కింగ్‌ ఆఫ్‌ కొత్త.. దుల్కర్‌ సినిమాకు పేలవమైన కలెక్షన్స్‌ | Dulquer Salmaan King Of Kotha Day 1 Box Office Collection | Sakshi
Sakshi News home page

King Of Kotha Movie: సీతారామం హీరో కొత్త సినిమా.. తొలి రోజు కలెక్షన్స్‌ ఎంతంటే? ఓటీటీ పార్ట్‌నర్‌ ఏదో తెలుసా?

Published Fri, Aug 25 2023 11:49 AM | Last Updated on Fri, Aug 25 2023 12:40 PM

Dulquer Salmaan King Of Kotha Day 1 Box Office Collection - Sakshi

దుల్కర్‌ సల్మాన్‌.. ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ కొత్తదనాన్ని ఎంకరేజ్‌ చేస్తుంటాడీ హీరో. సీతారామం సినిమాతో తెలుగువారికీ దగ్గరైన ఈ హీరో తొలిసారి పూర్తి మాస్‌ యాక్షన్‌ సినిమా చేశాడు. దుల్కర్‌ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’. అభిలాష్‌ జోషి దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీ స్టూడియోస్, వేఫేరర్‌ ఫిల్మ్స్‌ నిర్మించాయి. తెలుగు, మలయాళం, తమిళ్, హిందీలో ఈ నెల 24న ఈ సినిమా రిలీజైంది. అన్నట్లు అన్ని భాషల్లోనూ దుల్కర్‌ తనే స్వయంగా డబ్బింగ్‌ చెప్పాడు.

గురువారం విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఈ గ్యాంగ్‌స్టర్‌ సినిమా అంతగా వర్కవుట్‌ కానట్లు కనిపించింది. ఫలితంగా ఈ చిత్రం రూ.7.70 కోట్ల మేర కలెక్షన్స్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.60 కోట్ల మేర బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌ డే పది కోట్లు కూడా రాబట్టలేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. రానున్న రోజుల్లోనూ కలెక్షన్స్‌ ఇలాగే ఉంటే డిజాస్టర్‌ దిశగా ‍ప్రయాణించడం ఖాయం అని చెప్తున్నారు.

ఈ సినిమా ఓటీటీ హక్కుల విషయానికి వస్తే.. ఇప్పటికే డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఈ మూవీ డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకు పెద్దగా పాజిటివ్‌ బజ్‌ లేదు, కలెక్షన్స్‌ కూడా డల్‌ ఉన్నందున వచ్చే నెలలో ఓటీటీలో ప్రత్యక్షం కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మొదట్లో ఈ సినిమా పేరును కింగ్‌ ఆఫ్‌ కోతగానే ఉంచారు. దుల్కర్‌ సైతం అలాగే పలికాడు. కానీ మలయాళంలో కొత్త అంటే టౌన్‌ అని అర్థం వస్తుండటంతో దాన్ని మార్చేసి కింగ్‌ ఆఫ్‌ కొత్తగా రిలీజ్‌ చేశారు.

చదవండి: థియేటర్‌లో రిలీజైన వారం రోజులకే ఓటీటీలోకి.. మరో మూడు సినిమాలు స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement