ఇజ్రాయెల్: పురావస్తు శాఖ తవ్వకాల్లో రకరకాల వస్తువులు, చాలా కోటలు, ఆనాడు వాళ్లు వినియోగించిన చాలా వస్తువులు బయటపడటం చూశాం. కానీ నదుల్లోనూ, సముద్రాల్లోనూ దొరకడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఇక్కడొక వ్యక్తికి మాత్రం సముద్రం అడుగుభాగాన పురాతనమైన కత్తి ఒకటి లభించింది.
(చదవండి: వృద్ధ బిచ్చగాడు కూడబెట్టుకున్న సోమ్ము వృధానేనా!)
వివరాల్లోకెళ్లితే..శ్లోమి కాట్జిన్ అనే డైవర్‌కి మధ్యధరా సముద్రం అడుగుభాగన డైవింగ్ చేస్తూ అక్కడ ఉండే అత్యద్భుతమైన వాటిని తన కెమరాతో బంధిస్తుండగా ఒక కత్తి పడి ఉండటాన్ని గుర్తించాడు. ఈ మేరకు అతను సముద్రగర్భంలో అనేక ఇతర పురాతన కళాఖండాలను కనుగొన్నాడు. అంతేకాదు ఈ కత్తి బార్నాకిల్స్‌తో కప్పబడి ఉంది. అయితే కాట్జిన్ ఆ కత్తిన్ని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీకి అప్పగించాడు.
ఆ తర్వాత వాళ్లు అధ్యయనం చేస్తే ఇది 900 సంవత్సరాల నాటి నిజమైన క్రూసేడర్ కత్తిగా గుర్తించారు. ఈ మేరకు ఈ పురాతన కత్తి ఇనుముతో తయారు చేయబడటమ కాక కచ్చితమైన స్థితిలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పురాతన వస్తువుల అథారిటీ వద్ద ఆ కత్తి దోపిడీకి గురైనట్లు అథారిటీ అధికారులు చెప్పుకొచ్చారు. అంతేకాదు అథారిటీ అధికారులు కాట్జిన్‌కి మంచి పౌరసత్వ ప్రశంసా పత్రాన్ని కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ దీనికి సంబంధించిన 2 నిమిషాల వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం నెట్లింట తెగ వైరల్ అవ్వడమే కాదు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. మీరు కూడా ఒక్కసారి వీక్షించండి.
Comments
Please login to add a commentAdd a comment