King of Kotha
-
ప్రముఖ దర్శకుడి ఇంట్లో దొంగతనం చేసిన సర్పంచ్ భర్త
మలయాళంలో ప్రముఖ దర్శకుడిగా జోషికి మంచి గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు ఆయన సుమారు 80కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన కుమారుడు అభిలాష్ కూడా దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమా ద్వారా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఆయన నివాసంలో సుమారు కోటి రూపాయలు విలువ చేసే ఆభరణాలు చోరీ చేశారు. ఈ కేసులో నిందితుడు మహ్మద్ ఇర్ఫాన్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శకుడి ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన ఇర్ఫాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను పోలీసులు వెళ్లడించారు. బిహార్‌కు చెందిన ఇర్ఫాన్ ఒక గ్రామ సర్పంచ్ భర్త అని పోలీసులు తెలిపారు. సీసీ టీవీ దృశ్యాల ద్వారా నిందితుడిని గుర్తించగా పరారీలో ఉన్న అతడిని కర్ణాటక పోలీసుల సాయంతో ఉడిపి జిల్లాలో అరెస్ట్ చేశారు. సీసీ టీవీలో రికార్డ్ అయిన వీడియోలో ఇర్ఫాన్ ఉపయోగించిన కారు నంబర్ క్లియర్‌గా కనిపించడంతో అతన్ని పట్టుకోవడం సులభం అయిందని కొచ్చి నగర పోలీసు కమిషనర్ శ్యామ్ సుందర్ తెలిపారు. ఆ కారు వెనుక భాగంలో గ్రామ సర్పంచ్ అనే బోర్డు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఇర్ఫాన్ పక్కా ప్లాన్‌తో ఇతర రాష్ట్రాల్లో తిరుగుతూ ధనవంతుల నివాసాలే టార్గెట్ చేస్తున్నాడు. దొంగతనంలో భాగంగా డబ్బులు, నగలు దొంగిలించి బిహార్‌లోని పేద ప్రజలకు పంచుతున్నాడని సమాచారం.. ఈ విషయం నిజమేనా అని ఓ విలేకరి పోలీసులను ప్రశ్నించగా.. అందుకు సరైన సమాధానం వారి నుంచి రాలేదు. తమ దృష్టిలో ఇర్ఫాన్ ఓ నిందితుడంటూ పోలీసులు పేర్కొన్నారు. ఇర్ఫాన్‌పై ఆరు రాష్ట్రాల్లో 19 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతనెలలోనే జైలు నుంచి ఆయన విడుదలయ్యారని వారు తెలిపారు. ప్రస్తుతం ఇర్ఫాన్ నుంచి రూ. కోటీ 20 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం నిందితుడు ఏప్రిల్ 20న కొచ్చికి వచ్చాడని తెలిపారు. నగరంలో విలాసవంతంగా ఉండే ప్రాంతాల గురించి ఆరా తీసి ప్లాన్ వేసినట్లు చెప్పారు. అయితే ఈ దొంగతనం జరిగినప్పుడు జోషీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ దొంగతనం తెల్లవారుజామున జరగడంతో వారు నిద్రలో ఉన్నట్లు సమాచారం. -
ఈ శుక్రవారం ఓటీటీల్లో 29 సినిమాలు రిలీజ్
వీకెండ్ వస్తుందంటే చాలు కాలేజీ కుర్రాళ్ల దగ్గర నుంచి సాఫ్ట్వేర్ బిడ్డల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఇక మూవీ లవర్స్ మాత్రం ఓటీటీల్లో కొత్త సినిమా/వెబ్ సిరీసులు ఏమొచ్చాయా? వాటిని ఎప్పుడు చూసేద్దామా అని ఎదురుచూస్తుంటారు. వాళ్లకోసమా అన్నట్లు ఈ వీకెండ్లో 29 మూవీస్-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కి రెడీ అయిపోయాయి. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి' సినిమా రిలీజ్‌కి ముందే రూ 3.5 కోట్లు నష్టం?) ఇకపోతే ఈ వారం ఓటీటీ లిస్ట్ రెడీ చేసినప్పుడు 40 వరకు సినిమాలు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. మిగిలిన మూవీస్-వెబ్ సిరీసులు ఇప్పుడు అంటే గురు, శుక్రవారాల్లో రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో మామా మశ్చీంద్ర, సర్వ శక్తిమయం, కృష్ణా రామా తదితర తెలుగు చిత్రాలు కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. ఓవరాల్ లిస్ట్ దిగువన ఉంది ఓ లుక్ వేసేయండి. ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 20) అమెజాన్ ప్రైమ్ మామా మశ్చీంద్ర - తెలుగు మూవీ సయెన్: డిసర్ట్ రోడ్ - ఇంగ్లీష్ చిత్రం ద అదర్ జోయ్ - ఇంగ్లీష్ సినిమా ట్రాన్స్ఫార్మర్స్: ద రైజ్ ఆఫ్ ద బీస్ట్స్ - ఇంగ్లీష్ మూవీ అప్లోడ్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ క్యాంపస్ బీస్ట్ సీజన్ 2 - హిందీ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కింగ్ ఆఫ్ కొత్త - హిందీ సినిమా నెట్‌ఫ్లిక్స్ క్రియేచర్ - టర్కిష్ సిరీస్ డూనా - కొరియన్ సిరీస్ ఎలైట్ సీజన్ 7 - స్పానిష్ సిరీస్ కండాసమ్స్: ద బేబీ - ఇంగ్లీష్ సినిమా ఓల్డ్ డాడ్స్ - ఇంగ్లీష్ చిత్రం సర్వైవింగ్ ప్యారడైజ్ - ఇంగ్లీష్ సిరీస్ పెయిన్ హజ్లర్స్ - ఇంగ్లీష్ మూవీ జెరాన్ టోమిక్: లా హోమీ అరైనీ దే పారిస్ - ఫ్రెంచ్ సినిమా క్యాస్ట్ అవే దివా - కొరియన్ సిరీస్ (అక్టోబరు 21) బాడీస్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) కెప్టెన్ లేజర్ హాక్: ఏ బ్లడ్ డ్రాగన్ రీమిక్స్ - ఇంగ్లీష్ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్) క్రిప్టో బాయ్ - డచ్ సినిమా (స్ట్రీమింగ్) నియాన్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్) సోనీ లివ్ హామీ 2 - బెంగాలీ సినిమా బుక్ మై షో మై లవ్ పప్పీ - కొరియన్ సినిమా ద నన్ II - ఇంగ్లీష్ చిత్రం (స్ట్రీమింగ్ అవుతోంది) ఆహా సర్వం శక్తిమయం - తెలుగు సినిమా రెడ్ శాండల్‌వుడ్ - తమిళ సినిమా మామా మశ్చీంద్ర - తెలుగు మూవీ ఈ విన్ కృష్ణారామా - తెలుగు మూవీ (అక్టోబరు 22) లయన్స్ గేట్ ప్లే మ్యూగీ మూరే - ఇంగ్లీష్ చిత్రం ఆపిల్ ప్లస్ టీవీ ద పిజియన్ టన్నెల్ - ఇంగ్లీష్ సినిమా (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో డబుల్ మీనింగ్ డైలాగ్స్.. 'జబర్దస్త్'ని మించిపోయిందిగా!) -
ఓటీటీలో దుల్కర్ సల్మాన్ యాక్షన్ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన యాక్షన్ మూవీ కింగ్ ఆఫ్ కొత్త. కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం. దీన్ని యథాతథంగా తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేశారు. అభిలాష్ జోషి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, మలయాళం, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ఆయా భాషల్లో దుల్కరే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. ప్రేమకథల్లో దుల్కర్‌ను చూసి అలవాటుపడిపోయిన అభిమానులు ఈ యాక్షన్ మూవీని ఆదరించలేదు. బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన అందుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ మినహా మిగతా అన్ని భాషల్లో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. తాజాగా హిందీ వర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్రయూనిట్.. ఇతర భాషల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న కింగ్ ఆఫ్ కొత్త హిందీ భాషలో అక్టోబర్ 20 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. 20 రోజులు ఆలస్యంగా హిందీ వర్షన్ ఓటీటీలోకి వస్తోంది. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ మొత్తానికి హిందీ వర్షన్ డేట్ ప్రకటించారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) చదవండి: హీరోయిన్‌తో లిప్‌లాక్.. నాని ఇంట్లో గొడవలు! -
ఇవన్నీ చూస్తుంటే నా రక్తం మరిగిపోతోంది: కింగ్ ఆఫ్ కోత హీరోయిన్
రితికా సింగ్.. ముందు క్రీడాకారిణిగానే తెలుసు. ఆ తర్వాతే ఆమె నటిగా పరిచయమైంది. సుధా కొంగర తన దర్శకత్వంలోని ఇరుది సుట్రులో ఆమెకు అవకాశమిచ్చారు. ఈ చిత్రాన్నే తెలుగులో గురు, హిందీలో సాలా ఖడూస్‌గా రీమేక్ చేశారు. దీంతో ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రాఘవ లారెన్స్ శివలింగ, నీవెవరో, ఓ మై కడవులే, ఇన్కార్ సినిమాల్లో నటించింది. స్టోరీ ఆఫ్ థింగ్స్ వెబ్ సిరీస్‌తో వెబ్ సిరీస్‌లో నటించింది. మళ్లీ చాలారోజుల తర్వాత దుల్కర్ సల్మాన్ జతగా కింగ్ ఆఫ్ కొత్త అంటూ వెండితెరపై సందడి చేసింది. (ఇది చదవండి: సోషల్ మీడియా ట్రోల్స్ చాలా ఇబ్బంది పెట్టాయి: రితికా) మహారాష్ట్రలో పుట్టి పెరిగిన రితికా.. చిన్న వయసు నుంచే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే రితికా సింగ్.. మహిళలపై జరిగే దారుణాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. మహిళల కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ రావాలని చాలాసార్లు ప్రస్తావించింది. అదే తరహాలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతి రెండు గంటలకు దేశంలో ఏదో ఓ మూలన మహిళలు, అమ్మాయిలు, చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతన్నాయని ఆరోపించింది. వార్తల్లో ఇలాంటి ఘటనలు చూసిన ప్రతిసారి నా రక్తం మరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దారుణాలు ఇంకెప్పుడు ఆగుతాయంటూ ఇన్‌స్టా వేదికగా ప్రశ్నించింది. ఇలాంటి మహిళలపై ఈ అఘాయిత్యాలు ఆగాలంటే మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే ప్రతి బిడ్డకు సెల్ఫ్ డిఫెన్స్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) ఇలాంటి దారుణాలు తట్టుకుని ఈ సమాజంలో నిలడాలంటే మన పిల్లలకు జరుగుతున్న ఘటనలపై చర్చించాలని రితికా సింగ్ రాసుకొచ్చారు. ఇలాంటి చిన్నపిల్లలతో చర్చించడం కష్టమైనప్పటికీ.. వారి భవిష్యత్తు కోసం మన మారాల్సిందేనని సూచించారు. మన భవిష్యత్ తరాల పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మహిళలంతా ఇలాంటి దారుణాలపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని హితవు పలికారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 12 ఏళ్ల బాలికపై దారుణ ఘటనను ఉద్దేశించి ఈ పోస్ట్ చేసినట్లు అర్థమవుతోంది. View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) -
సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?
సినీ ప్రియులు ఓటీటీలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లలో మొదటి వారం మినహాయిస్తే వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలు కనీసం నెల రోజులైనా థియేటర్లలో సందడి చేస్తున్నాయి. యావరేజ్ టాక్ ఉన్న సినిమాలైతే ఏకంగా నెలలోపే ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ప్రతివారం లాగే ఈసారి కూడా మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరీ ఆ చిత్రాలేంటో ఓ లుక్కేద్దాం. సమంత, విజయ్ 'ఖుషి' విజయ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలై మంచి ఓపెనింగ్స్‌ని అందుకుంది. థియేటర్స్‌లో విడుదలైన నెల రోజుల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. అక్టోబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఒటీటీ దిగ్గజం ప్రకటించింది. నిత్యామీనన్- 'కుమారి శ్రీమతి' (వెబ్ సిరీస్) నిత్యామేనన్ కీలక పాత్రలో గోమఠేష్ ఉపాధ్యాయ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ వెబ్‌సిరీస్ కుమారి శ్రీమతి. ఈ సిరీస్‌లో గౌతమి, తిరువీర్, నిరుపమ్, తాళ్లూరి రామేశ్వరి, ప్రణీత పట్నాయక్, ప్రేమ్ సాగర్, నరేష్, మురళీమోహన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సెప్టెంబరు 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దుల్కర్ సల్మాన్- కింగ్ ఆఫ్ కోత సీతారామంతో సూపర్ స్టార్‌గా మారిపోయిన దుల్కర్ సల్మాన్ నటించిన గ్యాంగ్‌స్టర్ మూవీ కింగ్ ఆఫ్ కోత. దుల్కర్ స్నేహితుడు అభిలాష్ జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు నెలాఖరులో విడుదలై ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా సెప్టెంబర్ 29 నుంచి మలయాళం, తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. పాపం పసివాడు సింగర్ శ్రీరామ చంద్ర, గాయత్రి చాగంటి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ పాపం పసివాడు. వీకెండ్ షో బ్యానర్‌పై రూపొందిన ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. లవ్ ఫెయిల్ అయిన అబ్బాయిని ముగ్గురు అమ్మాయిలు ప్రేమిస్తే ఎలా ఉంటుందన్నది ఈ సిరీస్ కథాంశం. ఈ వెబ్‌సిరీస్ సెప్టెంబర్ 29 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. సైలెంట్‌గా వచ్చేసిన ఎల్‌జీఎమ్ భారత క్రికెటర్ ఎంఎస్ ధోని ‘ఎల్‌జీఎమ్’తో నిర్మాణంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. హరీష్ కల్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో తెరకెక్కించిన ఈ చిత్రానికి రమేష్ తమిళ్మణి దర్శకత్వం వహించారు. సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఆగస్టు 4న విడుదలైంది. అయితే ఎలాంటి హడావుడి లేకుండానే ఈనెల 28 నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు
శుక్రవారం వస్తుందంటే చాలు చిల్ అవ్వాలి, సినిమాలు చూడాలి అని అందరూ ఫిక్సయిపోతారు. ఈసారి థియేటర్లలో 'స్కంద', 'చంద్రముఖి 2', 'పెదకాపు' లాంటి చిత్రాలు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో అయితే ఏకంగా ఒక్కరోజే 37 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. దీంతో మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. (ఇదీ చదవండి: మీదకొచ్చిన శివాజీ.. చాలా ఇబ్బందిపడ్డ లేడీ కంటెస్టెంట్!) సోమవారం ఓటీటీ లిస్ట్ రెడీ చేసినప్పుడు దాదాపు 37 సినిమాలు-సిరీసులు ఉన్నాయి. వాటిలో వారం ప్రారంభంలోనే స్ట్రీమింగ్ కాగా, కొత్తగా మరికొన్ని మూవీస్- వెబ్ సిరీసులు వచ్చి చేరాయి. అలా ఓవరాల్‌గా ఈ వారాంతంలోనూ 37 వరకు ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్నాయి. దిగువ జాబితాలో స్ట్రీమింగ్ అని ఉన్నవన్నీ కూడా గురవారం రిలీజైనట్లు. మిగతావన్నీ కూడా శుక్రవారం స్ట్రీమింగ్ కాబోతున్నాయని అర్థం. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్/వెబ్ సిరీస్‌లు అమెజాన్ ప్రైమ్ జెన్ వీ - ఇంగ్లీష్ సిరీస్ హూజ్ యువర్ గైనక్ - హిందీ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్) డోబుల్ డిస్కోర్షో - స్పానిష్ చిత్రం (స్ట్రీమింగ్) కుమారి శ్రీమతి - తెలుగు సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) ఆహా దోచేవారెవరురా - తెలుగు సినిమా పాపం పసివాడు - తెలుగు సిరీస్ డర్టీ హరి - తమిళ చిత్రం హర్కరా - తమిళ సినిమా (అక్టోబరు 01) హాట్‌స్టార్ కిక్ - తమిళ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) కింగ్ ఆఫ్ కొత్త - తెలుగు డబ్బింగ్ సినిమా లాంచ్ ప్యాడ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ తుమ్ సే నా హో పాయేగా - హిందీ సినిమా నెట్‌ఫ్లిక్స్ డునాట్ డిస్ట్రబ్ - టర్కీష్ మూవీ ఫెయిర్ ప్లే - ఇంగ్లీష్ సినిమా చూనా - హిందీ సిరీస్ నో వేర్ - స్పానిష్ సినిమా రెప్టైల్ - ఇంగ్లీష్ మూవీ ద ర్యాట్ క్యాచర్ - ఇంగ్లీష్ చిత్రం పాయిజన్ - ఇంగ్లీష్ మూవీ (సెప్టెంబరు 30) ఖుషి - తెలుగు సినిమా (అక్టోబరు 01) స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ద స్పైడర్-వర్స్ - ఇంగ్లీష్ సినిమా (అక్టోబరు 01) ద ఆస్కార్స్ ఫాంటసీ - తగలాగ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్) ద స్వాన్ - ఇంగ్లీష్ సినిమా (ఇప్పటికే స్ట్రీమింగ్) ద డార్క్నెస్ వితిన్ లా లెజ్ డెల్ ముండో - స్పానిష్ చిత్రం (స్ట్రీమింగ్) ఐస్ కోల్డ్: మర్డర్, కాఫీ అండ్ జెస్సీకా వాంగ్సో - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ - ఇంగ్లీష్ చిత్రం (ఇప్పటికే స్ట్రీమింగ్) సోనీ లివ్ అడియై! - తమిళ సినిమా ఏజెంట్ - తెలుగు మూవీ జీ5 అంగ్షుమాన్ MBA - బెంగాలీ సినిమా ఐ కిల్డ్ బాపూ - హిందీ మూవీ లయన్స్ గేట్ ప్లే సింపతీ ఫర్ ద డెవిల్ - ఇంగ్లీష్ సినిమా జియో సినిమా ద కమెడియన్ - హిందీ షార్ట్ ఫిల్మ్ బిర్హా: ద జర్నీ బ్యాక్ హోమ్ - పంజాబీ షార్ట్ ఫిల్మ్ (సెప్టెంబరు 30) బేబాక్ - హిందీ షార్ట్ ఫిల్మ్ (అక్టోబరు 01) బుక్ మై షో బ్లూ బీటల్ - ఇంగ్లీష్ సినిమా స్కూబీ డూ! అండ్ క్రిప్టో, టూ! - ఇంగ్లీష్ మూవీ సైనా ప్లే ఎన్నీవర్ - మలయాళ చిత్రం (ఇదీ చదవండి: హీరో అవ్వాల్సిన ఆ స్టార్ కొడుకు.. 9 ఏళ్లుగా మంచానికే పరిమితమై!) -
ఓటీటీలో దుల్కర్ యాక్షన్ మూవీ, స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ప్రేమకథలకు చిరునామాగా మారిన దుల్కర్ సల్మాన్ తొలిసారి యాక్షన్ అవతారమెత్తిన చిత్రం కింగ్ ఆఫ్ కొత్త. కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించాయి. అన్ని భాషల్లోనూ దుల్కర్ తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఆగస్టు 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 22న ఓటీటీలోకి వస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. సడన్‌గా ఓటీటీలో వస్తుందేమో అంటే అదీ జరగలేదు. దీంతో ఈ నెల 28 లేదా 29న ఏదో ఒకరోజు ఓటీటీలోకి రానుందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తెర దించుతూ అధికారిక ప్రకటన వెలువడింది. హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు హాట్‌స్టార్ ప్రకటించింది. తెలుగు, మలయాళం, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారా? లేదా? అన్నది మాత్రం స్పష్టత లేదు. సినిమా కథేంటంటే.. కింగ్ ఆఫ్ కొత్త కథ 80,90వ దశకంలో సాగుతుంది. కోతా అనే టౌన్‌కి చెందిన రాజు(దుల్కర్ సల్మాన్) తండ్రి రవిలాగే తాను కూడా ఓ పెద్ద రౌడీ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కంటాడు. దాన్ని సాకారం చేసుకుంటాడు. అతనికి చెల్లి రీతూ(అనికా సురేంద్రన్)అంటే చాలా ఇష్టం. కొడుకు రౌడీ కావడంతో తల్లి అతనితో మాట్లాడేది కాదు. దీంతో కోతా టౌన్లోనే స్నేహితుడు కన్నా(షబీర్ కళ్లరక్కల్)తో కలిసి వేరుగా ఉండేవాడు. రాజుకి అదే ప్రాంతానికి చెందిన తార(ఐశ్వర్య లక్షీ) అంటే చాలా ఇష్టం. ఆమె కోసమే కోతాలో డ్రగ్స్ అనేది లేకుండా చేస్తాడు. ఓ కారణంగా రాజుకు తాగుడు బానిసైతాడు. నెమ్మదిగా కోతా ప్రాంతాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్న కన్నా.. కన్నాభాయ్‌గా మారి ఆ ప్రాంతంలో డ్రగ్స్‌ని విచ్చలవిడిగా అమ్మేస్తుంటాడు. అయితే ఎంతో మంది గ్యాంగ్‌స్టర్స్‌ని మట్టుపెట్టిన సీఐ శావుల్(ప్రసన్న) కోతాకి ట్రాన్స్ఫర్ అవుతాడు. కన్నాభాయ్‌కి చెక్ పెట్టేందుకుగానూ రాజుని మళ్లీ కోతా వచ్చేలా చేస్తాడు. అసలు రాజు ఎందుకు కోతాని వదిలి వెళ్లాడు? ప్రాణ స్నేహితులుగా ఉన్న కన్నా, రాజులు ఎందుకు శత్రువులుగా మారారు? చివరకు కోతా ఎవరి ఆధీనంలోకి వెళ్లింది? అనేది తెలియాలంటే ‘కింగ్ ఆఫ్ కోతా’ను ఓటీటీలో చూడాల్సిందే. చదవండి: శరత్ బాబు రెండో భార్యగా నా ఫోటోలు.. చాలా బాధేసింది!! -
'కింగ్ ఆఫ్ కొత్త' ఓటీటీ విడుదల తేదీలో మార్పు
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మహానటి, కనులు కనులు దోచాయంటే, సీతారామం వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఇలాంటి సూపర్ హిట్ చిత్రాలు ఆయన నుంచి వచ్చాయి కాబట్టే ఆయన సినిమాలపై తెలుగు వారు కూడా ఆ వైపు ఓ కన్నేస్తుంటారు. పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 24న కింగ్ ఆఫ్ కొత్త (కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం) సినిమా విడుదలైంది. ఇదీ చదవండి నయనతార సంచలన నిర్ణయం.. యూట్యూబర్‌కు గోల్డెన్ ఛాన్స్ ఇప్పటికే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీప్లస్‌హాట్ స్టార్‌లో సెప్టెంబర్ 22 విడుదల కానున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఇప్పటి వరకు సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఈ సినిమా డిస్నీప్లస్‌హాట్ స్టార్‌లో రేపు సెప్టెంబర్ 22 విడుదల కావడం లేదు. అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు అనుబంధంగా ఉన్న వర్గాలు తెలుపుతున్న ప్రకారం సెప్టెంబర్ 28 లేదా 29న ఈ సినిమా ఓటీటీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. అభిలాష్ జోషీ దర్శకత్వంలో దుల్కర్ నటించిన ఈ మూవీ ఓ మోస్తారుగా ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఇదులో యాక్షన్ సీన్స్ అందరినీ కట్టిపడేస్తాయి. గ్యాంగస్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించింగా. గురు సినిమా ఫేమ్ రితికా సింగ్ ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. -
కింగ్ ఆఫ్ కొత్త.. దుల్కర్ సినిమాకు పేలవమైన కలెక్షన్స్
దుల్కర్ సల్మాన్.. ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తుంటాడీ హీరో. సీతారామం సినిమాతో తెలుగువారికీ దగ్గరైన ఈ హీరో తొలిసారి పూర్తి మాస్ యాక్షన్ సినిమా చేశాడు. దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించాయి. తెలుగు, మలయాళం, తమిళ్, హిందీలో ఈ నెల 24న ఈ సినిమా రిలీజైంది. అన్నట్లు అన్ని భాషల్లోనూ దుల్కర్ తనే స్వయంగా డబ్బింగ్ చెప్పాడు. గురువారం విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఈ గ్యాంగ్‌స్టర్ సినిమా అంతగా వర్కవుట్ కానట్లు కనిపించింది. ఫలితంగా ఈ చిత్రం రూ.7.70 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.60 కోట్ల మేర బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ డే పది కోట్లు కూడా రాబట్టలేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. రానున్న రోజుల్లోనూ కలెక్షన్స్ ఇలాగే ఉంటే డిజాస్టర్ దిశగా ప్రయాణించడం ఖాయం అని చెప్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కుల విషయానికి వస్తే.. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకు పెద్దగా పాజిటివ్ బజ్ లేదు, కలెక్షన్స్ కూడా డల్ ఉన్నందున వచ్చే నెలలో ఓటీటీలో ప్రత్యక్షం కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మొదట్లో ఈ సినిమా పేరును కింగ్ ఆఫ్ కోతగానే ఉంచారు. దుల్కర్ సైతం అలాగే పలికాడు. కానీ మలయాళంలో కొత్త అంటే టౌన్ అని అర్థం వస్తుండటంతో దాన్ని మార్చేసి కింగ్ ఆఫ్ కొత్తగా రిలీజ్ చేశారు. చదవండి: థియేటర్లో రిలీజైన వారం రోజులకే ఓటీటీలోకి.. మరో మూడు సినిమాలు స్ట్రీమింగ్.. ఎక్కడంటే? -
‘కింగ్ ఆఫ్ కొత్త’ మూవీ రివ్యూ
టైటిల్: కింగ్ ఆఫ్ కొత్త నటీనటులు: దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కళ్ళరక్కల్, అనిఖా సురేంద్రన్, నైలా ఉషా, షాహుల్ హసన్, గోకుల్ సురేశ్ తదితరులు నిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ దర్శకత్వం: అభిలాష్ జోషి నేపథ్య సంగీతం: జాక్స్ బిజోయ్ పాటలు : షాన్ రెహమాన్, బిజోయ్ సినిమాటోగ్రఫీ: నిమేష్ రవి విడుదల తేది: ఆగస్ట్ 24, 2023 మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్.. తనదైన నటనతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. మలయాళ హీరో అయినప్పటికీ మహానటి, సీతారామం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. తాజాగా దుల్కర్ నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 24)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘కింగ్ ఆఫ్ కొత్త’కథేంటంటే.. ఈ మూవీ కథ 80,90వ దశకంలో సాగుతుంది. కోతా అనే టౌన్‌కి చెందిన రాజు(దుల్కర్ సల్మాన్) తండ్రి రవిలాగే తాను కూడా ఓ పెద్ద రౌడీ కావాలని చిన్నప్పటి నుంచి కలలు కంటాడు. అనుకున్నట్లే పెద్ద రౌడీ అయి కోతా టౌన్‌ని తన గుప్పింట్లోకి తెచ్చుకుంటాడు. అతనికి చెల్లి రీతూ(అనికా సురేంద్రన్)అంటే చాలా ఇష్టం. కొడుకు రౌడీ కావడంతో తల్లి అతనితో మాట్లాడేది కాదు. దీంతో కోతా టౌన్లోనే స్నేహితుడు కన్నా(షబీర్ కళ్లరక్కల్)తో కలిసి వేరుగా ఉండేవాడు. స్వతాహా ఫుట్ బాల్ ప్లేయర్ అయిన రాజు.. ఆ ఏరియాలో ఎక్కడ పోటీలు నిర్వహించిన తన గ్యాంగ్‌తో కలిసి పాల్గొనేవాడు. రాజుకి అదే ప్రాంతానికి చెందిన తార(ఐశ్వర్య లక్షీ) అంటే చాలా ఇష్టం. ఆమె కోసమే కోతాలో డ్రగ్స్ అనేది లేకుండా చేస్తాడు. ఓ కారణంగా రాజుకు తాగుడు బానిసైతాడు. దీంతో అతని గ్యాంగ్ అంతా వేరు వేరు ప్రాంతాలకు వెళ్లిపోతారు. కొన్నాళ్లకు కోతా ప్రాంతాన్ని తన చేతుల్లోకి తెచ్చుకున్న కన్నా.. కన్నాభాయ్‌గా మారి ఆ ప్రాంతంలో డ్రగ్స్‌ని విచ్చలవిడిగా అమ్మేస్తుంటాడు. ఆ ఏరియా పోలీసు అధికారులు సైతం కన్నాభాయ్‌కి భయపడతారు. అయితే ఎంతో మంది గ్యాంగ్‌స్టర్స్‌ని మట్టుపెట్టిన సీఐ శావుల్(ప్రసన్న) కోతాకి ట్రాన్స్ఫర్ అవుతాడు. కన్నాభాయ్‌కి చెక్ పెట్టేందుకై రాజుని మళ్లీ కోతా వచ్చేలా చేస్తాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రాజు ఎందుకు కోతాని వదిలి వెళ్లాడు? ప్రాణ స్నేహితులుగా ఉన్న కన్నా, రాజులు ఎందుకు శత్రువులుగా మారారు? పదేళ్ల పాటు రాజు ఎక్కడికి వెళ్లాడు? అక్కడ ఏం చేశాడు? కన్నాభాయ్ ఆగడాలకు రాజు ఎలా చెక్ పెట్టాడు? ప్రాణంగా ప్రేమించిన తారకు రాజు ఎందుకు దూరమయ్యాడు? చివరకు కోతా ఎవరి ఆధీనంలోకి వెళ్లింది? అనేది తెలియాలంటే ‘కింగ్ ఆఫ్ కోతా’చూడాల్సిందే. ఎలా ఉందంటే.. గ్యాంగ్స్టర్స్ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో చాలా వరకు విజయం సాధించాయి. దానికి కారణం కథ, కథనం కొత్తగా ఉండడం. ‘కింగ్ ఆఫ్ కొత్త’లో అసలు కొత్తదనం అనేదే లేదు. అవే కత్తి పోట్లు.. తుపాకుల తూట్లు.. వెన్నుపోట్లు. కథ పరంగా ఎక్కడా కొత్తగా అనిపించదు కానీ కథనం మాత్రం కాస్త వెరైటీగా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఆ విషయంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. ఈ చిత్రంలో మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్‌తో పాటు ప్రేమ, స్నేహ బంధం..ఇలా అన్ని అంశాలు ఉన్నాయి . కానీ వాటిని ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా చూపించడంలో డైరెక్టర్ విఫలం అయ్యాడు. ఈ మూవీ కథ కోత అనే పట్టణంలో జరుగుతుంది. (కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం. అదొక ఫిక్షనల్ టౌన్. అయితే తెలుగులో కొత్త అనే పదానికి కొత్తది అనే అర్థం వస్తుంది. అందుకే డబ్బింగ్లో కోతా అని వాడారు ) ప్రారంభమవుతుంది. కోతా పట్టణానికి కొత్తగా వచ్చిన సీఐ శావుల్కి అక్కడి ఎస్సై టోని.. రాజు, కన్నాల ఫ్లాష్‌బ్యాక్ చెప్పడం ప్రారంభించినప్పటి నుంచి కథపై ఆసక్తి పెరుగుతుంది. ఫుట్‌బాల్ పోటీకి సంబంధించిన సన్నివేశం ఆకట్టుకుంటుంది. ఇక తారతో రాజు ప్రేమాయణానికి సంబంధించినసన్నివేశాలు రొటీన్‌గా సాగుతుంది. రంజియ్ భాయ్ పాత్ర మాట్లేడే ఇంగ్లీష్ నవ్వులు పూయిస్తుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్‌లో కథ ఏమీ ఉండదు.. అలా సాగిపోతుంది అంతే. ఇక ఇంటర్వెల్ సీన్ తర్వాత సెకండాఫ్ ఎలా ఉండబోతుందనేది ఈజీగా అర్థమవుతుంది. రాజు తిరిగి కోతాకి రావడం.. కన్నాభాయ్ మనుషులపై దాడి చేయడం..ఇలా రొటీన్‌గా కథ సాగుతుంది. ఇక క్లైమాక్స్‌కి అరగంట ముందు వరుసగా ట్విస్టులు ఉంటాయి. కాని అవి బోరింగ్ అనిపిస్తాయి. ఇక సినిమా ముగుస్తుందిలే అని అనుకున్న ప్రతిసారి మరో మలుపు రావడం.. సాగదీతగా అనిపిస్తుంది. ఇక దర్శకుడిని మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే.. పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకోవడం. ఎవరెలా చేశారంటే.. దుల్కర్ సల్మాన్ గ్యాంగ్‌స్టర్‌గా చేయడం ఇదే తొలిసారి. అయినప్పటికీ తనదైన నటనతో గ్యాంగ్‌స్టర్ రాజు పాత్రకి న్యాయం చేశాడు. యాక్షన్స్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. ఇక దుల్కర్ తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర షబిర్ది. కన్నా అలియాస్ కన్నాభాయ్ పాత్రలో ఒదిగిపోయాడు. రెండు డిఫరెంట్ వేరియషన్స్ ఉన్న పాత్ర తనది. ఇక గ్యాంగ్‌స్టర్ రాజు ప్రియురాలు తారాగా ఐశ్వర్య లక్ష్మీ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. హీరో సోదరి రీతూగా అనిఖా సురేంద్రన్ తన పాత్రకు న్యాం చేసింది. సీఐ శావుల్గా ప్రసన్న, ఎసై టోనీగా గోకుల్ సురేశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం జేక్స్ బిజోయ్. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచేశాడు. బీజీఎం కారణంగా కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపించాయి. నిమేష్ రవి సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈ సినిమాలో ప్రతి పాత్ర.. కథని మలుపు తిప్పేదే
‘‘నేను ఇప్పటి వరకూ గ్యాంగ్‌స్టర్ సినిమాలు చేయలేదు. తొలిసారి ‘కింగ్ ఆఫ్ కొత్త’ చేశాను. ఈ కథ రెండు పీరియడ్స్‌లో ఉంటుంది. పాటలు, యాక్షన్ సీక్వెన్స్, ఫుట్ బాల్.. ఇలా అన్ని వాణిజ్య అంశాలున్నాయి. ఇందులో ప్రతి పాత్ర కథని మలుపు తిప్పుతుంది. అది నాకు చాలా నచ్చింది’’ అని హీరో దుల్కర్ సల్మాన్ అన్నారు. అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, మలయాళం, తమిళ్, హిందీలో ఈ నెల 24న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ పంచుకున్న విశేషాలు.... ► అభిలాష్, నేను చిన్ననాటి స్నేహితులం. ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటే ‘కింగ్ ఆఫ్ కొత్త’కి కుదిరింది. మంచి గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. స్నేహం కూడా ఉంటుంది. నేను ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను. కానీ, ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ఇవ్వాలని ఈ మూవీ కోసం ఏడాది శ్రమించా. సాంకేతికంగా ఈ మూవీ పెద్ద స్థాయిలో ఉంటుంది. ► కొత్త అంటే మలయాళంలో టౌన్ అని అర్థం. అదొక ఫిక్షనల్ టౌన్. అయితే తెలుగులో కొత్త అనే పదానికి కొత్తది అనే అర్థం వస్తుంది. అందుకే డబ్బింగ్లో కోత అని చెప్పాం. ప్రేక్షకులకు నేను ఎక్కువగా లవర్ బాయ్‌గా గుర్తుంటాను(నవ్వుతూ). ఒకేరకమైన కథలు, పాత్రలు చేయాలని ఉండదు. ప్రేక్షకులతో పాటు నటుడిగా నాకు నేను సర్ప్రైజ్ అయ్యే పాత్రలు చేయాలని ఉంటుంది. ఈ మూవీ కోసం తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను. ఓ రకంగా ఇప్పుడు నేను డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని కూడా (నవ్వుతూ). ► ఐశ్వర్య లక్ష్మి చాలా ప్రతిభ ఉన్న నటి. ఈ మూవీలో తన పాత్ర కీలకంగా ఉంటుంది. నిమేష్ రవి విజువల్స్, జాక్స్ బిజోయ్ సంగీతం సినిమాకు ప్లస్. సినిమాని కాపాడాలి, మంచి సమయంలో రిలీజ్ చేయాలంటే మనమే నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్లో ఉండాలని వేఫేరర్ ఫిల్మ్స్ స్టార్ట్ చేశాను. ప్రస్తుతం నేను, రానా కలిసి ‘కాంత’ చేస్తున్నాం. తెలుగు, ఇతర పరిశ్రమల నుంచి నేర్చుకున్న ఎన్నో విషయాలను మలయాళంలో అనుసరిస్తున్నాను. ప్రస్తుతం తెలుగులో వెంకీ అట్లూరిగారి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా చేస్తున్నాను. మరికొన్ని కథలు వింటున్నాను. ప్రభాస్‌గారి ‘కల్కి 2898 ఏడీ’లో నేను నటిస్తున్నానా? లేదా? అన్నది మేకర్సే చెప్పాలి. -
నా స్క్రీన్ టైమ్ తక్కువే కానీ..
‘‘దర్శకుడు అభిలాష్ జోషి ‘కింగ్ ఆఫ్ కోత’ సినిమా స్కేల్ గురించి చెప్పినప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ప్రొడక్షన్ పరంగా చాలా పెద్ద సినిమా. ప్రతి షాట్ చాలా నిండుగా అచ్చమైన తెలుగు సినిమాలా ఉంటుంది. మలయాళంలో ఇంత పెద్ద స్కేల్ సినిమాలో భాగం కావడం నాకు ఇదే తొలిసారి’’ అని హీరోయిన్ ఐశ్వర్యా లక్ష్మి అన్నారు. దుల్కర్ సల్మాన్, ఐశ్వర్యా లక్ష్మి జంటగా అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన చిత్రం ‘కింగ్ ఆఫ్ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా లక్ష్మి మాట్లాడుతూ– ‘‘కింగ్ ఆఫ్ కోత’లో తార పాత్ర చేశాను. దుల్కర్ పేరు రాజు. తార, రాజు మధ్య అందమైన లవ్ స్టోరీ ఉంటుంది. నా పాత్రకి స్క్రీన్ టైమ్ తక్కువగానే ఉన్నప్పటికీ కథలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు చేసినప్పుడు సవాల్‌గా అనిపించింది. నాకంటూ డ్రీమ్ రోల్స్ ప్రత్యేకంగా లేవు. కానీ, నేను చేసిన పాత్రలు గుర్తుండిపోవాలని కోరుకుంటాను. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
'King Of Kotha' Pre Release Event: దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోత’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
దుమారం రేపిన నాని వ్యాఖ్యలు.. టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ ఫైర్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన 'కింగ్ ఆఫ్ కోతా' పాన్ ఇండియా రేంజ్లో ఆగష్టు 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో తాజాగ జరిపారు. ఈ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. (ఇదీ చదవండి: వడివేలు ఏం అడుగుతాడో నాకు తెలుసు: సినీ నటి) ఈ కార్యక్రమంలో పాన్ ఇండియా హీరో గురించి నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ ఈవెంట్లో పాన్ ఇండియా గురించి నాని ఇలా చెప్పుకొచ్చాడు. 'మనందరం ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అంటున్నాం. ఆ పదం నాకు పెద్దగా నచ్చదు. కానీ, నాకు తెలిసిన యాక్టర్స్‌లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ మాత్రమే. ఎందుకంటే ఓ హిందీ దర్శకుడు దుల్కర్ కోసం కథ రాసుకుంటాడు. ఓ తెలుగు దర్శకుడు తన కోసం కథ రాసుకుంటాడు. ఓ తమిళ దర్శకుడు కూడా దుల్కర్ కోసం స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఓ మలయాళ దర్శకుడూ అతని కోసం కథ రాస్తాడు. ఓ పాన్ ఇండియా యాక్టర్‌కు నిజమైన నిర్వచనం ఇదే' అని అన్నారు నాని. దీంతో టాలీవుడ్లో ఉండే పాన్ ఇండియా హీరోల ఫ్యాన్స్ అందరూ నానిపై ఫైర్ అవుతున్నారు. దుల్కర్ మంచి నటుడే... పాన్ ఇండియా రేంజ్‌ను అందుకునే అర్హత ఆయనకు ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదని తెలుపుతూనే నాని వ్యాఖ్యలను పలువురు తప్పుబడుతున్నారు. దుల్కర్ మాత్రమే పాన్ ఇండియా హీరో అని ఎలా చెబుతావ్ నాని అంటూ ఓ రేంజ్లో టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌కి ఎప్పటికీ చేరుకోలేడు కాబట్టే నానికి ఆ పదం పెద్దగా నచ్చదని అంటున్నారు. (ఇదీ చదవండి: మీ గౌరవం ఏంటో తెలుసుకోండి.. అలా అయితే జీవించనక్కర్లేదు: సమంత) సౌత్ ఇండియా ప్రస్తుత టాప్ హీరోల్లో అందరికంటే ముందుగా బాలీవుడ్లో జెండా పాతిన ప్రభాస్.. ఆ తర్వాత రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్లందరూ గల్లీ హీరోలు అనుకుంటున్నావా..? అంటూ నానిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 'అసలు నాని ఎవడు.. ? ఒకరికి పాన్ ఇండియా హీరో అని గుర్తింపు ఇవ్వడానికి.. సినిమాలు చూసేది మేము. గుర్తింపు ఇవ్వాల్సింది మేము. ఇలాంటి ఆటిట్యూడ్ వ్యాఖ్యలతో పాటు కొంచెం నోటిదూల తగ్గించుకుంటే మంచిది.' అని వారు సలహా ఇస్తున్నారు.