉంటున్న అదితీ ఈ మార్షల్‌ ఆర్ట్‌ ప్రాక్టీస్‌కే రోజులో ఎక్కువ టైమ్‌ కేటాయిస్తున్నారట. తన ప్రాక్టీస్‌ వీడియోను సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు అదితీ రావ్‌. పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement