manchiryla town
-
మంచిర్యాల: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హల్చల్
-
శభాష్.. పోలీస్.. 30నిమిషాల వ్యవధిలోనే
మంచిర్యాలక్రైం: 100డైల్ కాల్స్ ఫిర్యాదుతో స్పందించిన బ్లూ కోల్ట్స్ పోలీసులు వెంటనే స్పందించి 30నిమిషాల వ్యవధిలో తప్పిపోయిన బాలున్ని కుటుంబ సభ్యులకు అప్పగించి శభాష్ బ్లూ కోల్ట్స్ అనిపించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... జన్నారం మండలం గంగవ్వకు చెందిన బంధువులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని చూసేందుకు గంగవ్వ తన 7సంవత్సరాల కుమారుడితో కలిసి మంగళవారం ఆసుపత్రికి వచ్చింది. గంగవ్వ ఆసుపత్రిలో బంధువులతో మాట్లాడుతుండగా బాలుడు అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. ఖంగు తిన్న గంగవ్వ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి స్థానికుల సలహాలు, సూచనల మేరకు 100డైల్కు ఫోన్ చేసి చెప్పడంతో క్షణంలోనే స్పందించిన సీఐ నారాయణ్‌నాయక్ బ్లూ కోల్ట్స్ పోలీసులను అప్రమత్తం చేసి గాలించారు. రంగంలోకి దిగిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఉస్మాన్పాష, తిరుపతి ఐబీ ప్రాంతం నుంచి ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో పరిశీలించగా ఐబీ వైపు నుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వైపు ఏడుస్తూ వెళ్తున్న బాలున్ని గమనించి, అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలున్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో బ్లూ కోల్ట్స్ సిబ్బందిని స్థానికులు, అధికారులు అభినందించారు. -
మంచిర్యాల : షాపు గేట్లు పగలగొట్టి చోరీకి పాల్పడిన దొంగలు
-
నెత్తురోడిన రహదారులు
సాక్షి, ఖానాపూర్(ఆదిలాబాద్) : ఉమ్మడి ఆదిలాబాద్‌లో జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేర్వేరు చోట్ల జరిగిన ఈ సంఘటనలు జిల్లాలో విషాదం నింపాయి. ఖానాపూర్ మండలంలో ఎదురెదురుగా బైక్‌లు ఢీకొన్న సంఘటనలో నలుగురూ మృతిచెందారు. ఇదే సంఘటనలో గాయపడిన మరో వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదం ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామ శివారులోని సత్తన్‌పల్లి గ్రామశివారు 222 ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. ఖానాపూర్‌కు చెందిన ముగ్గురు యువకులు సత్తన్‌పల్లి నుంచి ఖానాపూర్‌కు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. సత్తన్‌పల్లికి చెందిన ఇద్దరు యువకులు ఖానాపూర్ నుంచి సత్తన్‌పల్లికి బైక్‌పై వస్తున్నారు. తర్లపాడ్ శివారుకు రాగానే ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఖానాపూర్‌కు చెందిన జీసాన్‌ఖాన్(19), వంశీ, అమన్‌ఖాన్‌తోపాటు సత్తన్‌పల్లికి చెందిన రాయవేని అంజి(19), కల్లెడ బీమేశ్ (20)లు గాయపడగా స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరు యువకులు బంగారు వంశీ, అమన్‌ఖాన్‌లు చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలానికి సీఐ జయరాం చేరుకుని పరిశీలించారు. మంచిర్యాలరూరల్(హాజీపూర్): రోడ్డు ప్రమాదంలో 11 మందికి గాయాలైన సంఘటన హాజీపూర్ మండల సమీపంలో మంగళవారం చోటుచేసుకు ంది. సంఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. దే వా పూర్ గ్రామానికి చెందిన జాడి శంకర్‌తో వారి కు టుంబ సభ్యలు, బంధువులు కలిసి మంగళవా రం జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. మంచిర్యాల దాటి హాజీపూర్ మీదుగా వెళ్లుతుండగా రాపల్లి పునరావాస కాలనీకి వెళ్లే జాతీయ రహదారిపై టాటా ఏస్‌కు ఎదురుగా వస్తున్న ఓ కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ వాహనం బోల్తాపడి ఐదు మీటర్ల వరకు రాసుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో జా డి శంకర్, జాడి పోశం, రామారావు, సతీశ్, శోభ, సుజాత, మారు పటేల్, తనీష్, డ్రైవర్ అక్కిపెల్లి శ్రీనివాస్‌లకు గాయాలయ్యాయి. కారు నడుపుతున్న శ్రీపతి కొమురయ్య శ్రీరాంపూర్‌కు చెం దిన వ్యక్తి గాయపడ్డాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న స్థానిక హాజీపూర్‌కు చెందిన పెంట పోశయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీ రందరినీ ఆటోల ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో పెంట పోశయ్య సీరియస్‌గా ఉండగా మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులకు పరామర్శ... ప్రమాదంలో గాయపడిన వారందరినీ హాజీపూర్ ఎంపీపీ మందపల్లి స్వర్ణలత పరామర్శించి వెంటనే ఆటోల ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్ బాధితులను ఆస్పత్రిలో చికిత్స అందేలా ఏర్పాట్లు చేయించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కన పెట్టించి వాహన రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చేశారు. -
తప్పిన పెనుప్రమాదం
జైపూర్(చెన్నూర్): ఆర్టీసీ బస్సులు వరుసగా ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో మరో బస్సు ప్రమాదానికి గురైంది. మండల కేంద్రంలోని ఎల్లమ్మగుడి సమీపంలో మంచిర్యాల–చెన్నూర్ 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 30 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మంచిర్యాల ఆర్టీసీ డిపోకు చెందిన పల్లెవెలుగు (అద్దె బస్సు) శుక్రవారం మధ్యాహ్నం మంచిర్యాల నుంచి చెన్నూర్‌కు 70 మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఎల్లమ్మగుడి సమీపంలోకి రాగానే.. బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి కల్వర్టును వేగంతో ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలోకి పడిపోయింది. దీంతో ప్రయాణికులు ఒకరిపైఒకరు పడిపోయారు. బస్సు అద్దాలు, సీట్లు, ఇనుపరాడ్లు బలంగా తాకడంతో ప్రయాణికుల తలలు, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు కండక్టర్‌తో సహా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పప్రతికి తరలించి చికిత్స అందించారు. స్వల్పంగా గాయపడ్డ వారిని జైపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందించి మంచిర్యాలకు రెఫర్ చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, నిద్రమత్తుతో బస్సు నడిపాడని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ మాత్రం బ్రేక్‌ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని పేర్కొంటున్నాడు. వరుసగా చోటు చేసుకుంటున్న ఆర్టీసీ బస్సుల ప్రమాదాలతో ప్రయాణికుల్లో ఆందోళన చెందుతున్నారు. -
‘ఏటీఎం’ మోసగాడి అరెస్ట్
మంచిర్యాలటౌన్: మంచిర్యాల జిల్లాలో ఏటీఎంలకు వచ్చే వారిని ఏమార్చి, కార్డులను తారుమారు చేసి వారి డబ్బులను కాజేస్తున్న ఓ మోసగాడిని శనివారం అరెస్టు చేసినట్లు మంచిర్యాల పట్టణ సీఐ ఎడ్ల మహేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం పట్టణంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలో చెరకు రసం వ్యాపారి సింద కృష్ణ ఈనెల 12న ఐబీ చౌరస్తాలోని ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. కానీ, డబ్బులు రాకపోవడంతో కృష్ణ వెనుదిరుగుతుండగా వెనకాలే ఉన్న ఓ వ్యక్తి తాను డ్రా చేసి ఇస్తానంటూ కృష్ణ ఏటీఎం తీసుకున్నాడు. ఇతను కూడా డబ్బులు రావడం లేదని చెప్పి కృష్ణకు ఏటీఎం వాపసిచ్చాడు. కానీ, ఆ వ్యక్తి కృష్ణకు అసలు ఏటీఎం కాకుండా, తన వద్ద ఉన్న మరో నకిలీ ఏటీఎంను ఇచ్చాడు. ఏటీఎం దగ్గరి నుంచి కృష్ణ వెళ్లిపోగానే, ఆ వ్యక్తి తన దగ్గరున్న కృష్ణ అసలు ఏటీఎం కార్డు ద్వారా రూ.14,500లను డ్రా చేసుకుని ఉడాయించాడు. తన సెల్‌కు మెసేజ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించిన కృష్ణ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా డబ్బులు కాజేసిన వ్యక్తిని బెల్లంపల్లి ఓసీపీ–కేకే–2లో నివాసముండే ఉంటున్న గంధం మహేందర్‌గా పోలీసులు గుర్తించారు. మోసపోయిన కృష్ణకు నిందితుడు ఇచ్చిన ఏటీఎం కార్డు వివరాల ఆధారంగా విచారించి, శనివారం బస్టాండ్ దగ్గర నిర్వహించిన తనిఖీల్లో నిందితుడు మహేందర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వివరించారు. ఇతని నుంచి రూ.14,500 నగదుతోపాటు, మరో 3 డమ్మీ ఏటీఎం కార్డులను స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై మారుతితోపాటు సిబ్బంది జైచందర్, సత్యం పాల్గొన్నారు. -
మహిళలకు క్రీడాపోటీలు
సాక్షి, మందమర్రిరూరల్(చెన్నూర్): ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎల్లందు క్లబ్లో బుధవారం సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు పలు క్రీడాపోటీలు నిర్వహించారు. పోటీలను సేవా సమితి అధ్యక్షురాలు, ఏరియా జీఎం సతీమణి సుజాత రాఘవులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం మహిళల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. నేటి రోజుల్లో మహిళలు అంతర్జాతీయ స్థాయిలో మగవారికి ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. సింగరేణిలో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలను గుర్తించి అభినందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు త్రోబాల్, బాంబే బ్లాస్ట్, పాటలు, నృత్యాలు, స్కిట్స్, హాస్యవల్లరి తదితర పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి మహిళా దినోత్సవం రోజున ఏరియా జీఎం రాఘవులు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా డీవైపీఎం తిరుపతి, ఎస్టేట్ ఆఫీసర్ నవనీత, ఎకౌంట్స్ ఆఫీసర్ సుధారాణి, కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ సకినాల రాజేశ్వర్రావ్, నెల్సన్, గ్రౌండ్ ఇన్చార్జి తిరుపతి, స్విమ్మింగ్ కోచ్ పప్పు నారాయణ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. శ్రీరాంపూర్(మంచిర్యాల): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో మహిళలకు బుధవారం నస్పూర్ కాలనీలోని సేవా భవన్ వద్ద పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సేవా అధ్యక్షురాలు ఆస్మాసుభాని ప్రారంభించారు. త్రోబాల్, బాల్ ఇన్ బాస్కెట్, టగ్ ఆఫ్ వార్, బాంబ్ బ్లాస్ట్ వంటి పోటీలు నిర్వహించారు. విజేతలకు శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో బహుమతి ప్రదానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, పీఎం తుకారాం, స్పోర్ట్స్ సూపర్వైజర్ సీహెచ్ అశోక్, జనరల్ కేప్టెన్ గోపాల్‌రెడ్డి, కో ఆర్డినేటర్ రమేశ్, సేవా కార్యకర్తలు రత్నకళ, మంజుల, కొట్టె జ్యోతి, సునీత, స్వప్న, లలిత, తిరుమల, శంకరమ్మ పాల్గొన్నారు. -
ఆహారంలో నాణ్యతకు తిలోదకాలు !
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా హోటళ్లలో ఆహార నాణ్యతాప్రమాణాలకు యజమానులు తిలోదకాలిస్తున్నారు. ఆహార నియంత్రణ అధికారుల పర్యవేక్షణ లోపం, మొక్కుబడి తనిఖీలతో ప్రజలు ఆస్పత్రి పాలు కావాల్సి వస్తోంది. జిల్లాలో 5వేల వరకు ఆహార పదార్థాలు అందించే హోటళ్లు, మిఠాయి దుకాణాలు, రెస్టారెంట్లు, చాట్ కేంద్రాలు, బేకరీలు ఉన్నాయి. వీటన్నింటినీ తనిఖీ చేయాలంటే ఐదుగురు ఆహార నియంత్రణ అధికారులు ఉండాలి. కానీ ప్రస్తుతం జిల్లాలో జిల్లా అధికారితోపాటు ఇద్దరు ఆహార నియంత్రణ అధికారులు, ఇద్దరు అటెండర్లు ఉన్నారు. సిబ్బంది కొరతను ఇటీవల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పట్లో సమస్య తీరేలా కనిపించడం లేదు. జిల్లా కార్యాలయంలో క్లర్క్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్ల ఊసే లేదు. ఇక శాంపిళ్ల సేకరణ, కేసుల నమోదు ఏ మేరకు పకడ్బందీగా ఉంటాయో చెప్పనవసరం లేదు. 2012లో 50 కేసులు నమోదు కాగా, 2013లో ఇప్పటివరకు 20 కేసులు నమోదయ్యాయి. నోటీసులు జారీ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. హెచ్చరికలతో సరి.. హోటళ్లు, బేకరీలు ఇతర వాటిపై ఆహార నియంత్రణ అధికారులు తనిఖీలు చేస్తున్నా సంబంధిత యాజమాన్యాల తీరులో మార్పు రావడం లేదు. అపరిశుభ్రత వాతావరణంలో తయారు చేసి ఎలాంటి నాణ్యతాప్రమాణాలు లేని ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు. తనిఖీల్లో భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చినా పూర్తి స్థాయిలో ఆయా ఆహార సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. హెచ్చరికలు చేస్తూ సరిపెడుతున్నారు. సేకరించిన ఆహార నమూనాలను ల్యాబ్‌లకు పంపించగా.. శుచిగా లేవని, ప్రజలకు వడ్డించడానికి పనికిరావని నివేదిక వచ్చినా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. చిన్న పాటి ఆహార విక్రయ వ్యాపారం చేసుకునే వారు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆహార పరిరక్షణ, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం అధికారుల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవీ ప్రమాణాలు.. ఆహార పదార్థాలను సరఫరా చేసే సంస్థలో నాణ్యత, పరిశుభ్రత పాటించేందుకు కొన్ని ప్రమాణాలు పాటించాలని ఆహార నియంత్రణ చట్టం చెబుతోంది. వంట కోసం ఉపయోగించే నూనెను ఒకసారి కంటే ఎక్కవ వాడరాదు. వండిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోను ఫ్రిజ్‌లో నిల్వ చేయరాదు. తాగునీటికి తప్పనిసరిగా ఫిల్టర్ నీరు, మినరల్ వాటర్ కానీ వాడాలి. కుళ్లిన పదార్థాలను ఏ పరిస్థితుల్లోనూ వినియోగదారుడికి సరఫరా చేయరాదు. కోడి మాంసం, మేక మాంసం ఒకే చోట పెట్టరాదు. పదార్థాలను సరైన వాతావరణంలో పెట్టాలి. వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మురుగునీటి వ్యవస్థ చుట్టుపక్కల ఉండరాదు. నిర్వాహకులు నిబంధనలు పాటిస్తున్నారా లేదా చూడడానికి ఆహార నియంత్రణ అధికారులు సహాయ వైద్య అధికారులతో తనిఖీలు చేయాల్సి ఉంటుంది. వాస్తవాలను పరిశీలిస్తే ఇలాంటి నిబంధనలు పాటించే హోటళ్లు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. రోజూ పదార్థాలను రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచి యథేచ్ఛగా వడ్డిస్తున్నా అడిగే నాథుడూ లేడు.. పట్టించుకునే వారే లేరు.