మంచిర్యాలక్రైం: 100డైల్ కాల్స్ ఫిర్యాదుతో స్పందించిన బ్లూ కోల్ట్స్ పోలీసులు వెంటనే స్పందించి 30నిమిషాల వ్యవధిలో తప్పిపోయిన బాలున్ని కుటుంబ సభ్యులకు అప్పగించి శభాష్ బ్లూ కోల్ట్స్ అనిపించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... జన్నారం మండలం గంగవ్వకు చెందిన బంధువులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని చూసేందుకు గంగవ్వ తన 7సంవత్సరాల కుమారుడితో కలిసి మంగళవారం ఆసుపత్రికి వచ్చింది. గంగవ్వ ఆసుపత్రిలో బంధువులతో మాట్లాడుతుండగా బాలుడు అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు.
ఖంగు తిన్న గంగవ్వ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి స్థానికుల సలహాలు, సూచనల మేరకు 100డైల్‌కు ఫోన్ చేసి చెప్పడంతో క్షణంలోనే స్పందించిన సీఐ నారాయణ్‌నాయక్ బ్లూ కోల్ట్స్ పోలీసులను అప్రమత్తం చేసి గాలించారు. రంగంలోకి దిగిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఉస్మాన్‌పాష, తిరుపతి ఐబీ ప్రాంతం నుంచి ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పరిశీలించగా ఐబీ వైపు నుంచి ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి వైపు ఏడుస్తూ వెళ్తున్న బాలున్ని గమనించి, అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలున్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో బ్లూ కోల్ట్స్ సిబ్బందిని స్థానికులు, అధికారులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment