![Ravindra Jadeja Hilarious Dialogue Of Allu Arjun Pushpa Movie Viral - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/23/Jadeja.jpg.webp?itok=GM29wS00)
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అల్లు అర్జున్ ట్రాన్స్‌లో పడిపోయాడు. పుష్ప సినిమాలో 'తగ్గేదే లే' అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొన్నటికి మొన్న ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్‌ను ఫేస్ మార్ఫింగ్ చేసి తగ్గేదే లే అంటూ డైలాగ్ చెప్పడం వైరల్‌గా మారింది. తాజాగా జడ్డూ కూడా తనదైన శైలిలో మెప్పించాడు. ''పుష్ప.. పుష్పరాజ్.. దీనమ్మ తగ్గేదే లే..'' అంటూ సూపర్ మాడ్యూలేషన్‌తో చెప్పాడు. జడేజా చెప్పిన డైలాగ్‌ను మైత్రి మూవీ మేకర్స్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గాయం కారణంగా రవీంద్ర జడేజా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో రీహాబిటేషన్‌లో ఉన్నాడు.
చదవండి: 1983 వరల్డ్‌కప్: టీమిండియా సభ్యుల మ్యాచ్ ఫీజు ఎంతో తెలుసా?
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఇప్పుడు పుష్ప సినిమా మేనియా నడుస్తోంది. బన్ని- సుకుమార్ కాంబినేషన్‌లో ప్యాన్ ఇండియా సినిమాగా వచ్చిన ''పుష్ప: ది రైజ్'' సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినప్పటికి కలెక్షన్లు మాత్రం దుమ్ముదులుపుతుంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్యాన్ ఇండియా వ్యాప్తంగా కలెక్షన్లు కొల్లగొడుతుంది
Comments
Please login to add a commentAdd a comment