వేసే అడుగులు, కరిగిన కేలరీలను లెక్కపెట్టేందుకు ఇప్పటికే బోలెడన్ని ఫిట్‌నెస్ ట్రాకర్లు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థ ఆపిల్ ఇంకో అడుగు ముందుకేసి ఈ ఫిట్‌నెస్ బ్యాండ్‌ల ద్వారానే రక్తపోటును కూడా కచ్చితంగా గుర్తించేందుకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రక్తపోటు సమస్య ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. అయితే చాలామంది ఈ సమస్యను గుర్తించరు. ఈ నేపథ్యంలో కొన్ని హైటెక్ సెన్సర్లు, కడియం ఆకారంలోని గాడ్జెట్‌తో రక్తపోటును ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ఆపిల్ కంపెనీ ఓ పరికరాన్ని తయారుచేస్తోంది. ఈ పరికరం అప్పుడప్పుడూ బెలూన్ మాదిరిగా ఉబ్బుతుందని అంచనా.
పేటెంట్ కోసం చేసిన దరఖాస్తులో ఆపిల్ కంపెనీ ఈ పరికరం గురించి వివరిస్తూ... చేసే పనిని బట్టి రక్తపోటు మారుతూంటుందని, కొలిచేటప్పుడు బాడీ పొజిషన్, మద్యం లేదా కాఫీ లాంటి ద్రవపదార్థాలు తీసుకుని ఉండటం, ఒత్తిడి వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ వివరణ ఆధారంగా ఆపిల్ రక్తపోటును గుర్తించే గాడ్జెట్‌ను తయారు చేస్తోందని, ఇతర ఆపిల్ పరికరాలతో అనుసంధానమై ఎప్పటికప్పుడు వివరాలు అందించేలా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆపిల్ కంపెనీ 2004లోనే తన హెల్త్ కిట్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత క్రమేపీ ఆరోగ్య సంబంధిత యాప్‌లు అభివృద్ధి చేస్తోంది.
రక్తపోటును గుర్తించే ఆపిల్ కడియం!
Published Wed, Jun 13 2018 12:26 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment