revange
-
పుంగనూరులో టీడీపీ.. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుని
సాక్షి,చిత్తూరు జిల్లా: ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో మొదలైన టీడీపీ నేతల అరాచకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం కమ్మపల్లిలో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు సుబ్రమణ్యరెడ్డి కుటుంబాన్ని టీడీపీ నేతలు గ్రామం నుంచి వెలివేశారు. ఆయన పండించుకున్న టమాటా పంటను అమ్ముకోకుండా అడ్డుకున్నారు. దీంతో టమాటాలన్నీ కుళ్లిపోయి భారీ నష్టం వాటిల్లింది. కనీసం ఆవులకు మేత వేయకుండా అడ్డుకుని అరాచకం సృష్టిస్తున్నారు. పోలీసులకు చెబితే గ్రామం వదిలి వెళ్లిపోవాలంటున్నారని సుబ్రమణ్యరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. గ్రామంలోకి వస్తే చంపేస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
పుతిన్ కక్ష సాధింపు..! ప్రత్యర్థి భార్యపై వారెంట్
మాస్కో: అయిదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ వేట ఆగలేదు. ప్రత్యర్థులు చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు కొనసాగుతోంది.గతంలో జైలులో వివాదాస్పదంగా మృతి చెందిన అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్ని భార్య యులియా నవల్నయాపై తాజాగా అరెస్టు వారెంట్ జారీ అయింది. తీవ్రవాదసంస్థలో చేరినందుకుగాను వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.యులియాను రెండు నెలలు నిర్బంధంలో ఉంచేందుకు పోలీసులకు అనుమతిచ్చినట్లు మాస్కోలోని బాస్మన్నే కోర్టు వెల్లడించింది. తనపై వారెంట్ జారీ అవడం పట్ల యులియా తీవ్రంగా స్పందించారు. పుతిన్ ఒక హంతకుడు, వార్ క్రిమినల్, జైలులో ఉండాల్సిన వాడని మండిపడ్డారు. యులియాపై అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు ఆమె సిబ్బంది ఎక్స్(ట్విటర్)లో ధృవీకరించారు.యులియా భర్త, పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నవాల్ని ఆర్కిటిక్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈయన మృతిపై అమెరికా సహా పలు దేశాలు స్పందించాయి. నవాల్ని మృతి చెందిన తర్వాత ఆయన పోరాటాన్ని ముందుకు తీసుకువెళతానని భార్య యులియా ప్రతిజ్ఞ చేశారు. -
ముంబయి చిత్తు చిత్తు.. CSK పై రివెంజ్ కు రెడీ
-
రామ్‌చరణ్‌పై రివేంజ్ తీర్చుకున్న ఉపాసన.. వీడియో వైరల్
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చిరంజీవి కోడలిగా, చరణ్‌కు భార్యగానే కాకుండా ఉపాసన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఉపాసన తనకు సంబంధించిన విషయాలతో పాటు ఫ్యామిలీ మూమెంట్స్‌ను షేర్ చేస్తుంటారు. తాజాగా రామ్‌చరణ్‌పై రివేంజ్ తీసుకున్న ఓ వీడియోను ఉపాసన నెట్టింట షేర్ చేసింది. ఇంతకీ ఏమైందంటే.. అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకల సందర్భంగా రామ్‌చరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్‌ల వీడియో ఒకటి అప్పట్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. మొదట ముగ్గురూ ఒకే సోఫాలో కూర్చోగా, కాసేపటికి చరణ్ ఉపాసనని వేరే సీటులోకి వెళ్లి కూర్చొమని సరదాగా చెప్పి ఆటపట్టించాడు. దీనికి రివేంజ్‌గా ఇంటికి వెళ్లాక రామ్‌చరణ్ పరిస్థితి ఇది అంటూ ఓ నెటిజన్ వీడియోను క్రియేట్ చేశాడు. ఇందులో చెట్లకు నీళ్లు పోయడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం ఇలా అన్ని పనులు ఉపాసన చరణ్‌తో చేయిస్తుంది అంటూ ఓ పాత వీడియోను అటాచ్ చేసి ‘ఉపాసన మేడమ్ రివెంజ్’అంటూ ఓ యూజర్ నెట్టింట పోస్ట్ చేయగా, అదికాస్తా ఉపాసన కంట పడింది. ఈ ఫన్నీ వీడియోను ఉపాసన స్వయంగా తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఇప్పుడిది వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Ramcharan_VKG🔵 (@vkg_edits) -
భారత్‌పై రివైంజ్ కోసమే ఆత్మాహుతి దాడి ప్లాన్
భారత్‌లో కీలక నేతపై దాడులు చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది ప్లాన్ చేస్తున్నట్లు రష్యా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రష్యా బలగాల అదుపులో ఉన్న ఐఎస్ ఉగ్రవాది తామెందుకు ఈ ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశామో ఒక వీడియోలో వివరించాడు. ప్రవక్తను అవమానించినందుకు గానూ ప్రతికారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ దాడికి ప్లాన్ చేసినట్లు పేర్కొన్నాడు. అంతేకాదు భారతదేశ పాలక వర్గాలకు చెందిన ప్రతినిధుల్లో ఒకరిపై దాడి చేసేందుకు పథకం రచించినట్లు తెలిపాడు. ఆ ఉగ్రవాది మధ్య ఆసియా ప్రాంతంలోని ఒక దేశానికి చెందిన వ్యక్తిగా రష్యా పేర్కొంది. గత ఏప్రిల్ నుంచి జూన్ వరకు టర్కీలో ఉన్నట్లు వెల్లడించింది. అక్కడ అతన్ని ఐఎస్ నాయకులలో ఒకరు ఆత్మాహుతి బాంబర్‌గా నియమించారని, ఇస్తాంబుల్‌లోని వ్యక్తిగత సమావేశాల్లో అతన్ని రిమోట్‌గా ప్రాసెస్ చేస్తారని తెలిపింది. ఈ మేరకు ఆ ఉగ్రవాదిని రష్యాలో రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) నిషేధించిన ఐఎస్ ఉగ్రవాది సభ్యుడిగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. (చదవండి: భారత్‌లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్.. సూసైడ్ బాంబర్ అరెస్ట్!) -
ఆమె అంగడి బొమ్మ?
నిమేష్ బక్షి (23)అనే యువకుడు ఓ యువతితో ప్రేమాయణం సాగించాడు. కొంతకాలానికి ఇద్దరూ విడిపోయారు. తనతో సన్నిహితంగా ఉన్నపుడు తీసిన ఆమె ఫోటోలను అతడు అశ్లీల వెబ్సైట్లలో పోస్ట్ చేశాడు. బాధితురాలి ఇంట్లో గగ్గోలు చెలరేగింది. నిందితునిపై కేసు నమోదై జైలు శిక్ష పడింది. ఇద్దరూ ప్రైవేటు రంగంలో ఉన్నతోద్యోగులు. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య కొన్నినెలలుగా దూరంగా ఉంటోంది. దీంతో అతనిలోని సైకో నిద్రలేచాడు. ఆమె ఫోటోలను నెట్లో పోస్ట్ చేసి అసభ్య రాతలతో పాటు ఫోన్ నెంబర్ కూడా పెట్టాడు. దీంతో బాధితురాలికి నరకం మొదలైంది. ఆ ఘరానా భర్త కటకటాల పాలయ్యాడు. ఇలాంటి కేసులు ఈ రెండే కాదు... ఎన్నో ఉన్నాయి. అప్పటివరకు సాగిన బంధంలో పొరపొచ్ఛాలు రాగానే కథ మలుపు తిరుగుతుంది. భర్తలు/ ప్రియులు తమ భాగస్వాముల పర్సనల్ ఫోటోలను నెట్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతుంటారు. ఐటీ రంగానికి పేరుపొందిన బెంగళూరులో కొంతకాలంగా ఈ ఇలాంటి పెడధోరణలు ప్రబలుతున్నాయి. బొమ్మనహళ్లి: టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నదో, నేరాలు కూడా అంతే వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో అశ్లీల ప్రతీకారం (రివెంజ్ పోర్న్) కేసుల సంఖ్య పెరుగుతుండడం పోలీసులను కలవరపెడుతోంది. విడాకులు తీసుకున్న భార్యలు, ప్రేమ వికటించి దూరమైన ప్రియురాళ్లు వీటి బారిన పడి మానసిక క్షోభకు గురవుతున్నారు. కొందరూ ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. ఇటీవల నగరానికి చెందిన ఓ వ్యక్తి తన మాజీ భార్య చిత్రాన్ని మార్ఫింగ్ చేసి ఒక అశ్లీల వెబ్సైట్లో పెట్టాడు. ఆమె ఫోన్‌కు పదపదే అపరిచితులు ఫోన్లు చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఖాకీలు మాజీ భర్తను కటకటాల వెనక్కు పంపారు. మాజీ ప్రియురాళ్లకు సంబంధించి అశ్లీల చిత్రాలను ఇలా పోస్ట్ చేయడం లాంటి సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయని పోలీసులు చెబుతున్నారు. సొంత కుటుంబం లేదా సమాజం నుంచి చీత్కారాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో చాలా మంది యువతులు లేదా మహిళలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. సిలికాన్ సిటీలో ఇలాంటి కేసులు ప్రతి నెలా పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. అది మానసిక రుగ్మతే అశ్లీల చిత్రాలను పోర్న్ సైట్లలో పెట్టడం మానసిక వికృతత్వంలో ఒక భాగమని మానసిక నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక పురోగతి.... గిట్టనివారి పరువు తీయడాన్ని సులభతరం చేసిందని సీనియర్ వైద్య నిపుణుడు డాక్టర్ రోషన్ జైన్ తెలిపారు. వదంతులు, అబద్ధాలు, శృంగార చిత్రాలను విశ్వవ్యాప్తం చేయడం కూడా ఇప్పుడు చాలా తేలికగా మారిందని పేర్కొన్నారు. దీని వల్ల బాధితులు తీవ్ర మానసిక అస్వస్థతకు లోనవుతారని, ఈ చిత్రాలతో కుటుంబంలో రేకెత్తే గొడవల వల్ల కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పురుషులకు సంబంధించి బాల్యంలో లేదా పెద్దయ్యాక ఉండే మానసిక రుగ్మతలు కొందరిని ఇలా పెడదారి పట్టిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. తక్షణం పోలీసులను సంప్రదించాలి ఇలాంటి ఉచ్చులో చిక్కుకున్న మహిళలు ఏ మాత్రం సంకోచించకుండా వెంటనే తమను సంప్రదించాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. పోలీసుల దగ్గరకు వెళితే తమ పరువు పోతుందనో మరే ఇతర భయాల వల్లనో అనేకమంది బాధిత మహిళలు తమకు ఫిర్యాదు చేయడానికి జంకుతుంటారని పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో పోలీసులు పూర్తి గోప్యతను పాటిస్తారని, మహిళలు భయపడాల్సిన అవసరం లేదని నగర పోలీసు కమిషనర్ టీ. సునీల్ కుమార్ తెలిపారు. బాధిత మహిళలు ఫిర్యాదు చేయకపోతే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులు మరితంగా చెలరేగిపోతారని, చట్టమంటే కూడా భయం లేకుండా తమ పని సాగిస్తూనే ఉంటారని ఆయన హెచ్చరించారు.– సునీల్‌కుమార్, పోలీస్ కమిషనర్ దొరికిపోతారు జాగ్రత్త చెత్త పోస్ట్‌లు పెట్టేవారు దొరక్కుండా పోరు. ఆన్లైన్లో రివెంజ్ పోర్న్‌లను పోస్ట్ చేసే వారిని, వారి కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ ఐపీ అడ్రస్ ద్వారా పోలీసులు పట్టుకోగలుగుతున్నారు. తమను ఎవరూ ఏమీ చేయలేరని ఇలాంటి పనులు చేసిన ఎంతోమంది విద్యావంతులు, యువత జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుని మగ్గిపోతున్నారు. ఇలాంటి నేరాల్లో కనిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. -
ప్రతీకారం తీర్చుకుంటాం
న్యూఢిల్లీ/చండీగఢ్: పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఆదివారం నాటి పాక్ కాల్పుల్లో నలుగురు సైనికులు చనిపోయినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆర్మీ సోమవారం స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ మాట్లాడుతూ ‘పాక్ కాల్పులకు సైన్యం తగిన రీతిన సమాధానమిస్తూ వస్తోంది. ఇది ఇకపై కూడా కొనసాగుతుంది. అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేసి చూపిస్తాం’ అని అన్నారు. పాక్ కాల్పుల్లో కెప్టెన్ కపిల్ కుందు (22)తోపాటు మరో ముగ్గురు జవాన్లు మరణించడం తెలిసిందే. పాక్ మూర్ఖపు చర్యకు భారత్ తిరిగి సమాధానమిస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ కూడా అన్నారు. సాహసాలంటే ఇష్టం: పాక్ కాల్పుల్లో ఆదివారం అమరుడైన కెప్టెన్ కపిల్ కుందు (22) భౌతిక కాయానికి ఢిల్లీలోని పాలం వైమానిక స్థావరంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ నివాళులర్పించారు. అనంతరం భౌతిక కాయాన్ని కుందు స్వగ్రామమైన గుర్గావ్ సమీపంలోని పటౌడీకి తరలించారు. కుందు మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఫిబ్రవరి 10న పుట్టినరోజు సందర్భంగా ఇంటికి వస్తానని కుందు తమకు చెప్పాడనీ, ఇంతలోనే ఘోరం జరిగిందని ఆయన తల్లి సునీత, సోదరిలు విలపిస్తున్నారు. కుందు స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి భారత దళాలు ప్రతీకారం తీర్చుకోవాలంటూ స్థానికులు నినాదాలు చేశారు. కుందుకు సాహసాలతో కూడిన జీవితమంటే ఇష్టమనీ, అందుకే ఆర్మీలో చేరాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తనకు మరో కొడుకు ఉంటే అతణ్నీ ఆర్మీకి పంపి ఉండేదాన్ననీ, కుందు సైన్యంలో చేరిన తర్వాత చాలా సంతోషంగా ఉండేవాడని సునీత చెప్పారు. తన కొడుకు ఎప్పుడూ దేశం కోసమే బతికాడన్నారు. -
ప్రతీకారంతోనే మట్టుబెట్టారు
వీడిన జంట హత్యల కేసు మిష్టరీ పోలీసుల అదుపులో నిందితులు పాణ్యం: స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఈ నెల 26న జరిగిన జంట హత్యల కేసు మిష్టరీని పోలీసులు ఛేదించారు. కేసులో నిందితులుగా ఉన్న కొలిమిగుండ్ల మండలం బి. ఉప్పులూరుకు చెందిన ఎనిమిది మందిని ఆదివారం అరెస్టు చేశారు. తమ వర్గానికి చెందిన వ్యక్తిని గత ఏడాది హత్య చేసినందుకే వారిని మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకున్నట్లు విచారణలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ వినోద్‌కుమార్, నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. కొలిమిగుండ్ల మండలం బి. ఉప్పలూరుకు చెందిన ధార లక్ష్మయ్య, ధార ఓబులేసు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆదే గ్రామానికి చెందిన కంభం రామసుబ్బయ్య, కుమ్మరి నాగరాజు, కుమ్మరి రవి, కుమ్మరి శివయ్య, పొట్టిపాటి పెద్దరాజు, నార్ల చంద్ర, పొట్టిరాజు గంగరాజు, కంభం మోహన్‌ను నిందితులుగా గుర్తించారు. హతులు ఓబులేసు, లక్ష్మయ్య గత ఎడాది అదే గ్రామానికి చెందిన రామకష్ణయ్యను సెప్టెంబర్‌లో హత్య చేశారు. ప్రతీకారం పెంచుకున్న ప్రత్యర్థులు వారిని మట్టు పెట్టేందకు పన్నాగం పన్నారు. డిసెంబర్లో రూ. 2లక్షలు వసూలు చేసి స్కార్పియో కారు(ఏపీ 31ఎయూ6644)ను కొన్నారు. రామకష్ణయ్య హత్య కేసుకు సంబంధించి గత నెల 26న బనగాన పల్లె కోర్టుకు హాజరైన ఓబులేసు, లక్ష్మయ్య సాయంత్రం గ్రామానికి వెళ్లేందుకు పాణ్యం రైల్వే స్టేషన్ వద్ద ఉండగా వేటకొడవళ్లతో దాడి హతమార్చారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రెండు సెల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో పాణ్యం సీఐ పార్థసారథి రెడ్డి, ఎస్ఐలు మురళీమోహన్రావు, శ్రీనివాసులు, క్రైమ్ సిబ్బంది బాబు, ఆనంద్‌రావు, రాముడు పాల్గొన్నారు. -
'సీఐపై ప్రతీకారం తీర్చుకునే వరకు వదిలిపెట్టను'
