
వర్కౌట్స్ చేయడం ఎన్నో ప్రయోజనాలు అందించినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవారు వర్కవుట్స్ చేయకపోవడమే మంచిది. వారెవరో తెలుసుకుందాం.
ఎముకలు, కండరాల సమస్యలు...
లిగమెంట్స్ సమస్యలు, బెణుకులు, కీళ్ల గాయలు, ఎముకల పగుళ్ల వంటి సమస్యలు ఉన్నవారు వర్కౌట్ చేయడం వల్ల మరింత నష్టమవుతుంది కాబట్టి, ఈ సమస్యలున్నవారు పూర్తిగా కోలుకున్న తర్వాతే వర్కవుట్స్ చేయాలి. అదే విధంగా వళ్లునొప్పులు ఎక్కువగా ఉన్నా వర్కవుట్స్ చేయకూడదు.
సర్జరీలు...
కొన్నిసార్లు సర్జరీలు జరుగుతాయి. వీటి తర్వాత శరీరం కోలుకోవడానికి కొద్దిగా సమయ పడుతుంది. సర్జరీలు అయిన వెంటనే వర్కౌట్స్ చేస్తే ఇంటర్నల్ బ్లీడింగ్ కావొచ్చు. ఇతర సమస్యలు కూడా వస్తాయి. అదేవిధంగా స్త్రీలు సిజేరియన్ వంటి ఆపరేషన్ తర్వాత కోలుకునే వరకూ వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలతోనే సరిపెట్టుకోవాలి.
గుండె సమస్యలు...
అరిథ్మియా, గుండె సమస్యలు, హై బ్లడ్ ప్రెజర్, హార్ట్ ఫెయిల్యూర్, గుండె సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా వర్కౌట్స్ చేయొద్దు. కష్టమైన వర్కౌట్స్ అసలే వద్దు. ఎక్కువ ఎఫెక్టివ్‌గా ఉండే వర్కౌట్స్ గుండెపై ప్రెజర్‌ని పెంచుతాయి. దీని వల్ల ఛాతీ నొప్పి, హార్ట్ బీట్‌లో తేడా వచ్చి ఏకంగా గుండె ఆగిపోయే ప్రమాదమే ఉంది కాబట్టి, వర్కౌట్స్ చేసే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
ఇన్ఫెక్షన్, ఫీవర్‌తో బాధపడేటప్పుడు...
మీరు ఏదైనా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నప్పుడు, ముఖ్యంగా జ్వరంతో ఉన్నప్పుడు ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. అలాంటి సమయంలో వర్కౌట్స్ చేయడం వల్ల డీహైడ్రేట్ అవుతారు. హార్ట్ బీట్ పెరుగుతుంది. కండరాల బలహీనత, అలసట పెరుగుతుంది. అంతేకాకుండా గాయాలు అవుతాయి. అందుకే, జ్వరం తగ్గేవరకూ వర్కౌట్స్ జోలికి పోకపోడమే మంచిది.
చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో