
స్వామి వారికి బహూకరించిన బంగారు ఖడ్గం
సాక్షి, చిత్తూరు : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రూ. 1.75 కోట్ల విలువ చేసే బంగారు ఖడ్గాన్ని ఓ భక్తుడు కానుకగా సమర్పించాడు. శ్రీవారి దర్శనార్థం మంగళవారం తమిళనాడు తేని జిల్లా బొడినాయకులు గ్రామానికి చెందిన తంగదొరై అనే భక్తుడు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి రూ. 1.75 కోట్ల విలువచేసే బంగారు ఖడ్గాన్ని కానుకగా ఇచ్చారు.
కొనసాగుతున్న భక్తుల రద్దీ : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్ట్‌మెంట్‌లు అన్నీ నిండి భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 25 గంటల సమయం పడుతోండగా, కాలి నడకన వచ్చే భక్తుల దర్శనానికి 10 గంటలు, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నటి శ్రీరెడ్డి కాలినడకన వచ్చి నేడు స్వామి వారిని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment