
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చిరంజీవి కోడలిగా, చరణ్‌కు భార్యగానే కాకుండా ఉపాసన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఉపాసన తనకు సంబంధించిన విషయాలతో పాటు ఫ్యామిలీ మూమెంట్స్‌ను షేర్ చేస్తుంటారు. తాజాగా రామ్‌చరణ్‌పై రివేంజ్ తీసుకున్న ఓ వీడియోను ఉపాసన నెట్టింట షేర్ చేసింది.
ఇంతకీ ఏమైందంటే.. అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకల సందర్భంగా రామ్‌చరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్‌ల వీడియో ఒకటి అప్పట్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. మొదట ముగ్గురూ ఒకే సోఫాలో కూర్చోగా, కాసేపటికి చరణ్ ఉపాసనని వేరే సీటులోకి వెళ్లి కూర్చొమని సరదాగా చెప్పి ఆటపట్టించాడు. దీనికి రివేంజ్‌గా ఇంటికి వెళ్లాక రామ్‌చరణ్ పరిస్థితి ఇది అంటూ ఓ నెటిజన్ వీడియోను క్రియేట్ చేశాడు.
ఇందులో చెట్లకు నీళ్లు పోయడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం ఇలా అన్ని పనులు ఉపాసన చరణ్‌తో చేయిస్తుంది అంటూ ఓ పాత వీడియోను అటాచ్ చేసి ‘ఉపాసన మేడమ్ రివెంజ్’అంటూ ఓ యూజర్ నెట్టింట పోస్ట్ చేయగా, అదికాస్తా ఉపాసన కంట పడింది. ఈ ఫన్నీ వీడియోను ఉపాసన స్వయంగా తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో ఇప్పుడిది వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment