జడేజాలా తిప్పాలని యువ క్రికెటర్‌ విశ్వ ప్రయత్నాలు! | Chetan Sakariya Recreates Sword Celebration Wish Jadeja Speed Recovery | Sakshi
Sakshi News home page

Chetan Sakaria-Jadeja: జడేజాలా తిప్పాలని యువ క్రికెటర్‌ విశ్వ ప్రయత్నాలు!

Published Fri, Sep 16 2022 9:17 AM | Last Updated on Fri, Sep 16 2022 9:17 AM

Chetan Sakariya Recreates Sword Celebration Wish Jadeja Speed Recovery - Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఎప్పుడు ఫిప్టీ లేదా సెంచరీ కొట్టినప్పుడు బ్యాట్‌ను కత్తిసాములా తిప్పడం అలవాటు. అతని సెలబ్రేషన్స్‌ ఎన్నోసార్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజ్‌పుత్‌ కుటుంబం నుంచి వచ్చిన జడేజా స్వతహగానే కత్తిసామును బాగా చేయగలడు. అయితే జడ్డూ ఆసియా కప్‌లో ఆడుతూ మోకాలి గాయంతో టోర్నీ నుంచి అర్థంతరంగా వైదొలిగాడు. మోకాలి సర్జరీ అనంతరం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జడేజా తన గాయంపై ఇటీవలే అప్‌డేట్‌ ఇచ్చాడు.

వీలైనంత తొందరగా కోలుకునే ప్రయత్నం చేస్తానని జడేజా చెప్పుకొచ్చాడు. కాగా సర్జరీతో కనీసం నెలరోజులైనా విశ్రాంతి అవసరం కావడంతో జడేజా ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌ 2022కు కూడా దూరమయ్యాడు. ఈసారి టి20 ప్రపంచకప్‌లో కీలకపాత్ర పోషిస్తాడనుకున్న తరుణంలో జడేజా ఇలా దూరమవ్వడం అభిమానులకు బాధ కలిగిస్తుంది. 

ఇదిలా ఉంటే రవీంద్ర జడేజా తొందరగా కోలుకోవాలంటూ యువ క్రికెటర్‌ చేతన్‌ సకారియా జడ్డూ స్టైల్‌ను అనుకరించాడు. అతనిలా బ్యాట్‌ను కత్తిసాములా తిప్పడానికి ప్రయత్నించాడు. దాదాపు జడేజాను గుర్తుచేస్తూ ఒంటిచేత్తో బ్యాట్‌ను అటు ఇటు తిప్పాడు. ''జడ్డూ భయ్యాను మిస్‌ అవుతున్నామనుకునేవాళ్లు ఈ వీడియో కచ్చితంగా చూడాల్సిందే. జడ్డూ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా'' అంటూ రాసుకొచ్చాడు. కాగా చేతన్‌ సకారియా చర్యకు స్పందించిన జడేజా..''హాహా వెల్‌డన్‌ సకారియా.. థాంక్యూ'' అంటూ కామెంట్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక టీమిండియా టి20 ప్రపంచకప్‌కు ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో టి20 సిరీస్‌లు ఆడనుంది. ఇప్పటికే టి20 ప్రపంచకప్‌ సహా ఆసీస్‌, సౌతాఫ్రికాలతో ఆడబోయే సిరీస్‌లకు సంబంధించి జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement