
ఫోన్ ఇస్తారా.. చావమంటారా?
న్యూయార్క్: ఐఫోన్ కోసం గతంలో ఒక వ్యక్తి తన కిడ్నీలను అమ్ముకుంటే ఇంకొందరు దొంగతనం చేసేందుకు కూడా వెనుకాడలేదు. తాజాగా న్యూయార్క్‌లో 'సూ చియెన్' (30) అనే వ్యక్తి యాపిల్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌కు వెళ్లి హంగామా సృష్టించాడు. ఇలాంటి ఘటనే 'న్యూయార్క్ యాపిల్ స్టోర్'లో చోటు చేసుకుంది. తనకు ఎలాగైనా ఐఫోన్ కావాలని, లేదంటే చనిపోతానని మెడపై కత్తి పెట్టుకుని బెదిరించడం కలకలం రేపింది.
దాదాపు 2 అడుగుల పొడవుతో, వంకర్లు తిరిగి చూసేందుకే భయంకరంగా ఉన్న పదునైన కత్తితో స్టోర్‌లో ప్రవేశించి తనకు ఎలాగైనా ఐఫోన్ ఇవ్వాలని బెదిరించాడు. దీంతో అక్కడున్న ఇతర వినియోగదారులు భయపడి అటూ ఇటూ పరుగులు పెట్టారు. ఇంతలో అలర్టయిన స్టోర్ సెక్యూరిటీ సిబ్బంది ఎవరికీ గాయాలు కాకుండా ఆ వ్యక్తికి, ఇతర వినియోగదారులకు మధ్య ఒక కంచెను ఏర్పాటుచేశారు. అయినా అతడు ఎక్కడా తగ్గలేదు. మరింత అలజడి సృష్టించాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అతికష్టం మీద సూ చియెన్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ వ్యవహారన్నంతా అక్కడే ఉన్న ఒక వ్యక్తి తన ఫోన్‌లో వీడియో తీసి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
Man armed with a sword arrested at #applestore #nyc #breakingnews pic.twitter.com/qljjB1d5L5
— Boris (@borisrio) November 20, 2015