కేన్సర్‌తో పోరాడటంలో బీట్‌రూట్‌ హెల్ప్‌ అవుతుందా..? | Is Beetroot Helpful In Fighting Against Cancer | Sakshi

కేన్సర్‌తో పోరాడటంలో బీట్‌రూట్‌ హెల్ప్‌ అవుతుందా..?

Apr 6 2025 11:30 AM | Updated on Apr 6 2025 11:47 AM

Is Beetroot Helpful In Fighting Against Cancer

బీట్‌రూట్‌కు ఎరుపు రంగును ఇచ్చే బిటాలెయిన్స్‌ అనే పోషకం చాలా శక్తిమంతమైన  యాంటీ ఆక్సిడెంట్‌. అది ఫ్రీరాడికల్స్‌ను తొలగించి, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ఇందులో ఎక్కువ మోతాదులో ఉండే విటమిన్‌–సీ కూడా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌ కావడంతో ఇది కూడా కేన్సర్ల నివారణకు తోడ్పడుతుంది. 

అంతేకాదు... కొలాజెన్‌ ఉత్పాదన కూడా ఎక్కువగా జరుగుతుండటంతో చర్మం చాలాకాలం పాటు యౌవనంగా ఉండటానికి ఆ కొలాజెన్‌ సహాయపడుతుంది. బీట్‌రూట్‌ జ్యూస్‌ తీసుకునేవారికి అలసిపోకుండా చాలాసేపు పనిచేయగల స్టామినా పెరుగుతుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే... వ్యాయామం చేస్తూ బీట్‌రూట్‌ను క్రమం తప్పకుండా తీసుకునేవారు అనేక రకాల కేన్సర్ల నుంచి రక్షణ పొందుతారు. 

అలాగే బీట్‌రూట్ బీటాలైన్ పిగ్మెంట్‌ల కారణంగా కణితి కణాలను తగ్గించగలదని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా రొమ్ము, ప్రోస్టేట్‌ కేన్సర్ కణాలను తగ్గించగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. బీట్‌రూట్ రసంలోని నైట్రేట్‌లు గుండెపనితీరుని మెరుగ్గా ఉంచుతుంది

(చదవండి: జుట్టుని మింగేసే మందులివే..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement