
పాత రోజుల్లోకి...
ఎల్.బి. శ్రీరామ్ వయసెంత? మనవడు లేదా మనవరాల్ని స్కూల్‌కి పంపేంత! ఈ వయసులో నెరిసిన జుట్టు, మీసాలతో ఆయన స్కూల్ స్టూడెంట్‌లా రెడీ అయ్యి స్కూల్‌కి వెళ్లారు.
ఇదేదో సినిమా కోసమో... సీరియల్ కోసమో కాదు. పబ్లిసిటీ స్టంట్ అంతకన్నా కాదు. ఎల్.బి. శ్రీరామ్ చిన్నప్పుడు చదివిన స్కూల్ స్వర్ణోత్సవ వేడుకలు ఇటీవల జరిగాయి. ఆ వేడుకలకు ఈ విధంగా వెళ్లారు ఎల్బీ. ఐదు వేల మంది ఓల్డ్ స్టూడెంట్స్‌లో ఆయనొక్కరే స్కూల్ డ్రస్సు వేసుకు వెళ్లారట. కారులో కాకుండా చిన్నప్పుడు సైకిల్ వేసుకుని స్కూల్‌కి వెళ్లినట్టు, ఇప్పుడు కూడా సైకిల్ మీదే వెళ్లడం విశేషం.