పంకజ ముండే సహా 10 మందికి మంత్రి పదవులు | 10-member Fadnavis ministry to be sworn-in today | Sakshi
Sakshi News home page

పంకజ ముండే సహా 10 మందికి మంత్రి పదవులు

Published Fri, Oct 31 2014 3:35 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

పంకజ ముండే(ఫైల్) - Sakshi

పంకజ ముండే(ఫైల్)

ముంబై: మహారాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా దేవంద్ర ఫడణ్ వీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దివంగత నేత గోపినాథ్ కుమార్తె పంకజ ముండే సహా పది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం.

బీజేపీ కోర్ కమిటీ సభ్యులు ఏక్నాథ్ ఖడ్సే, సుధీర్ మునగంటివార్, వినోద్ తవ్డే, పంకజ ముండే, ముంబై బీజేపీ మాజీ అధ్యక్షుడు ప్రకాశ్ మెహతా, పాల్గార్ జిల్లాకు చెందిన గిరిజన నాయకుడు విష్ణు సవ్రా, చంద్రాకాంత్ పాటిల్, విద్య థాకూర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

కాగా ప్రమాణ స్వీకారోత్సవానికి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement