
సమ్మర్ ముదరగానే చెమటలు పడుతుండటంతో దేహం ద్రవాలను కోల్పోయి, చాలామందిలో మజిల్ క్రాంప్స్ రావడం పెరుగుతుంది. అకస్మాత్తుగా నిద్రలో గానీ, కొందరిలో పగటివేళలోనే పిక్కలు, తొడకండరాలు, ఛాతీ కండరాలు పట్టేస్తుంటాయి. కంటినిండా నిద్ర లేకపోవడం, ఆహారంలో కొన్ని అవసరమైన పోషకాలు లోపించడం, దేహానికి అలసటతో కలిగే నిస్సత్తువతోపాటు కొన్ని రకాల మందులు వాడకంతోనూ కొందరిలో మజిల్ క్రాంప్స్ కనిపించవచ్చు.
కండరాల అలసట వల్ల, అలాగే వ్యాయామానికి ముందు తగినంతగా స్ట్రెచ్ ఎక్సర్‌సైజులు చేయకపోవడం, రక్తంలో ఎలక్ట్రోలైట్స్ పరిమాణం తగ్గిపోవడం కూడా కారణాలవుతాయి. ఈ సమస్యకు తక్షణ పరిష్కారంగా తాజాగా తయారు చేసుకున్న మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసుకుని తాగడం, చక్కెర లేకుండా పండ్లరసాలు, ద్రవాహారాలు తీసుకోవచ్చు.
అన్ని పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకుంటూ ఉండటంతోపాటు, కంటినిండా నిద్రపోవడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు. వ్యాయామానికి ముందు చేసే వార్మప్ కూడా ఈ సమస్య నివారణకు బాగానే తోడ్పడుతుంది.
(చదవండి: