నటీనటులకు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం సర్వ సాధారణమైపోయింది. ఇటీవల పలువురు స్టార్ హీరోయిన్లపై దారుణమైన ట్రోల్స్ చేయడం మీరు చూసే ఉంటారు. అలాగే తాజాగా తనకు అలాంటి అనుభవాలు ఎదురైనట్లు నటి వెల్లడించింది. ఆమె పేరే రితిక సింగ్. తెలుగు పెద్దగా పరిచయం లేని పేరు. 2017 సంవత్సరంలో వెంకటేశ్ సరసన గురు సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది భామ. ఆ తర్వాత నీవెవరో, శివలింగ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన ట్రోల్స్ తనను ఎంతో బాధించాయని తెలిపింది. వాటితో చాలా ఇబ్బందులు ఎదురైనట్లు వాపోయింది నటి.
ముంబయిలో జన్మించిన రితిక సింగ్ క్రీడాకారిణి కూడా. ఆమె మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించారు. 2009లో భారత్ తరపున ఆసియా గేమ్స్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత 2012 లో ఇరుదు చుట్రు అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ 2016లో మాధవన్‌తో సాల కడూస్ సినిమాకు మంచి పేరు సంపాదించింది. తాజాగా ఆమె నటించిన కార్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది.
నా ఫోటోలు దారుణంగా ఎడిట్ చేశారు
రితిక సింగ్ మాట్లాడుతూ..' సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ఎంతగానో బాధించాయి. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు నన్ను ఇబ్బంది పెట్టాయి. వాటితో నా గుండె పగిలినంత పనైంది. నాకు కుటుంబం ఉంది. ఇవి చూస్తే వాళ్లు చాలా బాధపడతారు. నేను కోరుకునేది ఒక్కటే ఆడవారిని అందరూ గౌరవించాలి. మిడిల్ క్లాస్ అయినా.. సెలబ్రిటీ అయినా సమానంగా చూడాలి. అమ్మాయిలకు కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి. స్కూల్స్‌లో వారానికి కనీసం ఒక్కసారైనా సెల్ఫ్ డిఫెన్సివ్ క్లాసులు నిర్వహించాలి. నేను చిన్నప్పుడే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. తర్వాత జనరేషన్ పిల్లలకు చాలా త్వరగా సమాజం పట్ల అవగాహన కల‍్పించాలి.' అంటూ తన బాధను వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment