మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
సాక్షి, మందమర్రి: తనకు పట్టుబడిన అలుగును ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన సింగరేణి కార్మికుడు చుక్కలు చూడాల్సి వచ్చింది. విచారణ పేరుతో అతడిని మంగళవారం రాత్రంతా మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లో ప లుచోట్లకు తిప్పడంతో సదరు వ్యక్తి అస్వస్థతకు గురయ్యా డు. దీంతో బుధవారం ఉదయం అతడిని మంచిర్యాల ప్ర భుత్వాసుపత్రిలో చేర్పించి.. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతడిని పరీక్షించిన వైద్యులు కరోనా సస్పెక్ట్ వచ్చిందని, ఆర్‌టీపీసీఆర్ కోసం హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నట్లు తెలిపారు. సదరు వ్యక్తి సింగరేణి ఉద్యోగి కావడంతో కుటుంబ సభ్యులు అతడిని రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అసలేం జరిగింది..?
బాధితుడు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సింగరేణి కార్మికుని లైన్‌లోకి ఆదివారం అలుగు (వన్యప్రాణి) రావడంతో ఫారెస్ట్ అధికారులకు అప్పగిస్తామనే ఉద్దేశంతో సింగరేణి కార్మికుడు పట్టుకున్నాడు. సోమవారం ఉదయం విధులకు హాజరై ఇంటికొచ్చే సరికి చీకటి పడింది. ఫారెస్ట్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఉదయం విధులకు హాజరై ఇంటికొచ్చి తెల్సినవారి ద్వారా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అధికారులు వచ్చి అలుగుతోపాటు సదరు వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
రాత్రంతా తిప్పిన అధికారులు
సదరు వ్యక్తిని విచారణ పేరిట రాత్రంతా రెండుజిల్లాల్లో తిప్పినట్లు సమాచారం. ఉదయం మందమర్రికి తీసుకురాగా.. సదరు వ్యక్తి అస్వస్థతకు లోనయ్యాడని, దీంతో గుచప్పుడు కాకుండా ఆసుపత్రిలో చేర్పించారని కుటుంబసభ్యులు అంటున్నారు. అతడికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహించేవారని ప్రశ్నిస్తున్నారు. సదరు వ్యక్తికి కరోనా సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి పరీక్షలు చేయాలని పలువురు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment