ప్రతీకారంతోనే మట్టుబెట్టారు
ఆదే గ్రామానికి చెందిన కంభం రామసుబ్బయ్య, కుమ్మరి నాగరాజు, కుమ్మరి రవి, కుమ్మరి శివయ్య, పొట్టిపాటి పెద్దరాజు, నార్ల చంద్ర, పొట్టిరాజు గంగరాజు, కంభం మోహన్‌ను నిందితులుగా గుర్తించారు. హతులు ఓబులేసు, లక్ష్మయ్య గత ఎడాది అదే గ్రామానికి చెందిన రామకష్ణయ్యను సెప్టెంబర్‌లో హత్య చేశారు. ప్రతీకారం పెంచుకున్న ప్రత్యర్థులు వారిని మట్టు పెట్టేందకు పన్నాగం పన్నారు. డిసెంబర్‌లో రూ. 2లక్షలు వసూలు చేసి స్కార్పియో కారు(ఏపీ 31ఎయూ6644)ను కొన్నారు.
రామకష్ణయ్య హత్య కేసుకు సంబంధించి గత నెల 26న బనగాన పల్లె కోర్టుకు హాజరైన ఓబులేసు, లక్ష్మయ్య సాయంత్రం గ్రామానికి వెళ్లేందుకు పాణ్యం రైల్వే స్టేషన్ వద్ద ఉండగా వేటకొడవళ్లతో దాడి హతమార్చారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో పాణ్యం సీఐ పార్థసారథి రెడ్డి, ఎస్‌ఐలు మురళీమోహన్‌రావు, శ్రీనివాసులు, క్రైమ్ సిబ్బంది బాబు, ఆనంద్‌రావు, రాముడు పాల్గొన్నారు.