దక్షిణ ఫ్రాన్స్‌లో అదృశ్యమైన మాయా ఖడ్గం
అరిష్టమని అందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు
ప్రపంచంలోకెల్లా అత్యంత పదునైందిగా పేరుగాంచిన కింగ్ ఆర్థర్‌కు చెందిన ఖడ్గం అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. భూమికి 32 అడుగుల పైన పాతిపెట్టిన పౌరాణిక ఖడ్గం చోరీకి గురై ఉంటుందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
ది టెలిగ్రాఫ్ కథనం రోకమడోర్ పట్టణంలో 1,300 ఏళ్లుగా ఎత్తయిన బండరాయిలోకి సగం దిగబడిన విశేషం ఖడ్గం చోరీకి గురైందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఖడ్గం అదృశ్యం కావడం స్థానికుల్లో కలవరం రేపింది. ఎందుకంటే దొంగ దానిని తస్కరించాలంటే కఠినమైన రాతి ఉపరితలంపై 32 అడుగులు ఎక్కవలసి ఉంటుంది. అంత ఎత్తుకు ఎక్కి ఆ ఖడ్గాన్ని దొంగిలించడం ఎలా సాధ్యమైంది అనేది ఇపుడు హాట్ టాపిక్.. శతాబ్దాలుగా రోకామడోర్ పట్టణానికి అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్‌గా నిలుస్తోందని పట్టణ మేయర్ డోమినిక్ లెన్ ఫెంట్ చెప్పారు.
ఈ ఖడ్గం విశేషాలు
స్థానిక స్థల పురాణం ప్రకారం ఆ ఖడ్గానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయి. డురండల్‌గా పిలిచే ఆ ఖడ్గానికి ఫ్రెంచ్ ఎక్స్ క్యాలిబర్ అని కూడా పేరుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పదునైన కత్తి, నాశనంలేనిది. ఒక్క దెబ్బతో రాయిని కూడా చీల్చగల సామర్థ్యం దీని సొంతం.
11వ శతాబ్దానికి చెందిన ది సాంగ్ ఆఫ్ రోలాండ్ అనే పురాణ పద్యం కత్తి అద్భుత లక్షణాలను వివరించింది.ఈ పద్యం తాలూకు కాపీ ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ లోని బోడ్లియన్ లైబ్రరీలో ఉంది.
ది లెజెండ్ ఆఫ్ ఎక్సాలిబర్: పురాణ ఖడ్గం ఎక్సాలిబర్ కింగ్ ఆర్థర్ యాజమాన్యంలోనిది. దీనికి అనేక మాంత్రిక సామర్థ్యాలున్నట్లు ది సన్ రిపోర్ట్ చేసింది.
మధ్యయుగ పురాణం ప్రకారం, 8వ శతాబ్దంలో నాటి రోమన్ చక్రవర్తి రాజు చార్లెమాగ్నే ఒక దేవదూత నుండి డురాండల్‌ను అందుకున్నాడు. దీన్ని తరువాత సైనికాధికారి రోలాండ్ కిచ్చాడు. యుద్ధంలో తన మరణానికి ముందు, రోలాండ్ ఈ ఖడ్గాన్ని శత్రువులు దానిని స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు రాళ్ళపై దానిని పగలగొట్టడానికి ప్రయత్నించినా ఫలించలేదు. చివరకు దాన్ని కాపాడేందుకు గాలిలోకి విసిరాడు. అయితే ఇది అద్భుతంగా వందల కిలోమీటర్లు ప్రయాణించి, రోకామడోర్ రాక్ ఫేస్‌లో దిగబడినట్లు చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment