School Dress
-
80 మంది విద్యార్థునుల పట్ల స్కూల్ ప్రిన్సిపల్ పైశాచికత్వం!
ధన్‌బాద్: ఓ ప్రైవేట్ స్కూల్ (private school) యాజమాన్యం 80 మంది పదో తరగతి విద్యార్థునుల పట్ల పైశాచికంగా ప్రవర్తించింది. పెన్ డే పేరుతో నిర్వహించిన వేడుకల్లో బలవంతంగా విద్యార్థునుల షర్ట్‌లను విప్పదీయించి బ్లేజర్‌తో ఇంటికి పంపించింది. పరీక్షలు పూర్తవడంతో ‘పెన్ డే’ (penday)పేరిట షర్ట్‌లపై పెన్నులతో రాసుకున్న పదో తరగతి విద్యార్థునులను ఆ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ దారుణంగా శిక్షించిన ఘటన జార్ఖండ్ jharkhand)లో ఆలస్యంగా వెలుగుచూసింది. మొత్తం 80 మంది అమ్మాయిల షర్ట్‌లను బలవంతంగా వారితోనే విప్పదీయించి అందర్నీ బ్లేజర్ (కోటు) మీదనే ఇంటికి పంపించేసిన ఉదంతం ధన్‌బాద్ జిల్లాలోని డిగ్వాడియా పట్టణంలో జరిగింది.విషయం తెల్సుకుని జిల్లాయంత్రాంగం వెంటనే విచారణకు ఆదేశించింది. జోరాపోఖార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఈ ఉదంతం చోటుచేసుకుందని వివరాలను ధన్‌బాద్ డెప్యూటీ కమిషనర్ మాధవీ మిశ్రా వెల్లడించారు. స్నేహితులకు సందేశాల పేరిట చొక్కాలను పెన్ను గీతలతో నింపేయడమేంటంటూ ప్రిన్సిపల్ పట్టరాని ఆవేశంతో విద్యార్థులపై కోప్పడి షర్ట్‌లను తీసేయాలని ఆజ్ఞాపించాడు. పిల్లలు క్షమాపణలు చెప్పినా వినిపించుకోలేదు. బలవంతంగా వారితోనే తీయించి ఇంటికి పంపేశారు.అవమానంగా భావించిన కొందరు విద్యార్థునులు తమ తల్లిదండ్రులకు చెప్పడం, వారు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు కోసం జిల్లా యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో ఒక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ , జిల్లా విద్యాధికారి, జిల్లా సామాజిక సంక్షేమాధికారి, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఉంటారు. ప్రిన్సిపల్ ఘటన సిగ్గుమాలిన, దురదృష్టకర చర్య అని ఝరియా ఎమ్మెల్యే రాగిణి సింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.👉చదవండి : మీకు తెలుసా? ప్రమాద బాధితుల్ని కాపాడితే కేంద్రం డబ్బులిస్తుంది! -
తల్వార్‌తో క్లాస్ రూమ్‌లోకి విద్యార్థి తండ్రి!
బిహార్‌లోని అరారియాలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి భారీ తల్వార్‌తో పాఠశాల తరగతి గదిలోకి ప్రవేశించాడు. తన పిల్లాడి స్కూల్ యూనిఫామ్ కోసం డబ్బులు ఇవ్వలేదని ఉపాధ్యాయులను బెదిరించాడు. ఈ సంఘటన భగ్వాన్పుర్ పంచాయతీ పరిధిలోని జోకిహత్ బ్లాక్‌లో జరిగింది. ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు జోకిహత్ స్టేషన్ అధికారి. 'అరేరియాలోని స్కూల్లోకి ఓ విద్యార్థి తండ్రి పొడవాటి తల్వార్‌తో వచ్చాడు. తన కుమారుడి యూనిఫామ్ కోసం డబ్బులు ఇవ్వలేదని అక్కడ ఉన్న ఉపాధ్యాయులను బెదిరించాడు. ఆ వ్యక్తిని అక్బర్‌గా గుర్తించాం. 24 గంటల్లో డబ్బులు రాకుంటే మళ్లీ వస్తానని టీచర్లను బెదిరించాడు.' అని తెలిపారు ఎస్హెచ్ఓ. ఈ సంఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జహంగిర్.. జోకిహత్ బీడీఓకు ఫిర్యాదు చేశారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు పాఠాలు చెబుతుండగా తల్వార్‌తో దూసుకొచ్చి బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
లెగ్గింగ్స్ వేసుకొచ్చారని మైనర్స్‌పై దారుణం
కోలకతా: పశ్చిమ బెంగాల్‌లోని ఒక మిషనరీ ఇంగ్లీషు మీడియం స్కూల్లో అమానుషం చోటు చేసుకుంది. పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా లెగ్గింగ్స్ వేసుకున్నారనే సాకుతో మైనర్ బాలికల పట్ల పాఠశాల యాజమాన్యం అవమానకరంగా ప్రవర్తించింది. సోమవారం జరిగిన ఈ ఘటన బాలికల తల్లితండ్రుల ఆందోళనతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..బెంగాల్ బీర్భూమ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన 4-9 సంవత్సరాల వయసున్న బాలికలు లెగ్గింగ్స్ వేసుకొని స్కూలుకు వచ్చారు. దీంతో పాఠశాల డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన టీచర్లు మైనర్ బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఉష్టోగ్రతలు పడిపోయి, చలికి వణికిపోతున్నారన్న కనీస మానవత్వం కూడా లేకుండా..పిల్లలతో బలవంతంగా లెగ్గింగ్స్‌ను తీసి వేయించారు. రోజంతా అలాగే వుండేలా శిక్ష విధించారు. దీనిపై బాలికల తల్లదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరని అవమానకరమైన ఈ చర్య తమ మర్యాదకు భంగకరమని ఆవేదన చెందారు. అభశుభం తెలియని తమ ఆడబిడ్డల పట్ల అమానుషంగా ప్రవర్తించారని మండిపడుతూ శాంతినికేతన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన బిడ్డ లెగ్గింగ్ లేకుండా పాఠశాల నుండి బయటకు రావడం చూసి షాకయ్యాననీ, పాపకు లోదుస్తులు కూడా లేవని బాధిత బాలిక తండ్రి ఒకరు వాపోయారు. ఇది చాలా దారుణమని పేర్కొన్న ఆయన హెడ్మిస్ట్రెస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదును స్వీకరించి, తాము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి అభిషేక్ రాయ్ అన్నారు. పాఠశాల అధికారులు, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నామన్నారు. దీనిపై స్పందించిన యాజమాన్యం విద్యార్థులు డ్రెస్ కోడ్ పాటించాలని ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించామంటూ తమ చర్యను సమర్ధించుకున్నారు. అయినా తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పామనీ, ఇంకా ఎందుకు ఆందోళన చేస్తున్నారో అర్థం కాలేదనీ పాఠశాల హెడ్ మిస్ట్రెస్ అర్చన ఫెర్నాండెజ్ అన్నారు. మరోవైపు ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ అనన్య చక్రవర్తి మాట్లాడుతూ, ఈ సంఘటన దారుణమైందని వ్యాఖ్యానించారు. విచారణ చేపడతామన్నారు. -
పాత రోజుల్లోకి...
ఎల్.బి. శ్రీరామ్ వయసెంత? మనవడు లేదా మనవరాల్ని స్కూల్‌కి పంపేంత! ఈ వయసులో నెరిసిన జుట్టు, మీసాలతో ఆయన స్కూల్ స్టూడెంట్‌లా రెడీ అయ్యి స్కూల్‌కి వెళ్లారు. ఇదేదో సినిమా కోసమో... సీరియల్ కోసమో కాదు. పబ్లిసిటీ స్టంట్ అంతకన్నా కాదు. ఎల్.బి. శ్రీరామ్ చిన్నప్పుడు చదివిన స్కూల్ స్వర్ణోత్సవ వేడుకలు ఇటీవల జరిగాయి. ఆ వేడుకలకు ఈ విధంగా వెళ్లారు ఎల్బీ. ఐదు వేల మంది ఓల్డ్ స్టూడెంట్స్‌లో ఆయనొక్కరే స్కూల్ డ్రస్సు వేసుకు వెళ్లారట. కారులో కాకుండా చిన్నప్పుడు సైకిల్ వేసుకుని స్కూల్‌కి వెళ్లినట్టు, ఇప్పుడు కూడా సైకిల్ మీదే వెళ్లడం విశేషం.