శ్రీరాంపూర్: త్రోబాల్ ఆడుతున్న మహిళలు
సాక్షి, మందమర్రిరూరల్(చెన్నూర్): ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎల్లందు క్లబ్‌లో బుధవారం సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు పలు క్రీడాపోటీలు నిర్వహించారు. పోటీలను సేవా సమితి అధ్యక్షురాలు, ఏరియా జీఎం సతీమణి సుజాత రాఘవులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం మహిళల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. నేటి రోజుల్లో మహిళలు అంతర్జాతీయ స్థాయిలో మగవారికి ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. సింగరేణిలో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలను గుర్తించి అభినందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు త్రోబాల్, బాంబే బ్లాస్ట్, పాటలు, నృత్యాలు, స్కిట్స్, హాస్యవల్లరి తదితర పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి మహిళా దినోత్సవం రోజున ఏరియా జీఎం రాఘవులు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా డీవైపీఎం తిరుపతి, ఎస్టేట్ ఆఫీసర్ నవనీత, ఎకౌంట్స్ ఆఫీసర్ సుధారాణి, కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ సకినాల రాజేశ్వర్‌రావ్, నెల్సన్, గ్రౌండ్ ఇన్‌చార్జి తిరుపతి, స్విమ్మింగ్ కోచ్ పప్పు నారాయణ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
శ్రీరాంపూర్(మంచిర్యాల): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో మహిళలకు బుధవారం నస్పూర్ కాలనీలోని సేవా భవన్ వద్ద పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సేవా అధ్యక్షురాలు ఆస్మాసుభాని ప్రారంభించారు. త్రోబాల్, బాల్ ఇన్ బాస్కెట్, టగ్ ఆఫ్ వార్, బాంబ్ బ్లాస్ట్ వంటి పోటీలు నిర్వహించారు. విజేతలకు శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో బహుమతి ప్రదానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, పీఎం తుకారాం, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ సీహెచ్ అశోక్, జనరల్ కేప్టెన్ గోపాల్‌రెడ్డి, కో ఆర్డినేటర్ రమేశ్, సేవా కార్యకర్తలు రత్నకళ, మంజుల, కొట్టె జ్యోతి, సునీత, స్వప్న, లలిత, తిరుమల, శంకరమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment