detects
-
రొమ్ము కేన్సర్‌ను ఐదేళ్లముందే ఏఐ పసిగట్టేస్తుంది
మహిళల్లో ప్రమాదకరంగా వ్యాపిస్తున్న కేన్సర్లలో రొమ్ము కేన్సర్ ఒకటి. కేన్సర్లను ముందుగా గుర్తించడం చాలా అవసరం. వ్యాధి బాగా ముదిరిన తరువాత గుర్తించడం వల్ల మరణాల రేటు బాగా పెరుగుతోంది. అయితే ఆధునిక టెక్నాలజీ సాయంతో రొమ్ము కేన్సర్‌ను ఐదేళ్ల ముందే గుర్తించవచ్చని తేలింది. అధునాతన సాంకేతికత చికిత్స ఫలితం.. రోగ నిరూపణకి, కొత్త ఔషధాల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తోంది.యుఎస్‌లోని డ్యూక్ విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం మామోగ్రామ్‌ల సాయంతో ఐదేళ్ల ముందే రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని అంచనా వేయడానికి కొత్త, అర్థమయ్యే కృత్రిమ మేధస్సు నమూనాను అభివృద్ధి చేసింది. రేడియాలజీ జర్నల్‌లో ప్రచురించిన మరొక అధ్యయనం ప్రకారం రొమ్ము కేన్సర్ ముప్పును ఐదు సంవత్సరాల ముందే ప్రమాదాన్ని అంచనా వేjడంలో ఏఐ అల్గారిథమ్‌లు ప్రామాణిక క్లినికల్ రిస్క్ మోడల్‌ను అధిగమించాయని తెలిపింది.బయాప్సీ, మైక్రోస్కోప్‌ల క్రింద హిస్టోలాజికల్ పరీక్షలు, ఎంఆర్ఐ, సీటీ, పెట్ స్కాన్ల వంటి ఇమేజింగ్ పరీక్షలు కేన్సర్‌ని నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్షలు. వీటిని ఏఐ సిస్టమ్‌లు మరింత లోతుగా, అద్భుతమైన ఖచ్చితత్వంతో విశ్లేషించగలవు. ఫలితంగా సాధారణ పరీక్షల్లో కనిపించ కుండా పోయిన సూక్ష్మకణాలను ఏఐ ముందస్తుగా గుర్తించగలదు. ఇది చికిత్స ఫలితాలను పెంచి, రోగులను రక్షించడంలో వైద్యులకు మార్గం సుగమం చేసి, ముందస్తు మరణాలను నివారించగలదని భావిస్తున్నారు. తాజా పరిశోధన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సంతోషం వ్యక్తం చేశారు. మనం ‘‘మేము ఊహించిన దానికంటే కృత్రిమ మేధస్సు ఎంతోవిలువైందని వ్యాఖ్యానించారు. -
మహీంద్రా ఫైనాన్స్‌లో రూ. 150 కోట్ల మోసం
న్యూఢిల్లీ: ఆర్థిక సేవల సంస్థ మహీంద్రా ఫైనాన్స్ రుణాల పోర్ట్‌ఫోలియోలో దాదాపు రూ. 150 కోట్ల మోసం బైటపడింది. ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక శాఖలో ఇది చోటుచేసుకున్నట్లుగా గుర్తించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నాలుగో త్రైమాసికం, పూర్తి సంవత్సర ఆర్థిక ఫలితాల వెల్లడిని మే 30కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. బోర్డు సమావేశాన్ని కూడా అదే రోజునకు రీ–షెడ్యూల్ చేసినట్లు వివరించింది. రిటైల్ వాహన రుణాల మంజూరులో కేవైసీ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేయడం ద్వారా నిధులను పక్కదారి పట్టించారని గుర్తించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. దీనిపై ప్రస్తుతం విచారణ తుది దశలో ఉన్నట్లు వివరించింది. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని, కొందరు వ్యక్తులను అరెస్టు చేయడం సహా చర్యల అమలు వివిధ దశల్లో ఉందని మహీంద్రా ఫైనాన్స్ పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో మంగళవారం 5 శాతం పైగా క్షీణించి రూ. 263.60 వద్ద క్లోజయ్యింది. -
ఫోన్ కెమెరా ఫ్లాష్‌తో కొడుకుని కాపాడుకున్న తల్లి!
ఓ మహిళ ముక్కు పచ్చలారని మూడు నెలల శిశువుని ఫోన్ కెమెరా ఫ్లాష్‌తో ఫోటో తీసింది. ఏమైందో ఏమో ఏదో అర్థం కానిమెరుపు శిశువు కంటిలో కనపించింది. ఏంటిదీ అని ఆశ్చర్యపోయింది. లాభం లేదనుకుని పలు రకాలుగా ఫోటోలు తీసి ప్రయత్నించింది. అయితే ఏదో తెల్లటి వెలుగులా కనిపిస్తుంది ఫోటోలా. చెప్పాలంటే పిల్లి కన్ను మాదిరిగా ఉంది. ఏం చేయాలో తోచక గూగుల్‌లో సర్చ్ చేసింది. ఏదో తెలియన ఆందోళనతో వైద్యులను కూడా కలిసింది. అప్పుడే పిడుగలాంటి ఈ విషయం విని హుతాశురాలయ్యింది ఆ తల్లి. ఏమయ్యిందంటే.. లండన్‌లోని ఓ మహిళ తన ఫోన్లోని కెమెరాలోని ఫ్లాష్‌ని ఉపయోగించి తన మూడు నెలల బిడ్డను పోటోలు తీసింది. ఆ ఫోటోల్లో బిడ్డ కంటిలో ఏదో మెరుపు కనిపించేది. ఏంటిదీ అని ఆమె వేర్వేరు వెలుగుల్లో ఉంచి పలు రకాలుగా పోటోలు తీసిన అలాంటి వెలుగు కనిపించేది. అది పిల్లి కన్నులా ప్రతిబింబించేది.ఇదేంటన్నది అర్థం గాక గూగుల్ సెర్చ్‌లో వెదికింది. తీరా అక్కడ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చన్న సంకేతాలు చూపింది. దీంతో ఆందోళనకు గురయ్యిన ఆమె వెంటనే మెడ్వే ఆస్పత్రిని సంప్రదించింది. అక్కడ వైద్యులు ఆ శిశువు పలు వైద్య పరీక్షల చేసి..ఆ చిన్నారి అరుదైన కంటి కేన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. దీంతో హుతాశురాలైన ఆమె తన బిడ్డ థామస్‌ను రాయల్ లండన్ ఆసుపత్రికి తరలించి తక్షణమే చికిత్స అందించింది. అతను నవంబర్ 2022 నుంచి ఆరు రౌండ్ల కీమోథెరపీని చేయించుకున్నాడు. చివరికి సెప్సిస్‌తో పోరాడిన తదనంతరం మరో చివరి రౌండ్ కీమోథెరపీని ఏప్రిల్ 2023లో ముగించాడు. మేలో క్యాన్సర్ రహితంమని ప్రకటించడంతో ఆ తల్లి ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. కంటి కేన్సర్ అంటే.. నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం, రెటినోబ్లాస్టోమా అనేది అరుదైన కంటి క్యాన్సర్. ఇది చిన్న పిల్లలను ప్రభావితం చేసే వ్యాధి. ఎక్కువగా మూడేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ఒకటి లేదా రెండు కళ్లలో ఉండొచ్చు లేదా కంటి వెనుక భాగాన్ని (రెటీనా) ప్రభావితం చేస్తుంది. రెటినోబ్లాస్టోమా సాధారణ సంకేతమే ఈ తెల్లటి మెరుపు. ఇది కొన్ని లైట్లలో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి ఇది మెల్లకన్ను, కంటి రూపాన్ని మార్చడం లేదా వాపు వంటి లక్షణాలను కూడా చూపిస్తుంది. వీటిలో ఏదో ఒక లక్షణం మాత్రం కచ్చితంగా ఉంటుంది. దాన్ని గమనించి త్వరితగతిన వైద్యులను సంప్రదిస్తే చూపు కోల్పోయే ప్రమాదం ఉండదు. (చదవండి: 50 నిమిషాల పాటు చనిపోయాడు..ఏకంగా 17 సార్లు షాక్, అంతా అయిపోయిందనేలోపు..) -
చూపు లేదు కాని క్యాన్సర్‌ని గుర్తిస్తారు!
స్త్రీలలో బ్రెస్ట్ కేన్సర్ ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. రేడియేషన్‌తో కూడిన మామోగ్రఫీ కన్నా స్పర్శతో బ్రెస్ట్ కేన్సర్‌ను గుర్తించడాన్ని ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ అంటారు. స్పర్శ మీద ఎక్కువగా ఆధారపడ్డ అంధ మహిళలకు ఒక ఉపాధిగా. స్పర్శతో కేన్సర్‌ను గుర్తించడంలో శిక్షణ ఇస్తున్నారు. ఢిల్లీలో ఇప్పటికే 18 మంది అంధ మహిళలు ఈ శిక్షణ పొందారు. ఇతర అంధ మహిళలను ఈ రంగంలోకి ఆహ్వానిస్తున్నారు. స్త్రీలు పరస్పరం మేలు పొందే ఈ విశేష కార్యక్రమాన్ని ‘లైఫ్ సేవింగ్ హ్యాండ్స్’ అంటున్నారు. న్యూఢిల్లీకి చెందిన 31 ఏళ్ల మీనాక్షి గుప్తా ప్రతి ఉదయం మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు అందరూ ఆమెను సాధారణ అంధురాలు అనుకుంటారు. కాని తాను పనిచేసే హాస్పిటల్‌కు ఆమె చేరుకున్నాక ఆ అంధురాలిలోని అసామాన్య నైపుణ్యం తెలిసి ఆశ్చర్యపోతారు. ఆమె ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ నిపుణురాలు. ఇలాంటి నిపుణులను ‘మెడికల్ టెక్టయిల్ ఎగ్జామినర్’ (ఎం.టి.ఇ) అంటారు. వీరు చేతి స్పర్శతో స్త్రీల వక్షోజాలలో వచ్చిన అతి చిన్న లంప్స్‌ను కూడా గుర్తించి కేన్సర్ బారిన పడకుండా కాపాడుతారు. బ్రెస్ట్ కేన్సర్‌ను స్త్రీలు ఎవరికి వారు స్పర్శ ద్వారా చెక్ చేసుకుంటూ లంప్స్‌ను గుర్తించవచ్చు. కాని అందరూ సరిగ్గా గుర్తించలేరు. చిన్న లంప్స్‌ను అసలు గుర్తించలేరు. కాని ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ నిపుణులు మాత్రం అతి చిన్న లంప్స్‌ను కూడా గుర్తించడంలో శిక్షణ పొందుతారు. అంధ మహిళలే ఎందుకు? ‘టెక్టయిల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్’ను జర్మనీకి చెందిన గైనకాలజిస్ట్ ఫ్రేన్ హాఫ్‌మేన్ కనుగొన్నాడు. బ్రెస్ట్ కేన్సర్‌ను గుర్తించే మామోగ్రఫీలో రేడియేషన్ ఉంటుంది. ఖర్చు కూడా. కాని చేతులతో గుర్తించడంలో ఎటువంటి రేడియేషన్ ఉండదు. ఖర్చు కూడా ఉండదు. అందుకే చేతి స్పర్శ ద్వారా ఎలా బ్రెస్ట్ కేన్సర్‌ను గుర్తించవచ్చో అతను కొన్ని పద్ధతులను ప్రతిపాదించాడు. ఇందులో శిక్షణకు అంధ మహిళలను ఎంచుకున్నాడు. ఎందుకంటే చూపు లేకపోవడం వల్ల అంధులు స్పర్శ మీద ఎక్కువగా ఆధారపడతారు. వారు తమ స్పర్శతో కచ్చితంగా లంప్స్‌ను గుర్తించగలరని ఊహించాడు. అతని ఊహ నిజమైంది. అంధ మహిళల స్క్రీనింగ్‌లో కేవలం 1 శాతం మాత్రమే తప్పు అంచనా వచ్చి మిగిలిన 99 శాతం నిర్థారిత అంచనా వచ్చింది. దాంతో అతను ఒక సేవాకార్యక్రమంగా ‘లైఫ్ సేవింగ్ హ్యాండ్స్’ పేరుతో ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, కొలంబియా, మెక్సికో, ఇండియాలలోని ఆయా ప్రభుత్వ అంధుల పర్యవేక్షణ సంస్థలను కోరారు. మన దేశంలో 2017 నుంచి ఈ శిక్షణ జరుగుతోంది. ఇప్పటికి 18 మంది ఎం.టి.ఇలు శిక్షణ పొందారు. మరో 8 మంది ఇప్పుడు శిక్షణ పొందుతున్నారు. 9 నెలల శిక్షణ ఢిల్లీలోని ‘బ్లైండ్ ఇండియా సెంటర్ ఫర్ బ్లైండ్ విమెన్ అండ్ డిజేబిలిటీ స్టడీస్’ (ఎన్.ఏ.బి.సి.బి.డబ్లు్య)లో మెడికల్ టెక్టయిల్ ఎగ్జామినర్ (ఎం.టి.ఇ)లుగా శిక్షణను ఇస్తున్నారు. అంధ మహిళలు, చూపు లోపం పాక్షికంగా ఉన్నవారు ఈ శిక్షణను పొందవచ్చు. 9 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఆరు నెలలు సెంటర్లో, మూడు నెలలు ఆస్పత్రిలో పని చేయాలి. ఈ ట్రయినింగ్లో ఇంగ్లిష్, కంప్యూటర్ను ఆపరేట్ చేయడం, మానవ శరీర నిర్మాణంలో ప్రాథమిక అవగాహన తదితరాలు నేర్పిస్తారు. ‘అంధులు బ్రెస్ట్ కేన్సర్‌ను స్పర్శతో ఎలా గుర్తించగలరా అని ముందు సందేహించాను. కాని జర్మనీకి వెళ్లి చూశాక మన దేశంలో అంధ మహిళలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’ అన్నారు బ్లైండ్ ఇండియా సెంటర్ డైరెక్టర్ షాలినీ ఖన్నా. క్యాంపులలో సేవలు బ్లైండ్ ఇండియా సెంటర్ తరచూ బ్రెస్ట్ కేన్సర్ అవేర్నెస్ క్యాంపులను నిర్వహిస్తోంది. ఈ క్యాంపుల్లో ఎం.టి.ఇలు తమ స్పర్శతో స్క్రీనింగ్ సేవలు అందిస్తున్నారు. ‘4 మిల్లీమీటర్ల చిన్న లంప్‌ను కూడా ఎం.టి.ఇలు గుర్తిస్తున్నారు’ అని క్యాంప్ నిర్వాహకులు తెలియచేస్తున్నారు. వీరి నిర్థారణ తప్పడం లేదు కనుక అంధ మహిళలు ఈ శిక్షణ తీసుకుని ఈ సేవలను కొనసాగిస్తూ ఉపాధి పొందాలని బ్లైండ్ ఇండియా సెంటర్ తెలియచేసింది. (చదవండి: వెన్నునొప్పే కదా! అని తేలిగ్గా తీసుకోకండి! ఆ వ్యాధికి సంకేతం కావోచ్చు) -
శభాష్.. పోలీస్.. 30నిమిషాల వ్యవధిలోనే
మంచిర్యాలక్రైం: 100డైల్ కాల్స్ ఫిర్యాదుతో స్పందించిన బ్లూ కోల్ట్స్ పోలీసులు వెంటనే స్పందించి 30నిమిషాల వ్యవధిలో తప్పిపోయిన బాలున్ని కుటుంబ సభ్యులకు అప్పగించి శభాష్ బ్లూ కోల్ట్స్ అనిపించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... జన్నారం మండలం గంగవ్వకు చెందిన బంధువులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని చూసేందుకు గంగవ్వ తన 7సంవత్సరాల కుమారుడితో కలిసి మంగళవారం ఆసుపత్రికి వచ్చింది. గంగవ్వ ఆసుపత్రిలో బంధువులతో మాట్లాడుతుండగా బాలుడు అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. ఖంగు తిన్న గంగవ్వ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి స్థానికుల సలహాలు, సూచనల మేరకు 100డైల్కు ఫోన్ చేసి చెప్పడంతో క్షణంలోనే స్పందించిన సీఐ నారాయణ్‌నాయక్ బ్లూ కోల్ట్స్ పోలీసులను అప్రమత్తం చేసి గాలించారు. రంగంలోకి దిగిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఉస్మాన్పాష, తిరుపతి ఐబీ ప్రాంతం నుంచి ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పరిశీలించగా ఐబీ వైపు నుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వైపు ఏడుస్తూ వెళ్తున్న బాలున్ని గమనించి, అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలున్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో బ్లూ కోల్ట్స్ సిబ్బందిని స్థానికులు, అధికారులు అభినందించారు. -
కరోనాను గుర్తించే పనిలో తేనెటీగలు
సాక్షి,న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పెను సంక్షోభాన్ని సృష్టించింది. కరోనా అంతానికి గ్లోబల్‌గా పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికి కచ్చితమైన పరిష్కారం లభించలేదు. ముఖ్యంగా వైరస్‌ను గుర్తించేందుకే ఎక్కువ సమయం పడుతోంది. దీంతో తొందరగా కరోనాను గుర్తించే పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నెదర్లాండ్స్ పరిశోధకులు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ లక్షణాలను పసిగట్టేలా తేనెటీగలకు శిక్షణనిస్తున్నారు. తేనెటీగలకు వాసన పసిగట్టే అసాధారణ గుణం ఉందని, అదే తమ రీసెర్చ్‌కు దోహదపడుతుందని చెబుతున్నారు. కరోనా నిర్దారణ పరీక్షలకు గంటలు లేదా రోజులు పట్టవచ్చు, కాని తేనెటీగల నుండి ప్రతిస్పందన వెంటనే ఉంటుంది. ఈ పద్ధతి చౌకగా కూడా ఉంటుంది. కోవిడ్ టెస్ట్ ఫలితాలకోసం వేచి ఉండే సమయం తగ్గనుందని భావిస్తున్నారు. అంతేకాదు పరీక్షలు కొరత ఉన్న దేశాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు. (కరోనా విలయం: డీఆర్డీవో డ్రగ్‌కు గ్రీన్ సిగ్నల్) నెదర్లాండ్స్ యూనివర్సిటీలో బయో వెటర్నరీ ల్యాబ్‌లో తెనేటీగల సామర్ధ్యంపై పరిశోధనలు చేస్తున్నారు. మొదట కోవిడ్ ఇన్ఫెక్షన్ శాంపిళ్లను వాసన వీటికి చూపుతారు. పువ్వుల్లో మకరందాన్నే ఆఘ్రాణించే రీతిలోనే ఇవి స్ట్రా లాంటి నాలుకలతో వాటి వాసన పీల్చుతాయని ఈ ప్రాజెక్టులో పాల్గొన్న వైరాలజీ ప్రొఫెసర్ విమ్ వాన్ డెర్ పోయెల్ చెప్పారు. ఆ తరువాత ‘రివార్డు’గా చక్కర కలిపిన నీటిని వీటికి ఇస్తామన్నారు. అయితే ఇన్ఫెక్షన్ సోకని శాంపిల్ ని చూపితే వీటికి ఈ రివార్డు ఉండదని తెలిపారు. కోవిడ్ నమూనాలను చూపినప్పుడు మాత్రం దీన్ని స్వీకరించేందుకు ఇష్టపడట. చక్కెర నీటిని తీసుకున్న తేనెటీగలు, ఈ నమూనాల శాంపిళ్లను అందించినపుడు నాలుకలను చాచవని చెప్పారు. తేనెటీగలను సేకరించేవారి నుంచి తాము వీటిని తీసుకువచ్చి ప్రత్యేక హార్నెసెస్ వంటి వాటిలో ఉంచుతామన్నారు. ఇలా వీటి వల్ల కోవిడ్ ఫలితాలను త్వరగా గుర్తించవచ్చునన్నారు. వీటి రెస్పాన్స్ తక్షణమే ఉంటుందన్నారు. ఇది చౌక అయిన పధ్దతి అని, టెస్టులు తక్కువగా జరిగే దేశాల్లో ఇది ప్రయోగాజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. (కళ్లు తెరవండి! లేదంటే 10 లక్షల మరణాలు: లాన్సెట్ హెచ్చరిక) అయితే దీనివల్ల పెద్దగా ఫలితం ఉండదని ఘెంట్ విశ్వవిద్యాలయంలో తేనెటీగలు, కీటకాలు, జంతు రోగనిరోధక శాస్త్రాన్ని అధ్యయనం చేసే ప్రొఫెసర్ డిర్క్ డీ గ్రాఫ్ తెలిపారు. సమీప భవిష్యత్తులో ఇలాంటివి పనికి రావని, కరోనా నిర్దారణ పరీక్షల కంటే కూడా ఇతర పనులకోసం వాటిని వినియోగించుకుంటానని వెల్లడించారు. క్లాసిక్ డయాగ్నస్టిక్ పరికరాలనే కోవిడ్ టెస్టులకు వినియోగించుకోవడం మంచిదన్నారు. 1990 ప్రాంతాల్లో అమెరికాలోని రక్షణ విభాగం ‘‘ఇన్సెక్ట్ స్నిఫింగ్" అనే సాంకేతికతను వాడిందని, పేలుడు పదార్థాలను, విషపదార్థాలను గుర్తించడానికి తేనెటీగలు, కందిరీగలను వినియోగించుకుందని ఆయన పేర్కొన్నారు. (కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే!) -
రక్తపోటును గుర్తించే ఆపిల్ కడియం!
వేసే అడుగులు, కరిగిన కేలరీలను లెక్కపెట్టేందుకు ఇప్పటికే బోలెడన్ని ఫిట్నెస్ ట్రాకర్లు అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థ ఆపిల్ ఇంకో అడుగు ముందుకేసి ఈ ఫిట్నెస్ బ్యాండ్ల ద్వారానే రక్తపోటును కూడా కచ్చితంగా గుర్తించేందుకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రక్తపోటు సమస్య ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. అయితే చాలామంది ఈ సమస్యను గుర్తించరు. ఈ నేపథ్యంలో కొన్ని హైటెక్ సెన్సర్లు, కడియం ఆకారంలోని గాడ్జెట్‌తో రక్తపోటును ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ఆపిల్ కంపెనీ ఓ పరికరాన్ని తయారుచేస్తోంది. ఈ పరికరం అప్పుడప్పుడూ బెలూన్ మాదిరిగా ఉబ్బుతుందని అంచనా. పేటెంట్ కోసం చేసిన దరఖాస్తులో ఆపిల్ కంపెనీ ఈ పరికరం గురించి వివరిస్తూ... చేసే పనిని బట్టి రక్తపోటు మారుతూంటుందని, కొలిచేటప్పుడు బాడీ పొజిషన్, మద్యం లేదా కాఫీ లాంటి ద్రవపదార్థాలు తీసుకుని ఉండటం, ఒత్తిడి వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ వివరణ ఆధారంగా ఆపిల్ రక్తపోటును గుర్తించే గాడ్జెట్‌ను తయారు చేస్తోందని, ఇతర ఆపిల్ పరికరాలతో అనుసంధానమై ఎప్పటికప్పుడు వివరాలు అందించేలా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆపిల్ కంపెనీ 2004లోనే తన హెల్త్ కిట్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత క్రమేపీ ఆరోగ్య సంబంధిత యాప్‌లు అభివృద్ధి చేస్తోంది. -
స్ట్రోక్‌ను గుర్తించే కొత్త పరీక్ష..!
వైద్యరంగంలో రక్త పరీక్షలు కీలకపాత్ర పోషిస్తాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, సీజనల్ వ్యాధుల లాంటి ఏ చిన్న సమస్య వచ్చినా ఆస్పత్రికి వెళ్తే ముందుగా రక్త పరీక్షలు చేయించడం.. వ్యాధి నిర్ధారణ చేయడం మనకు తెలుసు. అయితే ప్రాణాంతకమైన బ్రెయిన్ స్ట్రోక్ లాంటి పెద్ద సమస్య అయినా ఇప్పుడు కేవలం కొన్ని చుక్కల రక్తంతో తెలుసుకోవచ్చంటున్నారు సైంటిస్టులు. పది నిమిషాల్లో స్ట్రోక్‌ను గుర్తించే 'గేమ్ ఛేంజర్' గా ఈ కొత్త టెస్టును చెబుతున్నారు. సమస్యను త్వరగా గుర్తించగలిగితే అపాయం నుంచి ప్రాణాన్ని రక్షించడం సులభం అవుతుంది. అందుకే చవకైన, సులభంగా వ్యాధిని గుర్తించేందుకు కనిపెట్టిన ఈ కొత్త బ్లడ్ టెస్టును పరిశోధకులు 2018 లో అందుబాటులోకి తేనున్నారు. ఈ టెస్టులో ఎంజైమ్స్ పూత కలిగిన ప్లేట్లు.. స్ట్రోక్ తర్వాత రక్తంలో పెరిగే రసాయనాలను గుర్తించేందుకు ఉపయోగపడతాయని, త్వరితగతిన వైద్యం అందించగలిగితే వైకల్యాలు దరి చేరకుండా రోగులు దీర్ఘకాలం స్వతంత్రంగా బతికే అవకాశం ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు. బిగ్గెస్ట్ కిల్లర్ గా చెప్పే బ్రెయిన్ స్ట్రోక్... బ్రిటన్‌లో తీవ్రమైన వైకల్యాలకు ప్రధాన కారణమౌతోంది. దాదాపు 1.50 లక్షల మంది స్త్రీ, పురుషులు.. కండరాల బలహీనత, పెరాలసిస్ వంటి వ్యాధులతో జీవిస్తున్నారు. మెదడులో ఏర్పడే క్లాట్స్ వల్ల కలిగే స్ట్రోక్‌కు 3-4 గంటల్లోపు చికిత్స అందించగలిగితే నష్టాన్ని పరిమితం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు మెదడులో రక్తస్రావాన్ని బట్టి స్ట్రోక్ ఎలాంటిదో గుర్తిస్తారు. అయితే ఆస్పత్రిలో స్కాన్ చేయకుండా మాత్రం చికిత్స అందించడం సాధ్యం కాదని, వ్యాధిని గుర్తించకుండా మందు వాడటం ఒక్కోసారి ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంటుందని, అందుకే ఆ తేడాలను కీలకంగా గుర్తించి వైద్యం అందించాల్సి వస్తుందని పరిశోధకులు అంటున్నారు. అమెరికా కార్నెల్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ కొత్తరకం టెస్టును కనుగొన్నారు. అంబులెన్సులో కూడా ఈ టెస్టు చేసే అవకాశం ఉండటంతో ఖర్చు తగ్గడంతో పాటు, విలువైన సమయాన్ని ఆదా చేయచ్చంటున్నారు. గతంలోనూ బ్రెయిన్ స్ట్రోక్‌ను గుర్తించే రక్తపరీక్షలు ఉన్నా, అవి గంటల కొద్దీ సమయం తీసుకోవడంతో విస్తృతంగా వినియోగంలో లేవు. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి రానున్న ఈ టెస్టు.. ఆధునిక టెక్నాలజీని వినియోగించడంతో కేవలం 10 నిమిషాల్లోనే ఫలితాలు ఇస్తుందని, కొన్ని చుక్కల రక్తంతోనే సాధ్యమౌతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరీక్షతో ప్రస్తుతం మెదడు ఏదైనా కారణాల వల్ల డ్యామేజ్ అయిందా? ఇతర అనారోగ్య కారణాలున్నాయా అన్న విషయాలను కూడా తెలుసుకోవచ్చంటున్నారు. ఈ రక్త పరీక్ష 2018లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, దీంతో ఎన్నో జీవితాలను రక్షించవచ్చని పరిశోధనలో పాల్గొన్న అలెక్స్ ట్రావిస్ చెబుతున్నారు. స్ట్రోక్‌తో బాధపడే రోగుల్లో మూడు వంతుల మంది ఇషెమిక్ స్ట్రోక్‌తో (మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్) బాధపడుతున్నారని పరిశోధనకు నేతృత్వం వహించిన రాయ్ కోహెన్ అంటున్నారు. సరైన సమయంలో వైద్యం అందించడం వల్ల మెదడుకు నష్టం తగ్గుతుందని, అత్యవసర చికిత్ప అందించే అవకాశం ఉంటుందని స్ట్రోక్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ షామిమ్ క్వాడ్రిక్ అంటున్నారు. ఈ కొత్త రక్తపరీక్షతో స్ట్రోక్ ను తెలుసుకోవడమే కాక.. డిమెన్షియా, క్యాన్సర్ల గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.