సత్తా చూపిస్తా | Adah Sharma learns Nunchaku combat for Commando 3 | Sakshi
Sakshi News home page

సత్తా చూపిస్తా

Published Tue, Nov 5 2019 1:07 AM | Last Updated on Tue, Nov 5 2019 1:07 AM

Adah Sharma learns Nunchaku combat for Commando 3 - Sakshi

అదా శర్మ

కెరీర్‌లో ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్‌ పాత్రలే చేశారు హీరోయిన్‌ అదా శర్మ. తాజాగా ‘కమాండో 3’ చిత్రం కోసం మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారామె. దాని గురించి అదా మాట్లాడుతూ– ‘‘కమాండో 3’లో పోలీసాఫీసర్‌ భావనా రెడ్డి పాత్రలో నటించాను. నా పాత్రలో యాక్షన్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది. యాక్షన్‌ సన్నివేశాల కోసం ఇండియన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నాను.

కేరళలో కళరియపట్టు, తమిళనాడులో సిలంబం వంటి మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రావీణ్యత సంపాదించాను. నాన్‌చాక్‌ కూడా సాధన చేశా. నా కో–స్టార్‌ విద్యుత్‌ జమాల్‌ ఈ విషయంలో నాకు కొంతమేర సహాయం చేశారు. కానీ, నా శిక్షణ మొత్తాన్ని మా అమ్మగారు దగ్గరుండి చూసుకున్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌తో భావన సత్తా ఏంటో వెండితెరపై చూపిస్తా’’ అని పేర్కొన్నారు. విద్యుత్‌ జమాల్, అదా శర్మ జంటగా నటించిన ‘కమాండో 3’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement