mystary
-
1300 ఏళ్ల నాటి మేజిక్ ఖడ్గం మాయం : అందోళనలో స్థానికులు
ప్రపంచంలోకెల్లా అత్యంత పదునైందిగా పేరుగాంచిన కింగ్ ఆర్థర్‌కు చెందిన ఖడ్గం అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. భూమికి 32 అడుగుల పైన పాతిపెట్టిన పౌరాణిక ఖడ్గం చోరీకి గురై ఉంటుందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.ది టెలిగ్రాఫ్ కథనం రోకమడోర్ పట్టణంలో 1,300 ఏళ్లుగా ఎత్తయిన బండరాయిలోకి సగం దిగబడిన విశేషం ఖడ్గం చోరీకి గురైందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఖడ్గం అదృశ్యం కావడం స్థానికుల్లో కలవరం రేపింది. ఎందుకంటే దొంగ దానిని తస్కరించాలంటే కఠినమైన రాతి ఉపరితలంపై 32 అడుగులు ఎక్కవలసి ఉంటుంది. అంత ఎత్తుకు ఎక్కి ఆ ఖడ్గాన్ని దొంగిలించడం ఎలా సాధ్యమైంది అనేది ఇపుడు హాట్ టాపిక్.. శతాబ్దాలుగా రోకామడోర్ పట్టణానికి అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్‌గా నిలుస్తోందని పట్టణ మేయర్ డోమినిక్ లెన్ ఫెంట్ చెప్పారు.ఈ ఖడ్గం విశేషాలుస్థానిక స్థల పురాణం ప్రకారం ఆ ఖడ్గానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయి. డురండల్గా పిలిచే ఆ ఖడ్గానికి ఫ్రెంచ్ ఎక్స్ క్యాలిబర్ అని కూడా పేరుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పదునైన కత్తి, నాశనంలేనిది. ఒక్క దెబ్బతో రాయిని కూడా చీల్చగల సామర్థ్యం దీని సొంతం. 11వ శతాబ్దానికి చెందిన ది సాంగ్ ఆఫ్ రోలాండ్ అనే పురాణ పద్యం కత్తి అద్భుత లక్షణాలను వివరించింది.ఈ పద్యం తాలూకు కాపీ ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ లోని బోడ్లియన్ లైబ్రరీలో ఉంది.ది లెజెండ్ ఆఫ్ ఎక్సాలిబర్: పురాణ ఖడ్గం ఎక్సాలిబర్ కింగ్ ఆర్థర్ యాజమాన్యంలోనిది. దీనికి అనేక మాంత్రిక సామర్థ్యాలున్నట్లు ది సన్ రిపోర్ట్ చేసింది.మధ్యయుగ పురాణం ప్రకారం, 8వ శతాబ్దంలో నాటి రోమన్ చక్రవర్తి రాజు చార్లెమాగ్నే ఒక దేవదూత నుండి డురాండల్ను అందుకున్నాడు. దీన్ని తరువాత సైనికాధికారి రోలాండ్ కిచ్చాడు. యుద్ధంలో తన మరణానికి ముందు, రోలాండ్ ఈ ఖడ్గాన్ని శత్రువులు దానిని స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు రాళ్ళపై దానిని పగలగొట్టడానికి ప్రయత్నించినా ఫలించలేదు. చివరకు దాన్ని కాపాడేందుకు గాలిలోకి విసిరాడు. అయితే ఇది అద్భుతంగా వందల కిలోమీటర్లు ప్రయాణించి, రోకామడోర్ రాక్ ఫేస్‌లో దిగబడినట్లు చెబుతారు. -
గాడి తప్పిన దర్యాప్తు !
శ్రీగౌతమి మరణం కేసులో జవాబులేని ప్రశ్నలు ఎన్నో పోలీసుల తీరుపై అనుమానం ఫొటోలు, బిల్లులు మాయం చేశారా? అధికార పార్టీ నేతకు సాగిలపడ్డారా? సాక్షి ప్రతినిధి, ఏలూరు, నరసాపురం : రోడ్డు ప్రమాదంలో మరణించిన నరసాపురం పట్టణానికి చెందిన విద్యార్థిని శ్రీగౌతమిది హత్యా? ఆమెను పథకం ప్రకారమే హత్య చేశారా? ఈ కేసులో తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రమేయం ఉందా? పోలీసులు దర్యాప్తును పక్కదారి పట్టించారా? ప్రమాదం జరిగిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, మృతురాలి చెల్లెలు ప్రత్యక్ష సాక్షి పావని కథనం చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ఈ ఉదంతంలో జవాబులేని ప్రశ్నలెన్నో ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. అసలేం జరిగిందంటే ఈనెల 18న బుధవారం రాత్రి 8.30 గంటలు దాటిన తరువాత పాలకొల్లు రూరల్ పరిధిలోని దిగమర్రు కొత్తోట పంచాయతీ పరిధిలో నరసాపురంపాలకొల్లు రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నరసాపురానికి చెందిన శ్రీగౌతమి మరణించింది. అప్పటి నుంచి ఈ ప్రమాదం వెనుక ఏదో రహస్యం దాగిఉందనే ప్రచారం జరిగింది. పోలీసుల దర్యాప్తు తీరుపై కూడా అనుమానాలకు తావిచ్చింది. ఘటన జరిగి నాలుగు రోజులు దాటినా ఇంత వరకూ పోలీసులు ఈ మిస్టరీని ఛేదించ లేకపోవడం, అంతా గోప్యంగా ఉంచడం ఈ అనుమానాలను బలపరుస్తోంది. అసలు ప్రమాద దర్యాప్తు పూర్తిగా గాడి తప్పిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రి పనిపై పాలకొల్లు వెళ్లిన అక్కా, చెల్లి శ్రీగౌతమి, పావని స్కూటర్‌పై నరసాపురం వస్తుండగా, వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శ్రీగౌతమి అక్కడిక్కడే దుర్మరణం పాలైంది. పావని నరసాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొంది ఆదివారమే డిశ్చార్జి అయ్యింది. తొలుత ఈ ప్రమాదంపై భిన్నకథనాలు వినిపించాయి. మద్యం మత్తులో టీజ్ చేస్తూ, వెంబడించి మరీ కారుతో ఢీకొట్టి చంపేశారనే వార్తలు వచ్చాయి. అయితే కారులో డ్రైవర్‌తోపాటు కొందరు ఉన్నారని , కారు స్కూటర్‌ను ఢీకొట్టిన తర్వాత కాలువలోకి దూసుకెళ్లిందని, కారులో ఉన్నవారు ఈదుకుంటూ అవతలి వైపునకు వెళ్లిపారిపోయారని ప్రచారం జరిగింది. ప్రాథమిక దర్యాప్తు మేరకు కారులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడని పోలీసులు తేల్చడం అనుమానాలను మరింత పెంచింది. జవాబులేని ప్రశ్నలు... ప్రమాదంలో మృత్యువు నుంచి త్రుటిలో బయటపడిన పావని మీడియా ముందు మాట్లాడుతూ తమను కారులో కొందరు వెంబడించాని, కారు స్కూటర్‌ను ఢీకొట్టిన తరువాత తాను కారుపై పడ్డానని, కొంతదూరం ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారని చెప్పింది. దీంతో కారులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడని పోలీసులు దాదాపుగా నిర్ధారణకు రావడం అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదానికి కారణమైన కారు, విశాఖపట్నానికి చెందిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. భీమవరం కిరాయికి వచ్చాడని చెబుతున్నారు. భీమవరం కిరాయికి వచ్చిన వ్యక్తి, నరసాపురం వైపు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనే దానిపై స్పష్టతలేదు. కారులో మిగిలిన వ్యక్తులు ఏమయ్యారనే విషయాన్ని కూడా గాలికొదిలేశారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు ఐతే (కారులో మరికొందరు ఉన్నా.. డ్రైవర్ ఒక్కడే ఉన్నా) యాక్సిడెంట్ చేసి ఏలా పరారయ్యారనేది మరో ప్రశ్న. నిత్యం ప్రమాదం జరిగిన రహదారి రద్దీగా ఉంటుంది. అదీ పండగరోజుల్లో రాత్రి 9 గంటలలోపు ప్రమాదం జరిగింది. ఖచ్చితంగా మద్యం మత్తులో ఉంటే వారిని , జనం పట్టుకోవడం పెద్దకష్టం కాదు. దీనిని బట్టి చూస్తుంటే పథకం ప్రకారం అక్క చెల్లెళ్ళ కదలికలు చూసి వెంబడించి హత్య చేశారా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి కారణమైన కారు వైజాగ్‌కు చెందినది. శ్రీగౌతమి విశాఖపట్నంలోనే సివిల్స్ కోచింగ్ తీసుకుంటుంది. ప్రమాదానికి కారణమైన కారు, ఆప్రాంతానికే చెందినది కావడం యాదృచ్ఛికమేనా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. తమను హత్య చేయాలని చూశారని పావని చేసిన ఆరోపణలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. టీడీపీ నేత కుటుంబ ప్రమేయం! ఈ కేసులో స్థానిక తెలుగుదేశం నాయకుడి భార్యకు సంబంధం ఉందని మృతురాలి చెల్లెలు ఆరోపించడం చర్చనీయాంశమైంది. పావని చెబుతున్నట్లుగా తెలుగుదేశం పార్టీ నేత సజ్జా బుజ్జి శ్రీగౌతమిని పెళ్లి చేసుకున్నాడా లేదా అన్న అంశం పక్కన పెడితే అతని కారణంగానే శ్రీగౌతమి హత్య జరిగిందన్నది స్పష్టంగా కనపడుతోంది. పావని పోలీసులకు ఇచ్చినట్లు చెబుతున్న సజ్జా బుజ్జి, గౌతమిల పెళ్లి ఫొటోలు, ఆస్పత్రి బిల్లులను మాయం చేసి ఈ కేసును పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనలో బుజ్జి ప్రమేయం లేకపోయినా, అతని భార్య వల్ల తాను ఇరుక్కునే అవకాశం ఉండడంతో పైస్థాయిలో పెద్దఎత్తున ఒత్తిళ్లు తెచ్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారం హత్య జరిగిందా? , ఇక్కడివారు వైజాగ్‌కు చెందిన కిరాయి హంతకులను పురమాయించారా? లేక అక్కడివారే హత్య చేశారా? అనే విషయాలను పోలీసులే తేల్చాలి. మరి పోలీసులు ఈ కేసును ప్రమాదంగా చూపించి మూసేస్తారా? లేక హంతకులను గుర్తిస్తారా అన్నది వేచి చూడాలి. -
మిస్టరీగా మారిన విద్యార్థి మరణం
వెతుక్కుంటూ 50 రోజుల తర్వాత వచ్చిన అన్న ఎప్పుడో చనిపోయాడని చెప్పిన పోలీస్ కళాశాల నిర్వాహకులే కారణంటూ ఫిర్యాదు సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని ఓ ప్రై వేట్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న కడప జిల్లాకు చెందిన విద్యార్థి మరణం మిస్టరీగా మారింది. యాభై రోజుల క్రితం ఇంటి నుంచి వచ్చిన వాడు చనిపోయాడని పోలీసులు అతని దుస్తులు చూపించడంతో బయటపడింది. అయితే అతను ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, అతని చావుకు దారితీసిన పరిస్థితులేమిటనే ప్రశ్నలకు సమాధానం లేదు. మతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా సిద్ధిపేట మండలం, మాధవరం గ్రామానికి చెందిన ఎస్పి మనోజ్‌కుమార్‌రెడ్డి విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని సింహాద్రి ఇంజనీరింగ్ కళాశాలలో బి.టెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.గత నెల 1వ తేదీ ఉదయం స్వగ్రామం నుంచి బయలుదేరి 2వ తేదీ మధ్యాహ్నానికి కళాశాలకు చేరుకున్నాడు. రాగానే ఇంటికి ఫోన్ చేసి తాను క్షేమంగా చేరుకున్నానని తల్లికి చెప్పాడు. సాయంత్రం అతని క్లాస్‌మెట్ రాజేష్ వచ్చి పాటలు ఎక్కించుకోవడానికి మొబైల్ ఇవ్వమని అడగడంతో మనోజ్ ఇచ్చాడు. కానీ తర్వాత ఆ మొబైల్ కనిపించలేదు. రాజేష్‌ని అడిగితే మంచం వద్దనే పెట్టానని, ఏ మైందో తెలియది చెప్పాడు. మొబైల్ కోసం కాసేపు అంతటా వెదికిన మనోజ్ రాత్రి 7గంటల సమయంలో తాను బయటకు వెళుతున్నానని వాచ్‌మెన్‌కు చెప్పి వెళ్లాడు. అలా వెళ్లిన మనోజ్ తిరిగి రాలేదు. మరుసటి రోజు కాలేజ్‌కు రాకపోవడంతో మనోజ్ తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం మొబైల్ ద్వారా మెసేజ్ పంపించారు. కానీ వారి ఫోన్ స్విచ్ఆఫ్లో ఉండటంతో దానిని గమనించలేదు. అదే రోజు కళాశాల పక్కనే ఉన్న ఓ నూతిలో యువకుడి మతదేహం లభ్యమైంది. దానిని కళాశాల నిర్వాహకులు చూసి మతుడి ఒంటిపై యూనిఫామ్ లేకపోవడంతో తమ కళాశాల విద్యార్థ్ధికాదని తేల్చారు. దాంతో సబ్బవరం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ కొద్ది రోజులు ఉంచి సంబంధీకులెవరూ రాకపోవడంతో దహనం చేసేశారు. అయితే మృతుడి ఒంటిపై ఉన్న దుస్తులను జాగ్రత్త పరిచారు. మనోజ్ నుంచి ఫోన్ రాకపోవడంతో తల్లడిల్లిన అతని తల్లిదండ్రులు ఏం జరిగిందో చూసిరమ్మని అతని అన్న మల్లేశ్వరరెడ్డికి,కొందరు బంధువులను తోడుగా ఇచ్చి కళాశాలకు పంపించారు. శని,ఆది వారాల్లో కళాశాలకు వెళ్లి మనోజ్ గురించి నిర్వాహకులను ఆరాతీస్తే ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. దీంతో వారు సబ్బవరం పోలీసులను ఆశ్రయించారు. అక్కడ పోలీసులు తాము భద్రపరిచిన దుస్తులు చూపించడంతో అవి మనోజ్‌కు చెందినవేనని అతని అన్న నిర్ధారించాడు. కానీ ఇన్ని రోజులుగా కళాశాలకు ఓ విద్యార్థి రాకపోతే ఇంటికి ఫోన్ చేసి చెప్పాలని యాజమాన్యానికి ఎందుకు అనిపించలేదని మనోజ్ సోదరుడు మల్లేశ్వరరెడ్డి ప్రశ్నిస్తున్నారు. తన తమ్ముడి మరణంపై అనుమానాలున్నాయని, రెండు రోజుల పాటు కళాశాల చుట్టూ తిరిగినా వారు సరైన సమాధానం చెప్పకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోందని, నిజాలు నిగ్గుతేల్చి తమకు న్యాయం చేయాలని సబ్బవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎసై ్స టి.మల్లేశ్వరరావు కేసు నమోదు చేసి, నాలుగైదు రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి ఏం జరిగిందో తేలుస్తామని బాధితులకు చెప్పారు. -
వీడని బాలిక హత్యమిస్టరీ
గోపాల్పేట: బాలిక హత్యకేసు మిస్టరీ వీడడం లేదు. ఘటన జరిగి ఐదు రోజులు గడిచినా పురోగతి లేదు. మండలంలోని తాడిపర్తి శివారులో గతనెల 30న గుర్తు తెలియని బాలిక(14)ను హత్యచేసి, పెట్రోల్‌పోసి తగలబెట్టిన సంఘటనలో నిందితులను గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఇందుకోసం పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. వనపర్తి పాతబజార్ సమీపంలో పోలీసులు ఏర్పాటుచేసిన రెండు సీసీ కెమెరాల పుటేజీలను బుధవారం పరిశీలించారు. అందులో గతనెల 30న తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో బురఖా ధరించినట్లు ఉన్న బాలికను మధ్యలో కూర్చోబెట్టుకుని ఇద్దరు వ్యక్తులు బైకుపై వెళ్లిన దశ్యాలను గుర్తించి నిశితంగా పరిశీలించారు. ఆ సమయంలో చీకటిగా ఉండడంతో గుర్తుపట్టడం కష్టసాధ్యంగా మారింది. అయితే బైకుకు దుస్తులు వేలాడుతున్నట్లు కనిపిస్తుడడంతో అనుమానం రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఐదురోజులు అవుతోంది. శవం నుంచి దుర్వాసన వస్తుంది. ఆచూకీ కోసం బాలిక శవాన్ని వనపర్తి ఏరియా ఆస్పత్రి పోస్టుమార్టం గదిలో ఉంచారు. ఏవైనా వివరాలు లభిస్తాయోనని పోలీసులు వేచి చూస్తున్నారు. దీనిపై ఎస్ఐ సైదులును వివరణ కోరగా..ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదన్నారు. అన్నికోణాల్లో పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గురువారం మృతదేహాన్ని ఖననం చేసే అవకాశం ఉందని చెప్పారు. -
ప్రతీకారంతోనే మట్టుబెట్టారు
వీడిన జంట హత్యల కేసు మిష్టరీ పోలీసుల అదుపులో నిందితులు పాణ్యం: స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఈ నెల 26న జరిగిన జంట హత్యల కేసు మిష్టరీని పోలీసులు ఛేదించారు. కేసులో నిందితులుగా ఉన్న కొలిమిగుండ్ల మండలం బి. ఉప్పులూరుకు చెందిన ఎనిమిది మందిని ఆదివారం అరెస్టు చేశారు. తమ వర్గానికి చెందిన వ్యక్తిని గత ఏడాది హత్య చేసినందుకే వారిని మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకున్నట్లు విచారణలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ వినోద్‌కుమార్, నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. కొలిమిగుండ్ల మండలం బి. ఉప్పలూరుకు చెందిన ధార లక్ష్మయ్య, ధార ఓబులేసు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆదే గ్రామానికి చెందిన కంభం రామసుబ్బయ్య, కుమ్మరి నాగరాజు, కుమ్మరి రవి, కుమ్మరి శివయ్య, పొట్టిపాటి పెద్దరాజు, నార్ల చంద్ర, పొట్టిరాజు గంగరాజు, కంభం మోహన్‌ను నిందితులుగా గుర్తించారు. హతులు ఓబులేసు, లక్ష్మయ్య గత ఎడాది అదే గ్రామానికి చెందిన రామకష్ణయ్యను సెప్టెంబర్‌లో హత్య చేశారు. ప్రతీకారం పెంచుకున్న ప్రత్యర్థులు వారిని మట్టు పెట్టేందకు పన్నాగం పన్నారు. డిసెంబర్లో రూ. 2లక్షలు వసూలు చేసి స్కార్పియో కారు(ఏపీ 31ఎయూ6644)ను కొన్నారు. రామకష్ణయ్య హత్య కేసుకు సంబంధించి గత నెల 26న బనగాన పల్లె కోర్టుకు హాజరైన ఓబులేసు, లక్ష్మయ్య సాయంత్రం గ్రామానికి వెళ్లేందుకు పాణ్యం రైల్వే స్టేషన్ వద్ద ఉండగా వేటకొడవళ్లతో దాడి హతమార్చారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రెండు సెల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో పాణ్యం సీఐ పార్థసారథి రెడ్డి, ఎస్ఐలు మురళీమోహన్రావు, శ్రీనివాసులు, క్రైమ్ సిబ్బంది బాబు, ఆనంద్‌రావు, రాముడు పాల్గొన్నారు.