ఫోన్‌ కెమెరా ఫ్లాష్‌తో కొడుకుని కాపాడుకున్న తల్లి! | Uk Mom Detects Sons Rare Eye Cancer Using Phones Camera Flash | Sakshi
Sakshi News home page

ఫోన్‌ కెమెరా ఫ్లాష్‌తో కొడుకుని కాపాడుకున్న తల్లి! అలా చేసి ఉండకపోతే..

Mar 1 2024 4:19 PM | Updated on Mar 1 2024 4:37 PM

Uk Mom Detects Sons Rare Eye Cancer Using Phones Camera Flash - Sakshi

ఓ మహిళ ముక్కు పచ్చలారని మూడు నెలల శిశువుని ఫోన్‌ కెమెరా ఫ్లాష్‌తో ఫోటో తీసింది. ఏమైందో ఏమో ఏదో అర్థం కానిమెరుపు శిశువు కంటిలో కనపించింది. ఏంటిదీ అని ఆశ్చర్యపోయింది. లాభం లేదనుకుని పలు రకాలుగా ఫోటోలు తీసి ప్రయత్నించింది. అయితే ఏదో తెల్లటి వెలుగులా కనిపిస్తుంది ఫోటోలా. చెప్పాలంటే పిల్లి కన్ను మాదిరిగా ఉంది. ఏం చేయాలో తోచక గూగుల్‌లో సర్చ్‌ చేసింది. ఏదో తెలియన ఆందోళనతో వైద్యులను కూడా కలిసింది. అప్పుడే పిడుగలాంటి ఈ విషయం విని హుతాశురాలయ్యింది ఆ తల్లి. ఏమయ్యిందంటే..

లండన్‌లోని ఓ మహిళ తన ఫోన్‌లోని కెమెరాలోని ఫ్లాష్‌ని ఉపయోగించి తన మూడు నెలల బిడ్డను పోటోలు తీసింది. ఆ ఫోటోల్లో బిడ్డ కంటిలో ఏదో మెరుపు కనిపించేది. ఏంటిదీ అని ఆమె వేర్వేరు వెలుగుల్లో ఉంచి పలు రకాలుగా పోటోలు తీసిన అలాంటి వెలుగు కనిపించేది. అది పిల్లి కన్నులా ప్రతిబింబించేది.ఇదేంటన్నది అర్థం గాక గూగుల్‌ సెర్చ్‌లో వెదికింది. తీరా అక్కడ క్యాన్సర్‌ అయ్యి ఉండొచ్చన్న సంకేతాలు చూపింది. దీంతో ఆందోళనకు గురయ్యిన ఆమె వెంటనే మెడ్వే ఆస్పత్రిని సంప్రదించింది. అక్కడ వైద్యులు ఆ శిశువు పలు వైద్య పరీక్షల చేసి..ఆ చిన్నారి అరుదైన కంటి కేన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు.

దీంతో హుతాశురాలైన ఆమె తన బిడ్డ థామస్‌ను రాయల్ లండన్ ఆసుపత్రికి తరలించి తక్షణమే చికిత్స అందించింది. అతను నవంబర్ 2022 నుంచి ఆరు రౌండ్ల కీమోథెరపీని చేయించుకున్నాడు. చివరికి సెప్సిస్‌తో పోరాడిన తదనంతరం మరో చివరి రౌండ్ కీమోథెరపీని ఏప్రిల్ 2023లో ముగించాడు.  మేలో క్యాన్సర్ రహితంమని ప్రకటించడంతో ఆ తల్లి ముఖం ఒ‍క్కసారిగా వెలిగిపోయింది. 

కంటి కేన్సర్‌ అంటే..
నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం, రెటినోబ్లాస్టోమా అనేది అరుదైన కంటి క్యాన్సర్. ఇది చిన్న పిల్లలను ప్రభావితం చేసే వ్యాధి. ఎక్కువగా మూడేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ఒకటి లేదా రెండు కళ్లలో ఉండొచ్చు లేదా కంటి వెనుక భాగాన్ని (రెటీనా) ప్రభావితం చేస్తుంది. రెటినోబ్లాస్టోమా సాధారణ సంకేతమే ఈ  తెల్లటి మెరుపు.

ఇది కొన్ని లైట్లలో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి ఇది మెల్లకన్ను, కంటి రూపాన్ని మార్చడం లేదా వాపు  వంటి లక్షణాలను కూడా చూపిస్తుంది. వీటిలో ఏదో ఒక లక్షణం మాత్రం కచ్చితంగా ఉంటుంది. దాన్ని గమనించి త్వరితగతిన వైద్యులను సంప్రదిస్తే చూపు కోల్పోయే ప్రమాదం ఉండదు. 

(చదవండి: 50 నిమిషాల పాటు చనిపోయాడు..ఏకంగా 17 సార్లు షాక్, అంతా అయిపోయిందనేలోపు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement