మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ తాను వచ్చే నెలలో యూకే వెళ్తున్నానని, ఛత్రపతి శివాజీ ఖడ్గాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ఈ మేరకు ఆయన రాయ్‌గఢ్ జిల్లాలోని ఖర్ఘర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హజరైన కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి ముంగంటివార్ ఈ వ్యాఖ్యలు చేశారు. శివాజీ మహారాజ్ పట్టాభిషేకం 350వ వార్షికోత్సవాన్ని త్వరలో జరుపుకోనున్నట్లు కూడా చెప్పారు.
ఈ సందర్భంగా తాను వచ్చే నెలలో బ్రిటన్‌ని సందర్శస్తానని, అక్కడ 17వ శతాబ్ధపు యోధుడు ఛత్రపతి శివాజీ ఉపయోగించిన జగ్దాంబ(ఖడ్గం), వాఘ్-నఖ్(పులి గోళ్లలా కనిపించే బాకు) తిరిగి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. మరాఠీ ప్రజల వీక్షించేలా అందుబాటులో ఉంచడం కోసం దీని గురించి బ్రిటిస్ డిప్యూటీ హైకమిషనర్ అలాన్ గెమ్మెల్, రాజకీయ ద్వైపాక్షిక వ్యవహారాల డిప్యూటీ హెడ్ ఇమోజెన్ స్టోన్‌తో కూడా చర్చించానని చెప్పారు.
తాను మే మొదటి వారంలో బ్రిటన్‌కు వెళ్తున్నానని, శివాజీ పట్టాభిషేకం 350వ వార్షికోత్సవం కల్లా వాటిని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఈ దేశం ప్రపంచం సెల్యూట్ చేసేలా ఆ వార్షికోత్సవాన్ని వైభవోపేతంగా జరుపుకుందాం అన్నారు మహారాష్ట్ర మంత్రి ముంగంటివార్.
(చదవండి: యూపీలో మరో వ్యక్తి కొంగ స్నేహం..ఏం జరుగుతుందో చూడాలి..)
Comments
Please login to add a commentAdd a comment