భార్యలను ఇలా కొట్టాలంటూ సంచలన వీడియో | A Saudi Arabian family therapist has released a video giving his advice on wife beating | Sakshi
Sakshi News home page

భార్యలను ఇలా కొట్టాలంటూ సంచలన వీడియో

Published Thu, May 12 2016 1:36 PM | Last Updated on Fri, Jul 27 2018 2:28 PM

భార్యలను ఇలా కొట్టాలంటూ సంచలన వీడియో - Sakshi

భార్యలను ఇలా కొట్టాలంటూ సంచలన వీడియో

సౌదీ అరేబియా: ఆన్లైన్ లో ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. భార్యను ఎలా దండించాలో ఓ ముస్లిం పెద్ద ప్రత్యేక సూచనలు ఇస్తున్న ఆ వీడియో దుమారం రేపుతోంది. సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ అల్ సఖాబీ అనే వ్యక్తి ఫ్యామిలీ థెరపిస్టుగా పనిచేస్తున్నాడు. చెప్పిన మాట వినని భార్యలను ఎలా దండించాలనే విషయంలో అతడు ఓ వీడియో రూపంలో చెప్పాడు. అవేంటో అతడి మాటల్లోనే చూస్తే..

'ఇది ఎంతో కష్టమైన విషయం అని నాకు తెలుసు. కానీ ఈ సమస్యను అల్లా దయతో సురక్షితంగా దాటుతాం. కోపంతో భార్యను కొట్టవద్దు. ఎంతో క్రమశిక్షణతో ఆ పనిచేయాలి. భార్యను కొట్టే విషయంలో కూడా ఇస్లాం నిబంధనలు పాటించాలి. భార్యలను ఇనుపరాడ్లు, కర్రలతో కొట్టవద్దు. అలాగే పదునైన ఆయుధాలు ఉపయోగించవద్దు. పళ్లను శుభ్రం చేసుకునే చిన్న సువ్వలాంటి వస్తువు లేదా.. హ్యాండ్ కర్చీఫ్ ఉపయోగించాలి. ఎందుకంటే ఆమె తన భర్త విషయంలో తప్పు చేసిందనే విషయం ఆమెకు తెలియజేయడమే అసలైన పని. కొట్టడానికి ముందు భర్తలు తమ హక్కులు.. భార్యల విధులు అల్లా ప్రకారం వారికి తెలియజేయాలి. నిద్ర వేళ భార్య దగ్గరకు వెళ్లొద్దు. దురదృష్టవశాత్తు కొంతమంది భార్యలు భర్తలతో సమానంగా జీవించాలని అనుకుంటారు. ఇదే పెద్ద సమస్యను సృష్టిస్తుంది. కొంతమంది భార్యలు కొట్టించుకునేందుకే భర్తలను రెచ్చగొడతారు. కానీ, భర్త భార్యను కొడుతున్నాడన్న విషయం బయటకు తెలియకుండా చూసుకోవాలి' అంటూ ఆయన సలహాలు ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement