మానవ పరిణామక్రమం లాగే మనిషి వయసుకు సంబంధించిన రూప పరిణామక్రమం కూడా ఆసక్తికరమే. అయిదు సంవత్సరాల వయసు ఉన్న బాలిక 95 ఏళ్ల వృద్ధురాలు అయ్యేక్రమంలో ఎన్ని రూపాల్లో కనిపిస్తుందో చూపే ఈ వీడియో వైరల్ అవుతోంది. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఈ హైపర్ రియలిస్టిక్ ఏఐ జనరేటెడ్ వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తే 1.8 లక్షల వ్యూస్ వచ్చాయి.
బోలెడు లైక్‌లు వచ్చాయి. ‘మా అమ్మ వయసు 72 సంవత్సరాలు. ఆమె పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు దిగిన ఫొటో మా ఇంట్లో ఉంది. ఆ ఫొటోను, అమ్మను చూసినప్పుడల్లా ఈ ఇద్దరూ నిజంగా ఒకరేనా? లేకపోతే వయసు ఆధారంగా కొత్త వ్యక్తులు ఆ వ్యక్తిలోకి వస్తుంటారా!’ అనే ధర్మసందేహాన్ని వెలిబుచ్చాడు ఒక నెటిజనుడు. ఈ సందేహం మాట ఎలా ఉన్నా ‘ఈ హైపర్ రియాలిటీ ఏఐ టెక్నాలజీతో 95 ఏళ్ల వయసులో నేను ఎలా ఉంటానో చూసుకోవాలని ఉంది’ అని సందడి చేస్తున్న నెటిజనుల సంఖ్యే ఎక్కువ.
5 టు 95
Published Sun, Apr 30 2023 4:27 AM | Last Updated on Sun, Apr 30 2023 4:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment