రితికా సింగ్.. ముందు క్రీడాకారిణిగానే తెలుసు. ఆ తర్వాతే ఆమె నటిగా పరిచయమైంది. సుధా కొంగర తన దర్శకత్వంలోని ఇరుది సుట్రులో ఆమెకు అవకాశమిచ్చారు. ఈ చిత్రాన్నే తెలుగులో గురు, హిందీలో సాలా ఖడూస్‌గా రీమేక్ చేశారు. దీంతో ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రాఘవ లారెన్స్ శివలింగ, నీవెవరో, ఓ మై కడవులే, ఇన్కార్ సినిమాల్లో నటించింది. స్టోరీ ఆఫ్ థింగ్స్ వెబ్ సిరీస్‌తో వెబ్ సిరీస్‌లో నటించింది. మళ్లీ చాలారోజుల తర్వాత దుల్కర్ సల్మాన్ జతగా కింగ్ ఆఫ్ కొత్త అంటూ వెండితెరపై సందడి చేసింది.
(ఇది చదవండి: సోషల్ మీడియా ట్రోల్స్ చాలా ఇబ్బంది పెట్టాయి: రితికా)
మహారాష్ట్రలో పుట్టి పెరిగిన రితికా.. చిన్న వయసు నుంచే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే రితికా సింగ్.. మహిళలపై జరిగే దారుణాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. మహిళల కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ రావాలని చాలాసార్లు ప్రస్తావించింది. అదే తరహాలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రతి రెండు గంటలకు దేశంలో ఏదో ఓ మూలన మహిళలు, అమ్మాయిలు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతన్నాయని ఆరోపించింది. వార్తల్లో ఇలాంటి ఘటనలు చూసిన ప్రతిసారి నా రక్తం మరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దారుణాలు ఇంకెప్పుడు ఆగుతాయంటూ ఇన్‌స్టా వేదికగా ప్రశ్నించింది. ఇలాంటి మహిళలపై ఈ అఘాయిత్యాలు ఆగాలంటే మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే ప్రతి బిడ్డకు సెల్ఫ్ డిఫెన్స్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
(ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?)
ఇలాంటి దారుణాలు తట్టుకుని ఈ సమాజంలో నిలడాలంటే మన పిల్లలకు జరుగుతున్న ఘటనలపై చర్చించాలని రితికా సింగ్ రాసుకొచ్చారు. ఇలాంటి చిన్నపిల్లలతో చర్చించడం కష్టమైనప్పటికీ.. వారి భవిష్యత్తు కోసం మన మారాల్సిందేనని సూచించారు. మన భవిష్యత్ తరాల పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మహిళలంతా ఇలాంటి దారుణాలపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని హితవు పలికారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 12 ఏళ్ల బాలికపై దారుణ ఘటనను ఉద్దేశించి ఈ పోస్ట్ చేసినట్లు అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment