'సీఐపై ప్రతీకారం తీర్చుకునే వరకు వదిలిపెట్టను' | we will take revange on ci says erraballi dayakar rao | Sakshi
Sakshi News home page

'సీఐపై ప్రతీకారం తీర్చుకునే వరకు వదిలిపెట్టను'

Published Tue, Oct 13 2015 7:09 PM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

'సీఐపై ప్రతీకారం తీర్చుకునే వరకు వదిలిపెట్టను' - Sakshi

'సీఐపై ప్రతీకారం తీర్చుకునే వరకు వదిలిపెట్టను'

పాలకుర్తి(వరంగల్): తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై విచక్షణా రహితంగా దాడి చేసిన సీఐ తిరుపతిపై ప్రతీకారం తీర్చుకునే వరకు వదలి పెట్టేది లేదని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాలకుర్తి నియోజక వర్గ కేంద్రంలో గత నెల 27న టీడీపీ కార్యాలయంపై దాడి చేశారన్నారు. విచక్షణా రహితంగా కార్యకర్తలపై లాఠీ చార్జి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేసిన సీఐ తిరుపతిపై హైకోర్టులో కేసు వేయడంతో పాటు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.


పాలకుర్తిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీకి వత్తాసు పలికిన సీఐ ప్రతి పక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసి ప్రభుత్వ మెప్పు పొందాలని చూశారన్నారు. అధికార దుర్వినియోగనికి పాల్పడిన సీఐ తిరుపతిపై చర్యలు తీసుకునే వరకు చట్ట పరంగా పోరాడుతామని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement