మహిళల్లో ప్రమాదకరంగా వ్యాపిస్తున్న కేన్సర్లలో రొమ్ము కేన్సర్ ఒకటి. కేన్సర్లను ముందుగా గుర్తించడం చాలా అవసరం. వ్యాధి బాగా ముదిరిన తరువాత గుర్తించడం వల్ల మరణాల రేటు బాగా పెరుగుతోంది. అయితే ఆధునిక టెక్నాలజీ సాయంతో రొమ్ము కేన్సర్‌ను ఐదేళ్ల ముందే గుర్తించవచ్చని తేలింది. అధునాతన సాంకేతికత చికిత్స ఫలితం.. రోగ నిరూపణకి, కొత్త ఔషధాల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తోంది.
యుఎస్‌లోని డ్యూక్ విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం మామోగ్రామ్‌ల సాయంతో ఐదేళ్ల ముందే రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని అంచనా వేయడానికి కొత్త, అర్థమయ్యే కృత్రిమ మేధస్సు నమూనాను అభివృద్ధి చేసింది. రేడియాలజీ జర్నల్‌లో ప్రచురించిన మరొక అధ్యయనం ప్రకారం రొమ్ము కేన్సర్ ముప్పును ఐదు సంవత్సరాల ముందే ప్రమాదాన్ని అంచనా వేjడంలో ఏఐ అల్గారిథమ్‌లు ప్రామాణిక క్లినికల్ రిస్క్ మోడల్‌ను అధిగమించాయని తెలిపింది.
బయాప్సీ, మైక్రోస్కోప్‌ల క్రింద హిస్టోలాజికల్ పరీక్షలు, ఎంఆర్‌ఐ, సీటీ, పెట్ స్కాన్‌ల వంటి ఇమేజింగ్ పరీక్షలు కేన్సర్‌ని నిర్ధారించడానికి ఉపయోగించే పరీక్షలు. వీటిని ఏఐ సిస్టమ్‌లు మరింత లోతుగా, అద్భుతమైన ఖచ్చితత్వంతో విశ్లేషించగలవు. ఫలితంగా సాధారణ పరీక్షల్లో కనిపించ కుండా పోయిన సూక్ష్మకణాలను ఏఐ ముందస్తుగా గుర్తించగలదు. ఇది చికిత్స ఫలితాలను పెంచి, రోగులను రక్షించడంలో వైద్యులకు మార్గం సుగమం చేసి, ముందస్తు మరణాలను నివారించగలదని భావిస్తున్నారు. తాజా పరిశోధన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సంతోషం వ్యక్తం చేశారు. మనం ‘‘మేము ఊహించిన దానికంటే కృత్రిమ మేధస్సు ఎంతోవిలువైందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment