aware
-
వేలానికి రాహుల్ ప్రపంచకప్ బ్యాట్
న్యూఢిల్లీ: భారత్‌లో నిరాదరణకు గురైన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు భారత క్రికెటర్ లోకేశ్ రాహుల్ ముందుకొచ్చాడు. పిల్లల చదువు కోసం తనకు సంబంధించిన వస్తువులను వేలం వేయనున్నాడు. ఇందులో 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను ఉపయోగించిన బ్యాట్‌తో పాటు జెర్సీలు, ప్యాడ్స్, గ్లౌజులు, హెల్మెట్స్ ఉంచనున్నట్లు రాహుల్ వీడియో మెసేజ్ ద్వారా ట్విట్టర్లో ప్రకటించాడు. ఈ వేలం ద్వారా సమకూరే మొత్తాన్ని చిన్నారుల సంక్షేమం కోసం కృషిచేస్తోన్న అవేర్ ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్లు తెలిపాడు. ‘నేను నా క్రికెట్ వస్తువులను టీమిండియా మద్దతు బృందం ‘భారత్ ఆర్మీ’కి విరాళంగా ఇస్తాను. ఇందులో ప్రపంచకప్‌లో వాడిన బ్యాట్‌తో పాటు టెస్టు, వన్డే, టి20 జెర్సీలు, గ్లౌజులు, ప్యాడ్లు, హెల్మెట్లు ఉన్నాయి. వారు వీటిని వేలం ద్వారా విక్రయిస్తారు. వేలంలో సమకూరిన సొమ్మును వెనుకబడిన చిన్నారులను ఆదరిస్తోన్న ‘అవేర్’ ఫౌండేషన్‌కు అందజేస్తారు. సోమవారం నుంచి వేలం ప్రారంభమవుతుంది. అందరూ ఇందులో పాల్గొని చిన్నారులకు సహాయపడండి’ అని రాహుల్ పేర్కొన్నాడు. -
జనరిక్ మందుల వినియోగంపై అవగాహన కల్పించండి
అనంతపురం అర్బన్ : జిల్లాలో జనరిక్ మందుల వినియోగంపై ప్రజల్లో విస్తృతస్థాయి అవగాహన కల్పించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ సమావేశం నిర్వహించి, అధికారుల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పని చేయాలన్నారు. ఆహార పదార్థాల కల్తీ, తూనికలు - కొలతల్లో మోసాలు, గడువు దాటిన మందుల విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల వ్యవధిలో కిరాణా, జనరల్, వస్త్ర దుకాణాలు తదితర వాటిపై దాడులు నిర్వహించి, 35 కేసులు నమోదు చేసి, రూ.65 వేలు అపరాధ రుసుం వసూలు చేశామని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. ఆహార కల్తీ నిరోధక శాఖ జిల్లా అధికారులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 17 ఆహార నమూనాలు సేకరించి, పరీక్ష నిమిత్తం ప్రయోగశాలకు పంపామన్నారు. జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మాట్లాడుతూ వారం రోజుల వ్యవధిలో 24 మెడికల్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు మాట్లాడుతూ పుట్లూరు మండలం గోపరాజుపల్లి చౌక దుకాణంలో బియ్యం, కిరోసిన్, చక్కెర నిలువను తనిఖీ చేశామన్నారు. అవకతవకలు ఉండంతో రూ.6,949 విలువజేసే సరుకు స్వాధీనం చేసుకున్నామన్నారు. పౌర సరఫరాల అధికారుల పని తీరుపై జాయింట్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో డీఎస్ఓ శివశంకర్‌రెడ్డి, తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ వై.జి.శంకర్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పి.ఎల్లమ్మ, ఎం.రవిశంకర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ సంధ్య పాల్గొన్నారు. దీపం గ్రౌండింగ్ వేగవంతం చేయండి : దీపం పథకం కింద కనెక్షన్ల మంజూరు వేగవంతం చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. నగదురహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. మీ –సేవ అర్జీలు సత్వరం పరిష్కరించాలన్నారు. -
సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి
కట్టంగూర్ ః వర్షాకాలంలో మూగజీవాలకు, పశువులకు వ్యాపించే వ్యాధుల పట్ల గొర్ల కాపరులు, రైతులు అవగాహన కలిగి ఉండాలని పశుసంవర్థక శాఖ జేడీ నర్సింహులు సూచించారు. గురువారం మండలంలోని ఈదులూరు, కట్టంగూర్ గ్రామాల్లో గొర్రెల మందలను ఆయన పరిశీలించారు. ఈదులూరు గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సీజన్లో గొర్రెలకు మూతివాపు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందన్నారు. గొర్రెలకు వ్యాధులు సంక్రమిస్తే వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి శైలజ, సిబ్బంది సంజయ్ పాల్గొన్నారు. -
ప్రజలను చైతన్యపరుస్తాం
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం – మూడోరోజుకు చేరిన పాదయాత్ర ఊట్కూర్ : నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్టు సాధించేందుకుగాను పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరుస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. జలసాధన సమితి ఆధ్వర్యంలో మూడోరోజు ఆదివారం ఊట్కూర్ మండలంలోని బిజ్వార్ నుంచి పాదయాత్ర కొనసాగింది. పాతపల్లి, అవుసలోనిపల్లి, పెద్దజట్రం, నిడుగుర్తిలో ప్రజలు, రైతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుతోనే మూడు నియోజకవర్గాలలోని పది మండలాల్లో సుమారు లక్ష ఎకరాలకు సాగు, తాగునీరు అందుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ నారాయణపేట డివిజన్ నుంచి వలసలు ఆగాలంటే ఈ ప్రాజెక్టు తప్పక చేపట్టాలన్నారు. దీనిని ప్రస్తుత ప్రభుత్వం పక్కనబెట్టి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరందిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 69 జీఓను ఫేజ్–1గా, 72 జీఓను ఫేజ్–2గా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, గరిడి నింగిరెడ్డి; కాంగ్రెస్ నాయకుడు సరాఫ్ కష్ణ, సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి కష్ణ, వివిధ పార్టీల నాయకులు గందే చంద్రకాంత్, సలీం, మాధవరెడ్డి, తిమ్మారెడ్డి, శేషప్ప, సత్యనారాయణరెడ్డి, అమ్మకోళ్ల శ్రీనివాస్, సాయిలుగౌడ్, హన్మంతు, నారాయణరెడ్డి, రాంరెడ్డి, సమరసింహారెడ్డి, యజ్ఞేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డ్రైవర్లకు అవగాహన సదస్సు నేడు
పాత శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఆదివారం స్థానిక చిలకపాలెం టోల్ గేట్ వద్ద ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లకు ఒకరోజు సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా మో టార్ ట్రాన్స్‌పోర్టు ఓనర్స్ జాయిం ట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎం.జానకీరామ్ రెడ్డి శనివారం ఓ ప్రకటన లో తెలిపారు. కార్యక్రమానికి ము ఖ్య అతిథులుగా జిల్లా రవాణాశాఖాధికారి సీహెచ్ శ్రీదేవి, శ్రీకాకు ళం డీఎస్పీ కె.భార్గవనాయుడు, జేఆర్‌పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వై. రామకృష్ణ, ఎచ్చెర్ల తహశీల్దార్ బి. వెంకటేశ్వరరావు, ఎస్ఐ సందీప్‌కుమార్‌లు హాజరు కానున్నారని వా రు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా లో గల ట్రాన్స్‌పోర్టు డైవర్లు అం దరూ హాజరు కావాలని కోరారు. -
భార్యలను ఇలా కొట్టాలంటూ సంచలన వీడియో
సౌదీ అరేబియా: ఆన్లైన్ లో ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. భార్యను ఎలా దండించాలో ఓ ముస్లిం పెద్ద ప్రత్యేక సూచనలు ఇస్తున్న ఆ వీడియో దుమారం రేపుతోంది. సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ అల్ సఖాబీ అనే వ్యక్తి ఫ్యామిలీ థెరపిస్టుగా పనిచేస్తున్నాడు. చెప్పిన మాట వినని భార్యలను ఎలా దండించాలనే విషయంలో అతడు ఓ వీడియో రూపంలో చెప్పాడు. అవేంటో అతడి మాటల్లోనే చూస్తే.. 'ఇది ఎంతో కష్టమైన విషయం అని నాకు తెలుసు. కానీ ఈ సమస్యను అల్లా దయతో సురక్షితంగా దాటుతాం. కోపంతో భార్యను కొట్టవద్దు. ఎంతో క్రమశిక్షణతో ఆ పనిచేయాలి. భార్యను కొట్టే విషయంలో కూడా ఇస్లాం నిబంధనలు పాటించాలి. భార్యలను ఇనుపరాడ్లు, కర్రలతో కొట్టవద్దు. అలాగే పదునైన ఆయుధాలు ఉపయోగించవద్దు. పళ్లను శుభ్రం చేసుకునే చిన్న సువ్వలాంటి వస్తువు లేదా.. హ్యాండ్ కర్చీఫ్ ఉపయోగించాలి. ఎందుకంటే ఆమె తన భర్త విషయంలో తప్పు చేసిందనే విషయం ఆమెకు తెలియజేయడమే అసలైన పని. కొట్టడానికి ముందు భర్తలు తమ హక్కులు.. భార్యల విధులు అల్లా ప్రకారం వారికి తెలియజేయాలి. నిద్ర వేళ భార్య దగ్గరకు వెళ్లొద్దు. దురదృష్టవశాత్తు కొంతమంది భార్యలు భర్తలతో సమానంగా జీవించాలని అనుకుంటారు. ఇదే పెద్ద సమస్యను సృష్టిస్తుంది. కొంతమంది భార్యలు కొట్టించుకునేందుకే భర్తలను రెచ్చగొడతారు. కానీ, భర్త భార్యను కొడుతున్నాడన్న విషయం బయటకు తెలియకుండా చూసుకోవాలి' అంటూ ఆయన సలహాలు ఇచ్చాడు.