మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన 'కింగ్ ఆఫ్ కోతా' పాన్ ఇండియా రేంజ్‌లో ఆగష్టు 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో తాజాగ జరిపారు. ఈ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
(ఇదీ చదవండి: వడివేలు ఏం అడుగుతాడో నాకు తెలుసు: సినీ నటి)
ఈ కార్యక్రమంలో పాన్ ఇండియా హీరో గురించి నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ ఈవెంట్‌లో పాన్ ఇండియా గురించి నాని ఇలా చెప్పుకొచ్చాడు. 'మనందరం ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అంటున్నాం. ఆ పదం నాకు పెద్దగా నచ్చదు. కానీ, నాకు తెలిసిన యాక్టర్స్‌లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ మాత్రమే. ఎందుకంటే ఓ హిందీ దర్శకుడు దుల్కర్ కోసం కథ రాసుకుంటాడు. ఓ తెలుగు దర్శకుడు తన కోసం కథ రాసుకుంటాడు. ఓ తమిళ దర్శకుడు కూడా దుల్కర్ కోసం స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఓ మలయాళ దర్శకుడూ అతని కోసం కథ రాస్తాడు. ఓ పాన్ ఇండియా యాక్టర్‌కు నిజమైన నిర్వచనం ఇదే' అని అన్నారు నాని.
దీంతో టాలీవుడ్‌లో ఉండే పాన్ ఇండియా హీరోల ఫ్యాన్స్ అందరూ నానిపై ఫైర్ అవుతున్నారు. దుల్కర్ మంచి నటుడే... పాన్ ఇండియా రేంజ్‌ను అందుకునే అర్హత ఆయనకు ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదని తెలుపుతూనే నాని వ్యాఖ్యలను పలువురు తప్పుబడుతున్నారు. దుల్కర్ మాత్రమే పాన్ ఇండియా హీరో అని ఎలా చెబుతావ్ నాని అంటూ ఓ రేంజ్‌లో టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌కి ఎప్పటికీ చేరుకోలేడు కాబట్టే నానికి ఆ పదం పెద్దగా నచ్చదని అంటున్నారు.
(ఇదీ చదవండి: మీ గౌరవం ఏంటో తెలుసుకోండి.. అలా అయితే జీవించనక్కర్లేదు: సమంత)
సౌత్ ఇండియా ప్రస్తుత టాప్ హీరోల్లో అందరికంటే ముందుగా బాలీవుడ్‌లో జెండా పాతిన ప్రభాస్.. ఆ తర్వాత రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్లందరూ గల్లీ హీరోలు అనుకుంటున్నావా..? అంటూ నానిపై నెటిజన‍్లు ఫైర్ అవుతున్నారు. 'అసలు నాని ఎవడు.. ? ఒకరికి పాన్ ఇండియా హీరో అని గుర్తింపు ఇవ్వడానికి.. సినిమాలు చూసేది మేము. గుర్తింపు ఇవ్వాల్సింది మేము. ఇలాంటి ఆటిట్యూడ్ వ్యాఖ్యలతో పాటు కొంచెం నోటిదూల తగ్గించుకుంటే మంచిది.' అని వారు సలహా ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment