కేరళలో అతి ప్రాచీనమైన యద్ధకళ కలరిపయట్టు . దీన్ని యుద్ధాలు చేయడానికి ఉపయోగించే ఓ గొప్ప కళగా చెబుతారు. పురాణాల ప్రకారం ఈ కళకు అగస్త్యముని, పరశురాముడి మూలకర్తలుగా చెబుతుంటారు. అలాంటి కలరిపయట్టులో 80 ఏళ్ల బామ్మ అసామాన్యమైన ప్రతిభను కనబర్చడమేగాక ఎందరికో గురువుగా ఆ యుద్ధకళకు సంబంధించిన పాఠాలు చెబుతుంది. అది కూడా ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఆ విద్యను నేర్పిస్తుంది. ఈ బామ్మ పద్శశ్రీ అవార్డు గ్రహిత కూడా. ఆమె కత్తి లేదా కర్ర పడితే చూపు తిప్పుకోలేరు. అంతలా ముగ్ధమనోహరంగా లయబద్ధంగా విన్యాసం చేస్తుంది.
వివరాల్లోకెళ్తే..కేరళలో 80 ఏళ్ల బామ్మ మీనాక్షి గురక్కల్‌ని చూస్తే మహిళలు ఎందులోనూ తీసుపోరు అనుకుంటారు. ఎలాంటి సౌకర్యాలు, ప్రోత్సాహం లేని ఆ కాలంలోనూ కేరళలో అతి ప్రాచీన యుద్ధ విద్య, మార్షల్ ఆర్ట్స్‌లో పుస్తకాల్లో స్థానం దక్కించుకున్న ఓ గొప్ప కళ అయిన కకలరిపయట్టును ఈ బామ్మ అవలీలగా చేస్తుంది. అది కూడా ఆరుగజాల చీరలో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఆమె ప్రతి కదలిక అత్యంత మనోహారంగా ఉంటుంది. ఆమె ఈ విద్యను ఏడేళ్ల వయసు నుంచే నేర్చుకుంది.
తన తండ్రి కలరి బృందం ప్రదర్శనను చూస్తూ పెరిగిన ఆమె తనకు తెలియకుండానే ఆ కళపై ఆసక్తి పెంచుకుంది. అలా ఆమె తన చెల్లెలు ఇద్దరూ ఈ కళను నేర్చుకున్నారు. ఆ కళలో మరింత నైపుణ్యం సంపాదించడం కోసం రాఘవన్ మాస్టర్ వద్ద చేరింది. కొన్నేళ్ల తర్వాత ఆ గురువునే వివాహం చేసుకుంది. వారిద్దరు కలిసి ఆ కలరిపట్టు తరగతులు నిర్వహిస్తారు. కానీ ఎవ్వరి వద్ద డబ్బులు వసూలు చేయరు.
కానీ ఆ విద్య నేర్చుకున్న విద్యార్థులే చివర్లో తమ సామర్థ్యానికి తగిన విధంగా గురుదక్షిణ చెల్లిస్తే తీసుకోవడమే తప్ప ప్రత్యేకండా వారు ఏమి తీసుకోరు. ఈ విద్యను కేరళలో యుద్ధాలు చేసే యోధులకు నేర్పేవారట. ఆ తర్వాత క్రమేణ ఈ కళ క్షీణించింది. మీనాక్షి లాంటి బామ్మల కారణంగా ఇలాంటి సంప్రదాయ నృత్య కళ లాంటి యుద్ధ కళ కనుమరగవ్వకుండా ఉంది. ఏ కళ అయినా జీవం పోసుకుని కలకలం ఉండాలంటే..మన సంప్రదాయలను సంస్కృతిని గౌరవించినప్పుడే సాధ్యం. అందుకు ఉదహరణే ఈ మీనాక్షి బామ్మ. ఆమె కర్ర పట్టుకుని చేసిన కలరిపయట్టు యుద్ధం నెట్టింట వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి.
(చదవండి: క్యాండిల్ సిస్టర్స్: చదువుకుంటూనే వ్యాపారవేత్తలుగా..!)
Comments
Please login to add a commentAdd a comment