పాలకుర్తి(వరంగల్): తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై విచక్షణా రహితంగా దాడి చేసిన సీఐ తిరుపతిపై ప్రతీకారం తీర్చుకునే వరకు వదలి పెట్టేది లేదని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాలకుర్తి నియోజక వర్గ కేంద్రంలో గత నెల 27న టీడీపీ కార్యాలయంపై దాడి చేశారన్నారు. విచక్షణా రహితంగా కార్యకర్తలపై లాఠీ చార్జి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేసిన సీఐ తిరుపతిపై హైకోర్టులో కేసు వేయడంతో పాటు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పాలకుర్తిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీకి వత్తాసు పలికిన సీఐ ప్రతి పక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసి ప్రభుత్వ మెప్పు పొందాలని చూశారన్నారు. అధికార దుర్వినియోగనికి పాల్పడిన సీఐ తిరుపతిపై చర్యలు తీసుకునే వరకు చట్ట పరంగా పోరాడుతామని అన్నారు. -
ఆటోవాలాపై అమెరికన్ లేడీ ప్రతీకారం
హైదరాబాద్: అవసరం లేనప్పుడు ఐదారుసార్లు ఎదురుపడే ఆటోవాలాలు.. అర్జెంట్‌గా వెళ్లాలనుకున్నప్పుడు మాత్రం కనిపిస్తే ఒట్టు! ఒక వేళ కనిపించినా సవాలక్ష కండిషన్లు. నోటికొచ్చినంత డిమాండ్ చేస్తారు. మీటర్ వేయమంటే కుదరదంటారు. సిటీలో మీ ప్రయాణం మా చెప్పు- చేత (హ్యాండిల్, బ్రేక్) ల్లో ఉందని బిల్డప్ ఇస్తారు. అసలేం చేస్తే ఈ ఆటోవాలాలు మనం చెప్పేది వింటారు? వాళ్లు అడిగినంత ఇచ్చేసి అయినా తాము వెళ్లాల్సిన చోటుకి వెళతారు కొందరు. అయితే ఈ సమస్యకు బాగా ఆలోచించి సరికొత్త పంథాను కనిపెట్టింది ఓ అమెరికన్ లేడీ. హైదరాబాద్‌కు చిరపరిచితురాలైన ఆమె..మాటవినని ఓ ఆటోవాలాతో సాగించిన వెరైటీ బేరసారాల వీడియో ప్రస్తుతం సోషల్ వెబ్‌సైట్స్‌లో హల్చల్ చేస్తోంది. జార్జిటౌన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సి. క్రిస్టీన్ ఫెయిర్.. దక్షిణ ఆసియా భాషలు, సాంస్కృతిక మార్పులు, తదితర అంశాలపై పరిశోధనలు చేస్తోంది. ఆ క్రమంలోనే 1997 నుంచి ఎన్నోసార్లు హైదరాబాద్‌కు వచ్చి వెళ్లింది. ఉర్దూ హిందీ మిక్స్ చేసినట్లుండే హైదరాబాదీ లాంగ్వేజ్ ఆమెకు కొట్టినపిండి. మూడురోజుల కిందట ఆమె బసచేసిన హోటల్ నుంచి బయటికొచ్చి ఓ ఆటోను కేకేసింది.. చార్మినార్‌కు వెళ్లాలని పిలిచింది ఫారినర్ కాబట్టి జేబు నిండిందన్న సంతోషంతో దగ్గరికెళ్లాడు ఆటోవాలా. 'మీటర్ మీద చార్మినార్‌కు వెళదాం' అని క్రిస్టీన్.. 'అలా కుదరదు అడిగినంత ఇస్తేనే వస్తాను' అని ఆటోవాలా వాదులాడుకున్నారు. కొద్దిసేపటి తర్వాత క్రిస్టీన్‌కు చిర్రెత్తుకొచ్చింది. అమాంతం ఆటోలో కూలబడి మొబైల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి.. ఆటోవాలా తీరును వివరిస్తూ వీడియో తీసింది. 'అవసరమైతే రోజంతా ఖాళీగా ఉంటాను కానీ మీటర్ మాత్రం వేయను' అనే ఆటోవాడి మాటల్ని రిపీట్ చేసింది. మధ్యమధ్యలో బాలీవుడ్ సాంగ్స్‌ను హమ్ చేసింది. 'ఈ గోలేంట్రా బాబూ..' అని తలబాదుకుంటూనే చివరికి క్రిస్టినా చెప్పినట్లే మీటర్ రేటుకే ఆమెను చార్మినార్ లో దిగబెట్టేందుకు ఓకే అన్నాడు ఆటోవాలా. మీరు కూడా ఈ టెక్నీక్ ఫాలో అయ్యి.. సరసమైన ధరకు ఆటోప్రయాణం చేయాలనుకుంటే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఆవిడంటే ఫారినర్ కాబట్టి ఆటోలో అంత రచ్చ చేసినా పోనీలే అని అనుకున్నాడు మన ఆటోవాలా. అదే లోకల్ వాళ్లైతే ఎలా బదులిస్తాడో నగరవాసులకు కొత్తగా చెప్పేదేమీ ఉండదనుకుంటా!!