ముంబై: మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. అజిత్ పవార్ వర్గం ఎన్సీపీని వీడి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరింది. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక, పవార్ వర్గం బీజేపీ కూటమితో చేరడం పట్ల మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేతలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న ఎన్సీపీ నేతలను ఇప్పుడే పక్కనే కూర్చోబెట్టుకోవాలన్న కారణంగా తమ అసంతృప్తిని పరోక్షంగా వెళ్లగక్కతున్నారు.
ఈ క్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో రెండు నెలలు సెలవు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే, పంకజ్ ముండే శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అజిత్ పవర్ వర్గం ప్రభుత్వంలో చేరడంపై చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. అవినీతి ఆరోపణలున్న ఎన్సీపీ నేతలు ప్రభుత్వంలో చేరడం పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందుకే తాను రెండు నెలలు సెలవు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఆమె పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తలపై సీరియస్ అయ్యారు.
తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను పంకజా ముండే ఖండించారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని తాను కలిసినట్లు ప్రసారం చేసిన ఛానెల్‌పై పరువు నష్టం కేసు వేస్తానని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వదంతులు ఎందుకు వస్తున్నాయని ఆమె ప్రశ్నించారు. బీజేపీ సమావేశాలకు తనను ఆహ్వానించకపోవడం వల్లనే ఇలాంటి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై బీజేపీ హైకమాండ్ సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ సిద్ధాంతం తన రక్తంలో ఉందన్నారు. సిద్ధాంతాల విషయంలో రాజీపడాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి రెడీగా ఉన్నానని సంచలన కామెంట్స్ చేశారు. 20 ఏళ్లుగా పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశానని, అయినా తన నీతిని ప్రశ్నిస్తున్నారని, పుకార్లు పుట్టిస్తున్నారని పంకజా ముండే ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: మహారాష్ట్ర రాజకీయాలపై గడ్కరీ అదిరిపోయే సెటైరికల్ పంచ్
Comments
Please login to add a commentAdd a comment