తల్వార్‌తో క్లాస్‌ రూమ్‌లోకి విద్యార్థి తండ్రి! | Man Barges In Bihar Into Classroom With Sword Threatens Teachers | Sakshi
Sakshi News home page

తల్వార్‌తో క్లాస్‌ రూమ్‌లోకి విద్యార్థి తండ్రి!

Published Fri, Jul 8 2022 3:57 PM | Last Updated on Fri, Jul 8 2022 4:00 PM

Man Barges In Bihar Into Classroom With Sword Threatens Teachers - Sakshi

బిహార్‌లోని అరారియాలో షాకింగ్‌ సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి భారీ తల్వార్‌తో పాఠశాల తరగతి గదిలోకి ప్రవేశించాడు. తన పిల్లాడి స్కూల్‌ యూనిఫామ్‌ కోసం డబ్బులు ఇవ్వలేదని ఉపాధ్యాయులను బెదిరించాడు. ఈ సంఘటన భగ్వాన్‌పుర్‌ పంచాయతీ పరిధిలోని జోకిహత్‌ బ్లాక్‌లో జరిగింది.

ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు జోకిహత్‌ స్టేషన్‌ అధికారి. 'అరేరియాలోని స్కూల్‌లోకి ఓ విద్యార్థి తండ్రి పొడవాటి తల్వార్‌తో వచ్చాడు. తన కుమారుడి యూనిఫామ్‌ కోసం డబ్బులు ఇవ్వలేదని అక్కడ ఉన్న ఉపాధ్యాయులను బెదిరించాడు. ఆ వ‍్యక్తిని అక్బర్‌గా గుర్తించాం. 24 గంటల్లో డబ్బులు రాకుంటే మళ్లీ వస్తానని టీచర్లను బెదిరించాడు.' ‍అని తెలిపారు ఎస్‌హెచ్‌ఓ.

ఈ సంఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జహంగిర్‌.. జోకిహత్‌ బీడీఓకు ఫిర్యాదు చేశారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతుండగా తల్వార్‌తో దూసుకొచ్చి బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement