
సాక్షి,చిత్తూరు జిల్లా: ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో మొదలైన టీడీపీ నేతల అరాచకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం కమ్మపల్లిలో వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుడు సుబ్రమణ్యరెడ్డి కుటుంబాన్ని టీడీపీ నేతలు గ్రామం నుంచి వెలివేశారు.
ఆయన పండించుకున్న టమాటా పంటను అమ్ముకోకుండా అడ్డుకున్నారు. దీంతో టమాటాలన్నీ కుళ్లిపోయి భారీ నష్టం వాటిల్లింది. కనీసం ఆవులకు మేత వేయకుండా అడ్డుకుని అరాచకం సృష్టిస్తున్నారు.
పోలీసులకు చెబితే గ్రామం వదిలి వెళ్లిపోవాలంటున్నారని సుబ్రమణ్యరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. గ్రామంలోకి వస్తే చంపేస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Comments
Please login to add a commentAdd a comment