Sword
-
1300 ఏళ్ల నాటి మేజిక్ ఖడ్గం మాయం : అందోళనలో స్థానికులు
ప్రపంచంలోకెల్లా అత్యంత పదునైందిగా పేరుగాంచిన కింగ్ ఆర్థర్‌కు చెందిన ఖడ్గం అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. భూమికి 32 అడుగుల పైన పాతిపెట్టిన పౌరాణిక ఖడ్గం చోరీకి గురై ఉంటుందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.ది టెలిగ్రాఫ్ కథనం రోకమడోర్ పట్టణంలో 1,300 ఏళ్లుగా ఎత్తయిన బండరాయిలోకి సగం దిగబడిన విశేషం ఖడ్గం చోరీకి గురైందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఖడ్గం అదృశ్యం కావడం స్థానికుల్లో కలవరం రేపింది. ఎందుకంటే దొంగ దానిని తస్కరించాలంటే కఠినమైన రాతి ఉపరితలంపై 32 అడుగులు ఎక్కవలసి ఉంటుంది. అంత ఎత్తుకు ఎక్కి ఆ ఖడ్గాన్ని దొంగిలించడం ఎలా సాధ్యమైంది అనేది ఇపుడు హాట్ టాపిక్.. శతాబ్దాలుగా రోకామడోర్ పట్టణానికి అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్‌గా నిలుస్తోందని పట్టణ మేయర్ డోమినిక్ లెన్ ఫెంట్ చెప్పారు.ఈ ఖడ్గం విశేషాలుస్థానిక స్థల పురాణం ప్రకారం ఆ ఖడ్గానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయి. డురండల్గా పిలిచే ఆ ఖడ్గానికి ఫ్రెంచ్ ఎక్స్ క్యాలిబర్ అని కూడా పేరుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పదునైన కత్తి, నాశనంలేనిది. ఒక్క దెబ్బతో రాయిని కూడా చీల్చగల సామర్థ్యం దీని సొంతం. 11వ శతాబ్దానికి చెందిన ది సాంగ్ ఆఫ్ రోలాండ్ అనే పురాణ పద్యం కత్తి అద్భుత లక్షణాలను వివరించింది.ఈ పద్యం తాలూకు కాపీ ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ లోని బోడ్లియన్ లైబ్రరీలో ఉంది.ది లెజెండ్ ఆఫ్ ఎక్సాలిబర్: పురాణ ఖడ్గం ఎక్సాలిబర్ కింగ్ ఆర్థర్ యాజమాన్యంలోనిది. దీనికి అనేక మాంత్రిక సామర్థ్యాలున్నట్లు ది సన్ రిపోర్ట్ చేసింది.మధ్యయుగ పురాణం ప్రకారం, 8వ శతాబ్దంలో నాటి రోమన్ చక్రవర్తి రాజు చార్లెమాగ్నే ఒక దేవదూత నుండి డురాండల్ను అందుకున్నాడు. దీన్ని తరువాత సైనికాధికారి రోలాండ్ కిచ్చాడు. యుద్ధంలో తన మరణానికి ముందు, రోలాండ్ ఈ ఖడ్గాన్ని శత్రువులు దానిని స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు రాళ్ళపై దానిని పగలగొట్టడానికి ప్రయత్నించినా ఫలించలేదు. చివరకు దాన్ని కాపాడేందుకు గాలిలోకి విసిరాడు. అయితే ఇది అద్భుతంగా వందల కిలోమీటర్లు ప్రయాణించి, రోకామడోర్ రాక్ ఫేస్‌లో దిగబడినట్లు చెబుతారు. -
కత్తులు తయారు చేస్తున్న టెక్ బాస్.. వీడియో వైరల్!
Mark Zuckerberg viral video: ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం, ఫేస్బుక్ యాజమాన్య సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కత్తుల తయారీపై దృష్టి పెట్టినట్లు ఉన్నారు. ఇటీవల జపనీస్ కత్తి మాస్టర్ అకిహిరా కోకాజీ నుంచి కత్తి తయారీ పాఠాన్ని నేర్చుకున్నారు. పదునుకు ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ జపనీస్ కత్తి ‘కటనా’ను తయారు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జుకర్‌బర్గ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్ట్‌లను షేర్ చేశారు. అందులో ఆయన కత్తి మాస్టర్‌తో పోజులివ్వడాన్ని చూడవచ్చు. మరొక చిత్రంలో తాను తయారు చేసిన కత్తిని చూపించాడు. అలాగే కత్తి తయారు చేస్తున్న వీడియోను, తయారు చేసిన కత్తిని వాడుతున్న వీడియోను కూడా షేర్ చేశారు. "మాస్టర్ అకిహిరా కోకాజీతో కటనాల తయారీ గురించి నేర్చుకోవడం నిజంగా అద్భుతంగా ఉంది. మీ (అకిహిరా కోకాజీ) కళా నైపుణ్యాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు!" అని పేర్కొన్నాడు. ఈ వీడియో ఇంటర్నెట్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. షేర్ చేసినప్పటి నుంచి 3.6 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. అలాగే వేలాది కామెంట్లు వచ్చాయి. “తయారు చేసిన కటానాను మీతోనే ఉంచుకుంటారా?” అని ఓ యూజర్ ప్రశ్నించారు. “మీరు నిజమైన నింజాగా మారే మార్గంలో ఉన్నారు. చేతులతో యుద్ధంలో ఆరితేరాక కత్తులపై దృష్టిపెట్టారు!” అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck) -
చీరకట్టులో కత్తి పాఠాలు! ఆమె కర్ర పట్టిందంటే..
కేరళలో అతి ప్రాచీనమైన యద్ధకళ కలరిపయట్టు . దీన్ని యుద్ధాలు చేయడానికి ఉపయోగించే ఓ గొప్ప కళగా చెబుతారు. పురాణాల ప్రకారం ఈ కళకు అగస్త్యముని, పరశురాముడి మూలకర్తలుగా చెబుతుంటారు. అలాంటి కలరిపయట్టులో 80 ఏళ్ల బామ్మ అసామాన్యమైన ప్రతిభను కనబర్చడమేగాక ఎందరికో గురువుగా ఆ యుద్ధకళకు సంబంధించిన పాఠాలు చెబుతుంది. అది కూడా ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఆ విద్యను నేర్పిస్తుంది. ఈ బామ్మ పద్శశ్రీ అవార్డు గ్రహిత కూడా. ఆమె కత్తి లేదా కర్ర పడితే చూపు తిప్పుకోలేరు. అంతలా ముగ్ధమనోహరంగా లయబద్ధంగా విన్యాసం చేస్తుంది. వివరాల్లోకెళ్తే..కేరళలో 80 ఏళ్ల బామ్మ మీనాక్షి గురక్కల్ని చూస్తే మహిళలు ఎందులోనూ తీసుపోరు అనుకుంటారు. ఎలాంటి సౌకర్యాలు, ప్రోత్సాహం లేని ఆ కాలంలోనూ కేరళలో అతి ప్రాచీన యుద్ధ విద్య, మార్షల్ ఆర్ట్స్‌లో పుస్తకాల్లో స్థానం దక్కించుకున్న ఓ గొప్ప కళ అయిన కకలరిపయట్టును ఈ బామ్మ అవలీలగా చేస్తుంది. అది కూడా ఆరుగజాల చీరలో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఆమె ప్రతి కదలిక అత్యంత మనోహారంగా ఉంటుంది. ఆమె ఈ విద్యను ఏడేళ్ల వయసు నుంచే నేర్చుకుంది. తన తండ్రి కలరి బృందం ప్రదర్శనను చూస్తూ పెరిగిన ఆమె తనకు తెలియకుండానే ఆ కళపై ఆసక్తి పెంచుకుంది. అలా ఆమె తన చెల్లెలు ఇద్దరూ ఈ కళను నేర్చుకున్నారు. ఆ కళలో మరింత నైపుణ్యం సంపాదించడం కోసం రాఘవన్ మాస్టర్ వద్ద చేరింది. కొన్నేళ్ల తర్వాత ఆ గురువునే వివాహం చేసుకుంది. వారిద్దరు కలిసి ఆ కలరిపట్టు తరగతులు నిర్వహిస్తారు. కానీ ఎవ్వరి వద్ద డబ్బులు వసూలు చేయరు. కానీ ఆ విద్య నేర్చుకున్న విద్యార్థులే చివర్లో తమ సామర్థ్యానికి తగిన విధంగా గురుదక్షిణ చెల్లిస్తే తీసుకోవడమే తప్ప ప్రత్యేకండా వారు ఏమి తీసుకోరు. ఈ విద్యను కేరళలో యుద్ధాలు చేసే యోధులకు నేర్పేవారట. ఆ తర్వాత క్రమేణ ఈ కళ క్షీణించింది. మీనాక్షి లాంటి బామ్మల కారణంగా ఇలాంటి సంప్రదాయ నృత్య కళ లాంటి యుద్ధ కళ కనుమరగవ్వకుండా ఉంది. ఏ కళ అయినా జీవం పోసుకుని కలకలం ఉండాలంటే..మన సంప్రదాయలను సంస్కృతిని గౌరవించినప్పుడే సాధ్యం. అందుకు ఉదహరణే ఈ మీనాక్షి బామ్మ. ఆమె కర్ర పట్టుకుని చేసిన కలరిపయట్టు యుద్ధం నెట్టింట వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Midhun Malathi Mohan (@iam_midhun_mohandas) (చదవండి: క్యాండిల్ సిస్టర్స్: చదువుకుంటూనే వ్యాపారవేత్తలుగా..!) -
ముఖంపై కోతలు... కడుపులో కత్తిపోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది శివకుమార్ చేతిలో కత్తి పోట్లకు గురైన యువతికి చికిత్స కొనసాగుతోందని గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు. సోమవారం ఆయ న మీడియాతో మాట్లాడారు. దారుణమైన రీతిలో యువతి శరీరంలో అనేక చోట్ల కత్తిపోట్లకు గురైందని, తమ వైద్యులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని వెల్లడించారు. ఆస్పత్రికి చెందిన ట్రామాకేర్ బృందంలోని న్యూరో సర్జన్లు, పునర్నిర్మాణ శస్త్ర చికిత్స నిపుణులు, ఆర్థో పెడిక్స్, ఎమర్జెన్సీ ఫిజీషి యన్ల బృందంతో కలిసి ఆ యువతికి చికిత్స అందిస్తున్నా మని చెప్పారు. తమ ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి ఆమె ముఖంపైన కోతలతో సహా అనేకచోట్ల కత్తి పోట్లు ఉన్నాయని, ప్లాస్టిక్ సర్జన్ ముఖానికి అవసరమైన కుట్లు వేసి, ముఖంరూపు మారకుండా చూస్తున్నామని తెలి పారు. కానీ తీవ్రమైన కత్తి దాడి ఫలితంగా గర్భాశయ ప్రాంతానికి సమీపంలో వెన్నుపాముకు ప్రాణాంతకమైన గాయ మై ప్రధాన నరాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని, దీని వల్ల ఆమె వైకల్యం బారిన పడే ప్రమాదం ఉందని, ఆ పరి స్థితి రాకుండా తమ వైద్యులు కృషి చేస్తున్నారని, తగిన సమయంలో శస్త్రచికిత్స చేస్తామన్నారు. ప్రేమోన్మాది శివకుమార్ అరెస్టు నాగోలు, కొందుర్గు: ప్రేమపేరుతో యువతిపై దాడి చేసి, ఆమె తమ్ముడిని హతమార్చిన కేసులో సోమవారం రాత్రి నిందితుడు శివకుమార్‌ను సోమవారం రాత్రి ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. పృథ్వీ తండ్రి సురేందర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివకుమార్‌పై పలు సెక్షన్ల కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎల్బీనగర్ సీఐ అంజిరెడ్డి తెలిపారు. శివకుమార్ ఆదివారం ఆర్టీసీ కాలనీలోకి వచ్చిన దృశ్యాలు కాలనీలోని సీసీకెమెరాలలో రికార్డు అయ్యాయి. సోమవారం తెల్లవారుజామున పోలీసులు సంఘటన జరిగిన స్థలంలో నిందితుడిని తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ తర్వాత దాడికి ఉపయోగించిన కత్తితోపాటు శివకుమార్ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన పృథ్వీ కుటుంబానికి న్యాయం చేయాలని సోమవారం రంగారెడ్డి జిల్లా కొందుర్గు చౌరస్తాలో వివిధ పార్టీల నాయకులు ధర్నా చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్డుపై బైఠాయించారు. నిందితుడు శివకుమార్‌ను ఉరితీయాలని డిమాండ్ చేశారు. దాదాపు గంటపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఉచిత చికిత్స...దీర్ఘకాలిక సేవలు అందిస్తాం యువతి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మొదట ప్రాణరక్షణపైనే కృషి చేశామని, ఈ గాయాలు ఆమె కు జీవి తాంతం భారంగా మారకుండా, ఆమె వైద్య ఖర్చులను తామే భరించాలని నిర్ణయించుకున్నామని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. దీర్ఘకాలిక ఫిజియో థెరపీతో ఆ మె కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చె ప్పారు. డిశ్చార్జి తర్వాత కూడా తమ వైద్య బృందం ఆ మెకు సహాయం చేస్తుందన్నారు. ఆమె ఎదుర్కొన్న తీవ్ర మా నసిక వేదన నుంచి బయటకు రావడానికి మానసిక, ఆరోగ్య కౌన్సెలింగ్ అవసరం కూడా ఉంటుంద ని, మొత్తంగా ఇదొక సుదీర్ఘ ప్రయా ణమే అని అన్నారు. -
3 వేల ఏళ్లయినా ‘కత్తి’లా ఉంది!
బెర్లిన్: సుమారు మూడు వేల ఏళ్లనాటి కంచు కత్తి జర్మనీలో తవ్వకాల్లో బయటపడింది. ఇప్పటికీ ఆ కత్తి పదును, మెరుపు ఏమాత్రం తగ్గలేదని పురాతత్వ నిపుణులు తెలిపారు. బవేరియా రాష్ట్రంలోని నోయెర్డ్లింజెన్లో జరిపిన తవ్వకాల్లో ఇది వెలుగు చూసింది. క్రీస్తుపూర్వం 14వ శతాబ్దం..కంచుయుగం మధ్య కాలం నాటి ముగ్గురు వ్యక్తుల సమాధిలోని అష్టభుజి పట్టీ కలిగిన ఈ కత్తి ఇప్పటికీ కొత్తదిగానే ఉండటం అద్భుతం, అరుదైన విషయమన్నారు. క్రీస్తు పూర్వం 3,300–12,00 సంవత్సరాల మధ్య మానవులు కంచు వాడిన కాలాన్ని చరిత్రకారులు కంచుయుగంగా గుర్తిస్తారు. -
బ్రిటన్ వెళ్లి ఛత్రపతి శివాజీ ఖడ్గాన్ని తెచ్చేందుకు యత్నిస్తా!
మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ తాను వచ్చే నెలలో యూకే వెళ్తున్నానని, ఛత్రపతి శివాజీ ఖడ్గాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ఈ మేరకు ఆయన రాయ్‌గఢ్ జిల్లాలోని ఖర్ఘర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హజరైన కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి ముంగంటివార్ ఈ వ్యాఖ్యలు చేశారు. శివాజీ మహారాజ్ పట్టాభిషేకం 350వ వార్షికోత్సవాన్ని త్వరలో జరుపుకోనున్నట్లు కూడా చెప్పారు. ఈ సందర్భంగా తాను వచ్చే నెలలో బ్రిటన్‌ని సందర్శస్తానని, అక్కడ 17వ శతాబ్ధపు యోధుడు ఛత్రపతి శివాజీ ఉపయోగించిన జగ్దాంబ(ఖడ్గం), వాఘ్-నఖ్(పులి గోళ్లలా కనిపించే బాకు) తిరిగి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. మరాఠీ ప్రజల వీక్షించేలా అందుబాటులో ఉంచడం కోసం దీని గురించి బ్రిటిస్ డిప్యూటీ హైకమిషనర్ అలాన్ గెమ్మెల్, రాజకీయ ద్వైపాక్షిక వ్యవహారాల డిప్యూటీ హెడ్ ఇమోజెన్ స్టోన్‌తో కూడా చర్చించానని చెప్పారు. తాను మే మొదటి వారంలో బ్రిటన్‌కు వెళ్తున్నానని, శివాజీ పట్టాభిషేకం 350వ వార్షికోత్సవం కల్లా వాటిని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఈ దేశం ప్రపంచం సెల్యూట్ చేసేలా ఆ వార్షికోత్సవాన్ని వైభవోపేతంగా జరుపుకుందాం అన్నారు మహారాష్ట్ర మంత్రి ముంగంటివార్. (చదవండి: యూపీలో మరో వ్యక్తి కొంగ స్నేహం..ఏం జరుగుతుందో చూడాలి..) -
మరో వివాదంలో డేరా బాబా.. తల్వార్‌తో కేక్ కట్టింగ్.. వీడియో వైరల్..
చండీగఢ్: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ ఇటీవలే పెరోల్‌పై విడుదలైన డేరా బాబా రామ్ రహీం మరో వివాదంలో చిక్కుకున్నాడు. చాలా కాలం తర్వాత జైలు జీవితం నుంచి విముక్తి లభించిన ఆనందంలో ఆయన సంబరం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పెద్ద తల్వార్‌తో కేక్ కట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో డేరా బాబాను జైలు నుంచి విడుదల చేసిన బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలతో పాటు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికలు, అదంపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకే ప్రభుత్వం ఆయనను జైలు నుంచి విడుదల చేసిందని మండిపడ్డారు. డేరా బాబా నిర్వహించిన వేడుకల్లో బీజేపీ నేతలు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. Rape convict Ram Rahim celebrated his freedom by cutting a cake with a sword. Several of his followers joined him in his celebration. It's absolute shamelessness on the part of the Haryana government. They have done this to gain votes: @BrindaAdige@aishvaryjain pic.twitter.com/4oYnYcpSVH — TIMES NOW (@TimesNow) January 23, 2023 సీర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు మహిళా భక్తులపై అత్యాచారం చేసిన కేసులో డేరాబాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించించి సీబీఐ కోర్టు. 2017లో ఈ తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి సుంజారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు డేరా బాబా. అయితే అక్టోబర్ 2022లో 40 రోజుల పెరోల్‌పై బయటకు వచ్చిన ఆయన.. మరో మూడు నెలల్లోనే మరోసారి 40 రోజుల పెరోల్‌పై విడుదల అయ్యాడు. దీంతో ప్రభుత్వం తీరుపై విమర్శలు వస్తున్నాయి. డేరా బాబాపై ఓ హత్య కేసు కూడా ఉంది. చదవండి: మెట్రోలోని ప్రయాణికులను హడలెత్తించిన చంద్రముఖి -
జడేజాలా తిప్పాలని యువ క్రికెటర్ విశ్వ ప్రయత్నాలు!
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎప్పుడు ఫిప్టీ లేదా సెంచరీ కొట్టినప్పుడు బ్యాట్‌ను కత్తిసాములా తిప్పడం అలవాటు. అతని సెలబ్రేషన్స్ ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజ్‌పుత్ కుటుంబం నుంచి వచ్చిన జడేజా స్వతహగానే కత్తిసామును బాగా చేయగలడు. అయితే జడ్డూ ఆసియా కప్‌లో ఆడుతూ మోకాలి గాయంతో టోర్నీ నుంచి అర్థంతరంగా వైదొలిగాడు. మోకాలి సర్జరీ అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జడేజా తన గాయంపై ఇటీవలే అప్డేట్ ఇచ్చాడు. వీలైనంత తొందరగా కోలుకునే ప్రయత్నం చేస్తానని జడేజా చెప్పుకొచ్చాడు. కాగా సర్జరీతో కనీసం నెలరోజులైనా విశ్రాంతి అవసరం కావడంతో జడేజా ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్ 2022కు కూడా దూరమయ్యాడు. ఈసారి టి20 ప్రపంచకప్‌లో కీలకపాత్ర పోషిస్తాడనుకున్న తరుణంలో జడేజా ఇలా దూరమవ్వడం అభిమానులకు బాధ కలిగిస్తుంది. ఇదిలా ఉంటే రవీంద్ర జడేజా తొందరగా కోలుకోవాలంటూ యువ క్రికెటర్ చేతన్ సకారియా జడ్డూ స్టైల్‌ను అనుకరించాడు. అతనిలా బ్యాట్‌ను కత్తిసాములా తిప్పడానికి ప్రయత్నించాడు. దాదాపు జడేజాను గుర్తుచేస్తూ ఒంటిచేత్తో బ్యాట్‌ను అటు ఇటు తిప్పాడు. ''జడ్డూ భయ్యాను మిస్ అవుతున్నామనుకునేవాళ్లు ఈ వీడియో కచ్చితంగా చూడాల్సిందే. జడ్డూ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా'' అంటూ రాసుకొచ్చాడు. కాగా చేతన్ సకారియా చర్యకు స్పందించిన జడేజా..''హాహా వెల్డన్ సకారియా.. థాంక్యూ'' అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టీమిండియా టి20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో టి20 సిరీస్‌లు ఆడనుంది. ఇప్పటికే టి20 ప్రపంచకప్ సహా ఆసీస్, సౌతాఫ్రికాలతో ఆడబోయే సిరీస్‌లకు సంబంధించి జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. In case you are missing jaddubhai 🤩😇🤺⚔️@imjadeja Here's wishing him a speedy recovery ❤️🩹💪 🦁 pic.twitter.com/HzBbSLk4uX — Chetan Sakariya (@Sakariya55) September 14, 2022 -
తల్వార్‌తో క్లాస్ రూమ్‌లోకి విద్యార్థి తండ్రి!
బిహార్‌లోని అరారియాలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి భారీ తల్వార్‌తో పాఠశాల తరగతి గదిలోకి ప్రవేశించాడు. తన పిల్లాడి స్కూల్ యూనిఫామ్ కోసం డబ్బులు ఇవ్వలేదని ఉపాధ్యాయులను బెదిరించాడు. ఈ సంఘటన భగ్వాన్పుర్ పంచాయతీ పరిధిలోని జోకిహత్ బ్లాక్‌లో జరిగింది. ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు జోకిహత్ స్టేషన్ అధికారి. 'అరేరియాలోని స్కూల్లోకి ఓ విద్యార్థి తండ్రి పొడవాటి తల్వార్‌తో వచ్చాడు. తన కుమారుడి యూనిఫామ్ కోసం డబ్బులు ఇవ్వలేదని అక్కడ ఉన్న ఉపాధ్యాయులను బెదిరించాడు. ఆ వ్యక్తిని అక్బర్‌గా గుర్తించాం. 24 గంటల్లో డబ్బులు రాకుంటే మళ్లీ వస్తానని టీచర్లను బెదిరించాడు.' అని తెలిపారు ఎస్హెచ్ఓ. ఈ సంఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జహంగిర్.. జోకిహత్ బీడీఓకు ఫిర్యాదు చేశారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతుండగా తల్వార్‌తో దూసుకొచ్చి బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
బాప్రే!.... నెపోలియన్ ఖడ్గం వేలంలో రూ. 21 కోట్లు పలికిందట!
Napoleon Sword And Pistol From 1799 Coup: చాలామంది రాజుల కాలం నాటి వస్తువులను సొంతం చేసుకువాలనే కాక వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. అవి వేల ఏళ్ల నాటి చరిత్రకు అత్యంత విలువైన ఆనావాళ్లు. అలాంటి ఒక గొప్ప సైన్యాధ్యక్షుడు, ఫ్రాన్స్ చక్రవర్తి అయిన నెపొలియన్ 1799లో తిరుగుబాటు చేసినప్పుడు ఉపయోగించిన కత్తి, తుపాకులు తదితర వస్తువులు వేలంలో అత్యధిక ధర పలికాయట. (చదవండి: జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!) అసలు విషయంలోకెళ్లితే 1799లో తిరుగుబాటు జరిగినప్పుడు నెపోలియన్ బోనపార్టే తీసుకెళ్లిన ఖడ్గం అతని ఇతర ఐదు తుపాకీలు వేలంలో $2.8 మిలియన్ల(రూ.21 కోట్లు)కి అమ్ముడయ్యాయని యూఎస్ వేలందారులు ప్రకటించారు. ఈ మేరకు ఇల్లినాయిస్కు చెందిన రాక్ ఐలాండ్ వేలం కంపెనీ అమ్మకానికి ఉంచిన ఈ విలువైన వస్తువులను ఒక అజ్ఞాత వ్యక్తికి ఫోన్ ద్వారా విక్రయించినట్లు కంపెనీ అధ్యక్షుడు కెవిన్ హొగన్ తెలిపారు. పైగా ఆ వ్యక్తి నెపోలియన్ ధరించిన వస్తువులను కొనుగోలుచేసి చాలా అరుదైన చరిత్రను తన ఇంటికి తీసుకువెళుతున్నాడు అని హొగన్ అన్నారు. అయితే ఖడ్గం, ఐదు ఆభరణాలు కలిగిన తుపాకులు విలువ వేలం ప్రారంభంలోనే $1.5 మిలియన్(రూ. 11 కోట్లు) నుండి $3.5 మిలియన్(రూ. 28 కోట్లు)వరకు పలికింది. అంతే కాదు ఈ విలువైన ఆయుధాలను వెర్సైల్స్‌లోని రాష్ట్ర ఆయుధ కర్మాగారానికి డైరెక్టర్‌గా ఉన్న నికోలస్-నోయెల్ బౌటెట్ తయారు చేశారు. అయితే నెపోలియన్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన తర్వాత తన ఖడ్గాన్ని జనరల్ జీన్-అండోచే జునోట్‌కి అందించాడని, తదనంతరం జనరల్ భార్య అప్పులు తీర్చడానికి దానిని అమ్మవలసి వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. పైగా ఈ ఏడాది మేలోనే ఫ్రాన్స్ నెపోలియన్ మరణ ద్విశతాబ్ది వేడుకలను జరుపుకోవడం విశేషం. (చదవండి: అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) -
900 ఏళ్ల నాటి పురాతన కత్తి
ఇజ్రాయెల్: పురావస్తు శాఖ తవ్వకాల్లో రకరకాల వస్తువులు, చాలా కోటలు, ఆనాడు వాళ్లు వినియోగించిన చాలా వస్తువులు బయటపడటం చూశాం. కానీ నదుల్లోనూ, సముద్రాల్లోనూ దొరకడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇక్కడొక వ్యక్తికి మాత్రం సముద్రం అడుగుభాగాన పురాతనమైన కత్తి ఒకటి లభించింది. (చదవండి: వృద్ధ బిచ్చగాడు కూడబెట్టుకున్న సోమ్ము వృధానేనా!) వివరాల్లోకెళ్లితే..శ్లోమి కాట్జిన్ అనే డైవర్కి మధ్యధరా సముద్రం అడుగుభాగన డైవింగ్ చేస్తూ అక్కడ ఉండే అత్యద్భుతమైన వాటిని తన కెమరాతో బంధిస్తుండగా ఒక కత్తి పడి ఉండటాన్ని గుర్తించాడు. ఈ మేరకు అతను సముద్రగర్భంలో అనేక ఇతర పురాతన కళాఖండాలను కనుగొన్నాడు. అంతేకాదు ఈ కత్తి బార్నాకిల్స్తో కప్పబడి ఉంది. అయితే కాట్జిన్ ఆ కత్తిన్ని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీకి అప్పగించాడు. ఆ తర్వాత వాళ్లు అధ్యయనం చేస్తే ఇది 900 సంవత్సరాల నాటి నిజమైన క్రూసేడర్ కత్తిగా గుర్తించారు. ఈ మేరకు ఈ పురాతన కత్తి ఇనుముతో తయారు చేయబడటమ కాక కచ్చితమైన స్థితిలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పురాతన వస్తువుల అథారిటీ వద్ద ఆ కత్తి దోపిడీకి గురైనట్లు అథారిటీ అధికారులు చెప్పుకొచ్చారు. అంతేకాదు అథారిటీ అధికారులు కాట్జిన్కి మంచి పౌరసత్వ ప్రశంసా పత్రాన్ని కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ దీనికి సంబంధించిన 2 నిమిషాల వీడియోను ఫేస్బుక్లో షేర్ చేసింది. ప్రస్తుతం నెట్లింట తెగ వైరల్ అవ్వడమే కాదు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. మీరు కూడా ఒక్కసారి వీక్షించండి. (చదవండి: ఏడాది చిన్నారి నెలకు ఏకంగా రూ.75 వేలు సంపాదన) -
అమెజాన్‌లో కత్తి కొని ప్రియురాలి ఇంటికి.. చివరికి ఏమైందంటే
సాక్షి, బంజారాహిల్స్: అమెజాన్‌లో కొనుగోలు చేసిన జాంబియా(కత్తి) తీసుకొని తన మాజీ ప్రియురాలి వద్దకు వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ఉండటంతో యువతి డయల్ 100కు ఫోన్ చేయగా హుటాహుటిన జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడితో పాటు ప్యాంట్లో పెట్టుకున్న జాంబియాను స్వాదీనం చే సుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్పీఆర్హిల్స్ సమీపంలోని కారి్మకనగర్ ఎన్ఎస్బీ నగర్లో నివసించే యువతి(23) గతంలో జూబ్లీహిల్స్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసేది. బోరబండ సమీపంలోని బంజారానగర్‌లో నివసించే జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ బండారి శ్రీకాంత్(24) తరచూ ఆ హోటల్లో పబ్‌కు వెళ్లినప్పుడు యువతి తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ప్రేమదాకా దారి తీసింది. ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తడంతో బాధితురాలు 2020 అక్టోబర్‌లో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేయగా శ్రీకాంత్‌ను ఆ కేసులో అరెస్ట్ చేశారు. ఒకరి జోలికి ఒకరు రాకుండా ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి 11.55 గంటల ప్రాంతంలో తన సోదరుడి కొడుకు బర్త్‌డే ఉండటంతో శ్రీకాంత్ అక్కడికి వచ్చి పీకలదాకా మద్యం సేవించాడు. పథకం ప్రకారం జాంబియాను జేబులో పెట్టుకొని మాజీ ప్రియురాలి ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. తప్పతాగిన మైకంలో తూలుతూ ఇంట్లోకి వచి్చన శ్రీకాంత్‌ను చూసి బాధితురాలు, ఆమె సోద రి భయాందోళనలకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదు నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా అతడి వద్ద ఉన్న పెద్ద కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
కత్తితో కేక్ కట్ చేసిన హీరో.. క్షమాపణలు
చెన్నై : ఈ మధ్య కాలంలో పుట్టినరోజు వేడుకల్లో కొన్ని అసాధారణ దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెరైటీగా ఉంటుందని చెప్పి తల్వార్, గన్‌తో కేక్ కట్ చేస్తున్నారు కొందరు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. జనాలు వారి మీద దుమ్మెత్తిపోయడం వంటివి చూస్తూనే ఉన్నాం. సామాన్యులనే ఇంతలా తిడితే.. ఇక ఇవే పనులు హీరోలు చేస్తే.. ఇంకెంత ట్రోలింగ్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బహిరంగంగా క్షమాపణలు చెప్పే వరకు వదలరు నెటిజనులు. తాజాగా తమిళ హీరో విజయ్ సేతుపతి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వివరాలు నేడు విజయ్ సేతుపతి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో దర్శకుడు పొన్రామ్ తన టీంతో కలిసి విజయ్ కోసం కేక్ తీసుకువచ్చారు. అయితే వెరైటీగా ఉంటుందని చెప్పి కత్తితో కేక్ కట్ చేయించారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజనులు ఓ రేంజ్లో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో విజయ్ సేతుపతి క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటానని వెల్లడించారు. (చదవండి: గుర్తుండిపోయే జ్ఞాపకం) ఈ మేరకు విజయ్ సేతుపతి తన ట్విట్టర్లో ‘నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పుట్టిన రోజు సందర్భంగా తీసిన ఓ ఫోటో ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది. దీంట్లో నేను కత్తితో కేట్ కట్ చేశాను. నేను దర్శకుడు పొన్రామ్ చిత్రంలో నటించబోతున్నాను. ఇందులో కత్తి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక నేను నా పుట్టిన రోజును పొన్రామ్, బృందంతో జరుపుకున్నాను. దాంతో కేక్ కట్ చేయడానికి కత్తిని ఉపయోగించాను. ఈ పనితో నేను సమాజంలోకి తప్పుడు సంకేతాలు పంపానని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను. నా పనితో ఎవరినైనా బాధపెట్టినట్లయితే, క్షమాపణలు కోరుతున్నాను. నా చర్యకు చింతిస్తున్నాను’ అంటూ విజయ్ సేతుపతి తమిళ్లో ట్వీట్ చేశారు. (చదవండి: సిరీస్ కోసం సీరియస్) 🙏🏻 pic.twitter.com/dRRrYrmRd1 — VijaySethupathi (@VijaySethuOffl) January 16, 2021 గతంలో, చెన్నై పోలీసులు తమ పుట్టినరోజు కేక్‌ను కత్తితో కట్ చేసినందుకు స్థానిక గూండాలను అరెస్టు చేశారు. ఇప్పుడు విజయ్ సేతుపతి అదే నేరం చేశారు. మరి తనను కూడా అరెస్టు చేస్తారా అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా విజయ్ సేతుపతి నటించిన మాస్టర్ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
కత్తి సరిపోలేదని ఖడ్గంతో కోశాడు.. దాంతో
నాగ్‌పూర్ : పుట్టినరోజు వేడుక అంటే అందరితో కలిసి సంతోషంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తారు. కానీ కొందరు వ్యక్తులు మాత్రం తమ పుట్టినరోజును మరిచిపోలేని మధురానుభూతిగా మలుచుకోవాలని అతిగా ప్రవర్తిస్తుంటారు. ఆ అతి ప్రవర్తనే వారిని అందరిముందు అబాసుపాలయ్యేలా చేస్తుంది.(చదవండి : బాణాసంచా పేలి ఐదుగురు సజీవ దహనం) తాజాగా నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల నిఖిల్ పటేల్ అక్టోబర్ 21న తన పుట్టినరోజు పురస్కరించుకొని అందరిని పిలిచి ఘనంగా వేడుకలు నిర్వహించాడు. పార్టీ మధ్యలో వచ్చిన నిఖిల్ స్నేహితులు నాలుగు పెద్ద కేక్‌లను అరేంజ్ చేశారు. సాధారణంగా అయితే ఆ కేకులను కత్తితో కట్‌చేస్తే సరిపోయేది.. కానీ నిఖిల్ ఇక్కడే కాస్త అతిగా ప్రవర్తించాడు. ఘనంగా పుట్టినరోజు జరుపుకుంటున్న తాను కేక్‌ను కత్తితో కట్‌చేస్తే మజా ఎలా ఉంటుందని చెప్పి లోపలికి వెళ్లి ఖడ్గం తెచ్చి కేక్‌ను కట్ చేశాడు. నిఖిల్ చేసిన పనిని అతని స్నేహితులు ఫోటోలు తీసి వాట్సప్‌లో షేర్ చేశారు. అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫోటోలు పోలీసుల దృష్టిలో పడ్డాయి. వెంటనే నిఖిల్ ఇంటికి చేరుకున్న పోలీసులు అతన్ని మారణాయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. -
కాపాడుకోవడం కోసమే.. కత్తి దూశాడు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ముఖర్జి నగర్లో ఆదివారం సాయంత్రం పోలీసులకు, ఆటో డ్రైవర్‌కు మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. పోలీసులు ఆటో డ్రైవర్‌ను దారుణంగా చితక బాదడం.. అతను కాస్త కత్తితో పోలీసుల మీద ఎదురు దాడికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో ఉన్నతాధికారులు ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ వివాదం గురించి సదరు ఆటో డ్రైవర్ తండ్రి మంజీత్ సింగ్(75) మాట్లాడుతూ.. ‘ప్రాణ రక్షణ కోసం నా కుమారుడు కత్తి తీశాడు. అంతే తప్ప ఎవరిని గాయపర్చలేదు. కానీ పోలీసులు మాత్రం నా కొడుకును, మనవడిని దారుణంగా హింసించారు. వారిని కృరంగా కొట్టారు. దాడి చేసిన పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మైనర్ అయిన నా మనవడి పట్ల పోలీసుల తీరు తల్చుకుంటే నాకు చాలా భయం వేసింది’ అన్నారు. మంజీత్ సింగ్ కుమారుడు సరబ్జీత్ సింగ్(45), అతని మనవడు ప్రయాణిస్తున్న ఆటో అనుకోకుండా పోలీసు వాహానాన్ని ఢీ కొట్టింది. ఆగ్రహించిన పోలీసులు సరబ్జీత్ సింగ్‌ను, అతని కుమారుడిని రోడ్డు మీదకు లాగి.. బూట్లతో తంతూ.. దారుణంగా చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా దీనిపై స్పందించారు. పూర్తి విచారరణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. -
బూటు కాలితో తంతూ.. రోడ్డు మీద లాక్కెళ్తూ
న్యూఢిల్లీ : ఆటో డ్రైవర్‌కి, పోలీసులకు మధ్య జరిగిన ఓ వీధి పోరాట దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వివరాలు.. గ్రామీణ్ సేవ ఆటో ఒకటి ముఖర్జి నగర్లో పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో పోలీసులు సదరు ఆటో డ్రైవర్ని, అతని కుమారున్ని బయటకు లాగి చితకబాదారు. బూటు కాలితో తంతూ.. డ్రైవర్ని రోడ్డు మీద ఈడ్చుకెళ్లారు. ఆగ్రహించిన ఆటో డ్రైవర్ తిరగబడటమే కాక వెంట తెచ్చుకున్న కత్తితో పోలీసుల మీద దాడి చేసేందుకు యత్నించాడు. ఈ తతంగాన్నంత ఓ వ్యక్తి వీడియో తీసి ఇంటర్నెట్లో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పోలీసుల తీరుపై నెటిజన్లు మండి పడుతున్నారు. అయితే ఈ వివాదంపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఆటో డ్రైవర్ పోలీసు వాహనాన్ని ఢీకొట్టాడని.. ఇద్దరు అధికారుల తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అన్యాయంగా పోలీసులు తన మీద దాడి చేశారని సదరు ఆటో డ్రైవర్ వాపోతున్నాడు. అయితే ఈ ఘటనలో పోలీసులనే విమర్శిస్తున్నారు నెటిజనులు. ఈ సంఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. ‘ముఖర్జి నగర్లో జరిగిన సంఘటన చాలా దారుణమైంది, అన్యాయమైంది. పోలీసుల తీరును నేను ఖండిస్తున్నాను. దీని గురించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఆదేశిస్తున్నాను’ అన్నారు. ఈ ఘటనపై సీఎం కూడా స్పందిచడంతో ఉన్నతాధికారులు గొడవకు బాధ్యులైన ఓ ఎస్సైని, కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు. -
శ్రీవారికి రూ.1.75 కోట్ల బంగారు ఖడ్గం
సాక్షి, చిత్తూరు : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రూ. 1.75 కోట్ల విలువ చేసే బంగారు ఖడ్గాన్ని ఓ భక్తుడు కానుకగా సమర్పించాడు. శ్రీవారి దర్శనార్థం మంగళవారం తమిళనాడు తేని జిల్లా బొడినాయకులు గ్రామానికి చెందిన తంగదొరై అనే భక్తుడు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి రూ. 1.75 కోట్ల విలువచేసే బంగారు ఖడ్గాన్ని కానుకగా ఇచ్చారు. కొనసాగుతున్న భక్తుల రద్దీ : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్ట్మెంట్లు అన్నీ నిండి భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 25 గంటల సమయం పడుతోండగా, కాలి నడకన వచ్చే భక్తుల దర్శనానికి 10 గంటలు, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నటి శ్రీరెడ్డి కాలినడకన వచ్చి నేడు స్వామి వారిని దర్శించుకున్నారు. -
బోయ్‌ఫ్రెండ్‌తో బెడ్ రూంలో కత్తితో యుద్ధం
న్యూయార్క్ : తాను ఎంతగానో ప్రేమిస్తున్న బోయ్‌ఫ్రెండ్ తనను మోసం చేస్తున్నాడని గమనించిన ఓ అమెరికన్ గర్ల్‌ఫ్రెండ్ పెద్ద ప్రణాళికనే రచించింది. అతడిని అంతమొందించాలని కుట్ర చేసి పెద్ద సమురాయ్ కత్తిని తెచ్చి పెట్టుకుంది. ఎప్పటి మాదిరిగానే నిద్రపోయే సమయానికి బెడ్ రూంలోకి వెళ్లి అందులో పెద్ద యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఎంతో కొంత మార్షల్ ఆర్ట్స్ పరిజ్ఞానం ఉండటంతో ఆ బోయ్‌ఫ్రెండ్ ప్రాణాలతో బయటపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎమిలీ జావియెర్, అలెక్స్ లోవెల్ అనే ఇద్దరు ప్రేమికులు. వారిద్దరు గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. అయితే, అలెక్స్ ప్రవర్తనలో మార్పును గుర్తించిన ఎమిలీ లోలోపల కుమిలిపోయింది. ఒకరోజు అతడి ఫోన్లో డేటింగ్ యాప్ టిండర్‌ను గుర్తించింది. అలాగే, అతడి వీపు వెనుక భాగంలో గోర్లతో రక్కిన చారలు గుర్తించింది. పైగా ఆమె స్నానం చేసే బాత్ రూంలో ఎరుపు వర్ణంతో ఉన్న వెంట్రుకలను గుర్తించింది. అయితే, ఆమె వెంట్రుకలు లేత ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. దాంతో రగిలిపోయిన ఎమిలీ.. తన బోయ్‌ఫ్రెండ్ రహస్యంగా మోసం చేస్తున్నాడని మండిపోయింది. అతడికి తెలియకుండా ఒక పెద్ద సమురాయ్ కత్తిని కొనుగోలు చేసింది. అతడికి అనుమానం రాకుండా బెడ్రూంలో బెడ్ కింద పెట్టింది. చాలా సేపు ఇద్దరు కబుర్లు చెప్పుకొని ఆ రోజు నిద్రలోకి జారుకున్నారు. అయితే, నిద్రపోయినట్లుగా నటించిన ఎమిలీ చీకట్లోనే కత్తిని బయటకు తీసింది. తన టార్గెట్ మిస్సవకూడదని, ఎట్టి పరిస్థితుల్లో అతడు చనిపోవాలని నిర్ణయించుకొని తన సెల్లో లైట్‌ను ఆన్ చేసింది. సరిగ్గా వేటు వేసే సమయానికి అతడు నిద్ర లేచాడు. అప్పటికే ఆమె కత్తితో దాడి చేయడం మొదలుపెట్టింది. అప్పటికే పలు వీడియో గేమ్స్‌లలో మార్షల్ ఆర్ట్స్ చూడటం, మార్షల్ ఆర్ట్స్ సినిమాలంటే తనకు ఇష్టం ఉండటంతో అలెక్స్ ఆమెను నిలువరించే ప్రయత్నం చేశాడు. గాయాలతోనే ఆమెను ఓసారి గట్టిగా హత్తుకొని, ఆమె కళ్లలోకి చూస్తూ 'నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను.. ఎందుకిలా చేస్తున్నావు' అంటూ ఏడ్చేశాడు. అయినా ఎమిలీ జాలీ చూపలేదు. దీంతో ఏదోలాగా కష్టపడి అతడు ఎమెర్జెన్సీకి ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అలెక్స్ పొట్టలోకి కత్తిని కూడా ఆమె దింపేసింది. అలెక్స్ రెండు చేతి వేళ్లు తెగిపోయి బెడ్‌పై పడిపోయి ఉన్నాయి. ఈ సంఘటన ఈ నెల 3న చోటు చేసుకోగా అదృష్టం కొద్ది అతడు ప్రస్తుతం ప్రాణాలతో బయటపడ్డాడు. -
తల్లీకూతుళ్లపై కత్తితో దాడి
కొవ్వూరు రూరల్ : సరిహద్దు తగాదా నేపథ్యంలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తల్లీకూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో బుధవారం జరిగింది. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. ఉప్పులూరి వరలక్ష్మి, ఆమె కుమార్తె శశిరేఖ కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఈ క్రమంలో గద్దె వెంకట సుబ్బారావు ఇంటివైపున తమ స్థలంలో ఉన్న మందార మొక్కను తొలగిస్తుండగా.. వెంకట సుబ్బారావు వారిని అడ్డుకున్నాడు. దీంతో వివాదం రేగింది. ఆగ్రహానికి గురైన వెంకట సుబ్బారావు తన చేతిలో ఉన్న కత్తితో వరలక్షి్మ తలపైన, ఎడమ భుజంపైన నరికాడు. అడ్డుగా వెళ్లిన వరలక్ష్మి కుమార్తె శశిరేఖను రెండు చేతులపై నరికాడు. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో స్థానికులు పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. కొవ్వూరులో 108 అందుబాటులో లేకపోవడంతో పోలవరం నుంచి ఆ వాహనం వచ్చే సరికి ఆలస్యమైంది. బాధితులు రెండుగంటలపాటు రక్తపు మడుగుల్లో విలవిల్లాడారు. అనంతరం వచ్చిన వాహనం వారిని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఫోన్ ఇస్తారా.. చావమంటారా?
న్యూయార్క్: ఐఫోన్ కోసం గతంలో ఒక వ్యక్తి తన కిడ్నీలను అమ్ముకుంటే ఇంకొందరు దొంగతనం చేసేందుకు కూడా వెనుకాడలేదు. తాజాగా న్యూయార్క్‌లో 'సూ చియెన్' (30) అనే వ్యక్తి యాపిల్ ఫ్లాగ్షిప్ స్టోర్‌కు వెళ్లి హంగామా సృష్టించాడు. ఇలాంటి ఘటనే 'న్యూయార్క్ యాపిల్ స్టోర్'లో చోటు చేసుకుంది. తనకు ఎలాగైనా ఐఫోన్ కావాలని, లేదంటే చనిపోతానని మెడపై కత్తి పెట్టుకుని బెదిరించడం కలకలం రేపింది. దాదాపు 2 అడుగుల పొడవుతో, వంకర్లు తిరిగి చూసేందుకే భయంకరంగా ఉన్న పదునైన కత్తితో స్టోర్‌లో ప్రవేశించి తనకు ఎలాగైనా ఐఫోన్ ఇవ్వాలని బెదిరించాడు. దీంతో అక్కడున్న ఇతర వినియోగదారులు భయపడి అటూ ఇటూ పరుగులు పెట్టారు. ఇంతలో అలర్టయిన స్టోర్ సెక్యూరిటీ సిబ్బంది ఎవరికీ గాయాలు కాకుండా ఆ వ్యక్తికి, ఇతర వినియోగదారులకు మధ్య ఒక కంచెను ఏర్పాటుచేశారు. అయినా అతడు ఎక్కడా తగ్గలేదు. మరింత అలజడి సృష్టించాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అతికష్టం మీద సూ చియెన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ వ్యవహారన్నంతా అక్కడే ఉన్న ఒక వ్యక్తి తన ఫోన్లో వీడియో తీసి తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. Man armed with a sword arrested at #applestore #nyc #breakingnews pic.twitter.com/qljjB1d5L5 — Boris (@borisrio) November 20, 2015 -
ప్రాణాలకు తెగించిన కస్టమర్
ముంబయి: ఆర్ధిక రాజధాని ముంబయి నగర వీధిలో దారుణం చోటుచేసుకోబోయింది. వికలాంగుడైన రజ్నీష్ సింగ్ ఠాకూర్ అనే ఓ మొబైల్ షాప్ యజమానిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అదే సమయంలో షాపులో ఫోన్ కొనేందుకు వచ్చిన ఒక వినియోగదారుడు ఎంతో ధైర్యం చేసి ఆ వ్యక్తిని అడ్డుకోవడమే కాకుండా తన చేతుల్లో బంధించి పక్కన ఉన్న వ్యక్తులకు అప్పజెప్పాడు. ఆ వినియోగ దారుడు సాహసం చేసి ఉండకపోతే ఆ యజమాని చనిపోయేవాడు. అప్పటికే హత్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి రెండుసార్లు కత్తితో దాడి చేయడంతో చేతికి, మెడకు గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ దృశ్యం అంతా కూడా ఆ షాపులోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటన వెనుక మొత్తం ఆరుగురు వ్యక్తుల హస్తం ఉందని పోలీసులు తేల్చారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసి మరో ఇద్దరి కోసం గాలింపులు ప్రారంభించారు. అసలేం జరిగిందంటే.. ఈ మధ్య రౌడీయిజం చేస్తూ కొందరు వ్యక్తులు రోజుకు వెయ్యి రూపాయలు తమకు చెల్లించాలని బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండాలని, ఎవరైనా మాముళ్లు ఇస్తే వారి షాపులు తగులబెడతామని కూడా ఆ పోస్టర్లో హెచ్చరించారు. దీంతోపాటు ఎవరైనా వసూళ్లకు పాల్పడేవారు వస్తే తనకుగానీ, తన సోదరుడికిగానీ ఫోన్ చేయవచ్చని కూడా అందులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే వసూళ్లకు పాల్పడేవారు మొత్తం ఆరుగురు కలిసి రజ్నీష్ సింగ్ అనే వ్యక్తిని హత్య చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. మొత్తం ఆరుగురిలో ఐదుగురు కారులో కూర్చోగా ఒకరు మాత్రం కత్తితో వచ్చి సింగ్ పై దాడి చేయగా ఓ వినియోగదారుడు ధైర్యంగా అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి సింగ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఆ కస్టమర్ లేకుంటే తన సోదరుడు చనిపోయేవాడని సింగ్ సోదరుడు తెలిపాడు. -
కానిస్టేబుల్‌పై కత్తితో దాడి